The Quran in Telugu - Surah Fatiha translated into Telugu, Surah Al-Fatihah in Telugu. We provide accurate translation of Surah Fatiha in Telugu - التيلجو, Verses 7 - Surah Number 1 - Page 1.
بِسْمِ اللَّهِ الرَّحْمَٰنِ الرَّحِيمِ (1) అనంత కరుణామయుడు అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో |
الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ (2) సర్వలోకాలకు ప్రభువైన అల్లాహ్ మాత్రమే సమస్త స్తోత్రాలకు అర్హుడు |
الرَّحْمَٰنِ الرَّحِيمِ (3) అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత |
مَالِكِ يَوْمِ الدِّينِ (4) తీర్పుదినానికి స్వామి |
إِيَّاكَ نَعْبُدُ وَإِيَّاكَ نَسْتَعِينُ (5) మేము నిన్నే ఆరాధిస్తున్నాము మరియు నీ సహాయాన్నే అర్థిస్తున్నాము |
اهْدِنَا الصِّرَاطَ الْمُسْتَقِيمَ (6) మాకు ఋజుమార్గం వైపునకు మార్గదర్శకత్వం చేయి |
صِرَاطَ الَّذِينَ أَنْعَمْتَ عَلَيْهِمْ غَيْرِ الْمَغْضُوبِ عَلَيْهِمْ وَلَا الضَّالِّينَ (7) నీవు అనుగ్రహించిన వారి మార్గం మాత్రమే (చూపు) నీ ఆగ్రహానికి గురి అయిన వారి (మార్గం కానీ) లేక మార్గభ్రష్టులైన వారి (మార్గం కానీ) కాదు |