لَا أُقْسِمُ بِيَوْمِ الْقِيَامَةِ (1) అలా కాదు! నేను పునరుత్థాన దినపు శపథం చేస్తున్నాను |
وَلَا أُقْسِمُ بِالنَّفْسِ اللَّوَّامَةِ (2) అలా కాదు! నేను తనను తాను నిందించుకునే అంతరాత్మ శపథం చేస్తున్నాను |
أَيَحْسَبُ الْإِنسَانُ أَلَّن نَّجْمَعَ عِظَامَهُ (3) ఏమిటి? మేము అతని ఎముకలను ప్రోగు చేయలేమని మానవుడు భావిస్తున్నాడా |
بَلَىٰ قَادِرِينَ عَلَىٰ أَن نُّسَوِّيَ بَنَانَهُ (4) వాస్తవానికి! మేము అతని వ్రేళ్ళ కొనలను గూడా సరిగ్గా సవరించగల సమర్ధులము |
بَلْ يُرِيدُ الْإِنسَانُ لِيَفْجُرَ أَمَامَهُ (5) అయినా, మానవుడు ఇక మీద కూడా దుష్కార్యాలు చేయగోరుతున్నాడు |
يَسْأَلُ أَيَّانَ يَوْمُ الْقِيَامَةِ (6) అతడు: "అయితే ఈ పునరుత్థాన దినం ఎప్పుడు వస్తుంది?" అని అడుగుతున్నాడు |
فَإِذَا بَرِقَ الْبَصَرُ (7) కళ్ళు మిరుమిట్లుగొన్నప్పుడు |
وَخَسَفَ الْقَمَرُ (8) మరియు చంద్రునికి గ్రహణం పట్టినప్పుడు |
وَجُمِعَ الشَّمْسُ وَالْقَمَرُ (9) మరియు సూర్యచంద్రులు కలిపి వేయబడినప్పుడు |
يَقُولُ الْإِنسَانُ يَوْمَئِذٍ أَيْنَ الْمَفَرُّ (10) మానవుడు ఆ రోజు: "ఎక్కడికి పారి పోవాలి?" అని అంటాడు |
كَلَّا لَا وَزَرَ (11) అది కాదు! (అతనికి) ఎక్కడా శరణం ఉండదు |
إِلَىٰ رَبِّكَ يَوْمَئِذٍ الْمُسْتَقَرُّ (12) ఆ రోజు నీ ప్రభువు వద్దనే ఆశ్రయం ఉంటుంది |
يُنَبَّأُ الْإِنسَانُ يَوْمَئِذٍ بِمَا قَدَّمَ وَأَخَّرَ (13) ఆ రోజు మానవుడికి, తాను చేసి పంపంది మరియు వెనక వదలింది అంతా తెలుపబడుతుంది |
بَلِ الْإِنسَانُ عَلَىٰ نَفْسِهِ بَصِيرَةٌ (14) అలా కాదు! మానవుడు తనకు విరుద్ధంగా, తానే సాక్షి అవుతాడు |
وَلَوْ أَلْقَىٰ مَعَاذِيرَهُ (15) మరియు అతడు ఎన్ని సాకులు చెప్పినా సరే |
لَا تُحَرِّكْ بِهِ لِسَانَكَ لِتَعْجَلَ بِهِ (16) నీవు దీనిని (ఈ ఖుర్ఆన్ ను గ్రహించటానికి) నీ నాలుకను త్వరత్వరగా కదిలించకు |
إِنَّ عَلَيْنَا جَمْعَهُ وَقُرْآنَهُ (17) నిశ్చయంగా, దీనిని సేకరించటం మరియు దీనిని చదివించటం మా బాధ్యతే |
فَإِذَا قَرَأْنَاهُ فَاتَّبِعْ قُرْآنَهُ (18) కావున మేము దీనిని పఠించినప్పుడు నీవు ఆ పారాయణాన్ని శ్రద్ధగా అనుసరించు |
ثُمَّ إِنَّ عَلَيْنَا بَيَانَهُ (19) ఇక దాని భావాన్ని అర్థమయ్యేలా చేయటం మా బాధ్యతే |
كَلَّا بَلْ تُحِبُّونَ الْعَاجِلَةَ (20) అలా కాదు! వాస్తవానికి మీరు అనిశ్చితమైన (ఇహలోక జీవితం పట్ల) వ్యామోహం పెంచుకుంటున్నారు |
