The Quran in Telugu - Surah Qariah translated into Telugu, Surah Al-Qariah in Telugu. We provide accurate translation of Surah Qariah in Telugu - التيلجو, Verses 11 - Surah Number 101 - Page 600.
الْقَارِعَةُ (1) ఆ! అదరగొట్టే మహా ఉపద్రవం |
مَا الْقَارِعَةُ (2) ఏమిటా అదరగొట్టే మహా ఉపద్రవం |
وَمَا أَدْرَاكَ مَا الْقَارِعَةُ (3) మరియు ఆ అదరగొట్టే మహా ఉపద్రవం, అంటే ఏమిటో నీకేం తెలుసు |
يَوْمَ يَكُونُ النَّاسُ كَالْفَرَاشِ الْمَبْثُوثِ (4) ఆ రోజు మానవులు చెల్లాచెదురైన చిమ్మెటల వలే అయిపోతారు |
وَتَكُونُ الْجِبَالُ كَالْعِهْنِ الْمَنفُوشِ (5) మరియు పర్వతాలు రంగు రంగుల ఏకిన దూది వలే అయి పోతాయి |
فَأَمَّا مَن ثَقُلَتْ مَوَازِينُهُ (6) అప్పుడు ఎవడి త్రాసుపళ్ళాలు (సత్కార్యాలతో) బరువుగా ఉంటాయో |
فَهُوَ فِي عِيشَةٍ رَّاضِيَةٍ (7) అతడు (స్వర్గంలో) సుఖవంతమైన జీవితం గడుపుతాడు |
وَأَمَّا مَنْ خَفَّتْ مَوَازِينُهُ (8) మరియు ఎవడి (సత్కార్యాల) త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో |
فَأُمُّهُ هَاوِيَةٌ (9) అతని నివాసం అధః పాతాళమే |
وَمَا أَدْرَاكَ مَا هِيَهْ (10) మరియు అది ఏమిటో నీకేం తెలుసు |
نَارٌ حَامِيَةٌ (11) అదొక భగభగమండే అగ్ని (గుండం) |