The Quran in Telugu - Surah Takathur translated into Telugu, Surah At-Takathur in Telugu. We provide accurate translation of Surah Takathur in Telugu - التيلجو, Verses 8 - Surah Number 102 - Page 600.
أَلْهَاكُمُ التَّكَاثُرُ (1) (ఇహలోక) పేరాస మిమ్మల్ని ఏమరుపాటులో పడవేసింది |
حَتَّىٰ زُرْتُمُ الْمَقَابِرَ (2) మీరు గోరీలలోకి చేరే వరకు |
كَلَّا سَوْفَ تَعْلَمُونَ (3) అలా కాదు! త్వరలోనే మీరు తెలుసు కుంటారు |
ثُمَّ كَلَّا سَوْفَ تَعْلَمُونَ (4) మరొకసారి (వినండి)! వాస్తవంగా, మీరు అతి త్వరలోనే తెలుసుకుంటారు |
كَلَّا لَوْ تَعْلَمُونَ عِلْمَ الْيَقِينِ (5) ఎంత మాత్రము కాదు! ఒకవేళ మీరు నిశ్చిత జ్ఞానంతో తెలుసుకొని ఉంటే (మీ వైఖరి ఇలా ఉండేది కాదు) |
لَتَرَوُنَّ الْجَحِيمَ (6) నిశ్చయంగా, మీరు భగభగ మండే నరకాగ్నిని చూడగలరు |
ثُمَّ لَتَرَوُنَّهَا عَيْنَ الْيَقِينِ (7) మళ్ళీ అంటున్నాను! మీరు తప్పక దానిని (నరకాగ్నిని) నిస్సంకోచమైన దృష్టితో చూడగలరు |
ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ (8) అప్పుడు, ఆ రోజు మీరు (ఈ జీవితంలో అనుభవించిన) సౌఖ్యాలను గురించి తప్పక ప్రశ్నించబడతారు |