وَتَذَرُونَ الْآخِرَةَ (21) మరియు పరలోక జీవితాన్ని వదలి పెడుతున్నారు |
وُجُوهٌ يَوْمَئِذٍ نَّاضِرَةٌ (22) ఆ రోజున కొన్ని ముఖాలు కళకళ లాడుతూ ఉంటాయి |
إِلَىٰ رَبِّهَا نَاظِرَةٌ (23) తమ ప్రభువు (అల్లాహ్) వైపునకు చూస్తూ ఉంటాయి |
وَوُجُوهٌ يَوْمَئِذٍ بَاسِرَةٌ (24) మరికొన్ని ముఖాలు ఆ రోజు, కాంతిహీనమై ఉంటాయి |
تَظُنُّ أَن يُفْعَلَ بِهَا فَاقِرَةٌ (25) నడుమును విరిచే బాధ వారికి కలుగుతుందని భావించి |
كَلَّا إِذَا بَلَغَتِ التَّرَاقِيَ (26) అలా కాదు! ప్రాణం గొంతులోకి వచ్చినపుడు |
وَقِيلَ مَنْ ۜ رَاقٍ (27) మరియు: "ఎవడైనా ఉన్నాడా? అతనిని (మరణం నుండి) కాపాడటానికి?" అని అనబడుతుంది |
وَظَنَّ أَنَّهُ الْفِرَاقُ (28) మరియు అప్పుడతడు వాస్తవానికి తన ఎడబాటు కాలం వచ్చిందని గ్రహిస్తాడు |
وَالْتَفَّتِ السَّاقُ بِالسَّاقِ (29) మరియు ఒక పిక్క మరొక పిక్కతో కలిసిపోతుంది |
إِلَىٰ رَبِّكَ يَوْمَئِذٍ الْمَسَاقُ (30) ఆ రోజు నీ ప్రభువు వైపునకే ప్రయాణం ఉంటుంది |
فَلَا صَدَّقَ وَلَا صَلَّىٰ (31) కాని అతడు సత్యాన్ని నమ్మలేదు మరియు నమాజ్ సలపనూ లేదు |
وَلَٰكِن كَذَّبَ وَتَوَلَّىٰ (32) మరియు అతడు (ఈ సందేశాన్ని) అసత్యమన్నాడు మరియు దాని నుండి వెనుదిరిగాడు |
ثُمَّ ذَهَبَ إِلَىٰ أَهْلِهِ يَتَمَطَّىٰ (33) ఆ తరువాత నిక్కుతూ నీల్గుతూ తన ఇంటివారి వద్దకు పోయాడు |
أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰ (34) (ఓ సత్యతిరస్కారుడా!) నీకు నాశనం మీద నాశనం రానున్నది |
ثُمَّ أَوْلَىٰ لَكَ فَأَوْلَىٰ (35) అవును, నీకు నాశనం మీద నాశనం రానున్నది |
أَيَحْسَبُ الْإِنسَانُ أَن يُتْرَكَ سُدًى (36) ఏమిటీ? మానవుడు తనను విచ్చల విడిగా వదలిపెట్టండం జరుగుతుందని భావిస్తున్నాడా |
أَلَمْ يَكُ نُطْفَةً مِّن مَّنِيٍّ يُمْنَىٰ (37) ఏమీ? అతడు ప్రసరింప జేయబడిన ఒక వీర్యబిందువు కాడా |
ثُمَّ كَانَ عَلَقَةً فَخَلَقَ فَسَوَّىٰ (38) తరువాత ఒక రక్తకండగా (జలగగా) ఉండేవాడు కాదా? తరువాత ఆయనే (అల్లాహ్ యే) అతనిని సృష్టించి అతని రూపాన్ని తీర్చిదిద్దాడు |
فَجَعَلَ مِنْهُ الزَّوْجَيْنِ الذَّكَرَ وَالْأُنثَىٰ (39) ఆ తరువాత అతని నుండి స్త్రీ పురుషుల రెండు రకాలను (జాతులను) ఏర్పరచాడు |
أَلَيْسَ ذَٰلِكَ بِقَادِرٍ عَلَىٰ أَن يُحْيِيَ الْمَوْتَىٰ (40) అలాంటప్పుడు ఆయనకు మరణించిన వారిని మళ్ళీ బ్రతికించే సామర్థ్యం లేదా |