هَلْ أَتَاكَ حَدِيثُ الْغَاشِيَةِ (1) హఠాత్తుగా ఆసన్నమయ్యే ఆ విపత్తు (పునరుత్థాన దినపు) సమాచారం నీకు అందిందా |
وُجُوهٌ يَوْمَئِذٍ خَاشِعَةٌ (2) కొన్ని ముఖాలు ఆ రోజు వాలి (క్రుంగి) పోయి ఉంటాయి |
عَامِلَةٌ نَّاصِبَةٌ (3) (ప్రపంచంలోని వృథా) శ్రమకు, (పరలోకంలో జరిగే) అవమానానికి |
تَصْلَىٰ نَارًا حَامِيَةً (4) వారు దహించే అగ్నిలో పడి కాలుతారు |
تُسْقَىٰ مِنْ عَيْنٍ آنِيَةٍ (5) వారికి సలసల కాగే చెలమ నీరు త్రాగటానికి ఇవ్వబడుతుంది |
لَّيْسَ لَهُمْ طَعَامٌ إِلَّا مِن ضَرِيعٍ (6) వారికి చేదు ముళ్ళగడ్డ (దరీఅ) తప్ప మరొక ఆహారం ఉండదు |
لَّا يُسْمِنُ وَلَا يُغْنِي مِن جُوعٍ (7) అది వారికి బలమూ నియ్యదు మరియు ఆకలీ తీర్చదు |
وُجُوهٌ يَوْمَئِذٍ نَّاعِمَةٌ (8) ఆ రోజున, మరికొన్ని ముఖాలు కళకళలాడుతూ ఉంటాయి |
لِّسَعْيِهَا رَاضِيَةٌ (9) తాము చేసుకున్న సత్కార్యాలకు (ఫలితాలకు) వారు సంతోషపడుతూ ఉంటారు |
فِي جَنَّةٍ عَالِيَةٍ (10) అత్యున్నతమైన స్వర్గవనంలో |
لَّا تَسْمَعُ فِيهَا لَاغِيَةً (11) అందులో వారు ఎలాంటి వృథా మాటలు వినరు |
فِيهَا عَيْنٌ جَارِيَةٌ (12) అందులో ప్రవహించే సెలయేళ్ళు ఉంటాయి |
فِيهَا سُرُرٌ مَّرْفُوعَةٌ (13) అందులో ఎత్తైన ఆసనాలు ఉంటాయి |
وَأَكْوَابٌ مَّوْضُوعَةٌ (14) మరియు పేర్చబడిన (మధు) పాత్రలు |
وَنَمَارِقُ مَصْفُوفَةٌ (15) మరియు వరుసలుగా వేయబడిన, దిండ్లు |
وَزَرَابِيُّ مَبْثُوثَةٌ (16) మరియు పరచబడిన నాణ్యమైన తివాచీలు |
أَفَلَا يَنظُرُونَ إِلَى الْإِبِلِ كَيْفَ خُلِقَتْ (17) ఏమిటీ? వారు ఒంటెల వైపు చూడరా? అవి ఎలా సృష్టించబడ్డాయో |
وَإِلَى السَّمَاءِ كَيْفَ رُفِعَتْ (18) మరియు ఆకాశం వైపుకు (చూడరా)? అది ఎలా పైకి ఎత్తబడి ఉందో |
وَإِلَى الْجِبَالِ كَيْفَ نُصِبَتْ (19) మరియు కొండల వైపుకు చూడరా?అవి ఎలా గట్టిగా నాటబడి ఉన్నాయో |
وَإِلَى الْأَرْضِ كَيْفَ سُطِحَتْ (20) మరియు భూమి వైపుకు (చూడరా)? అది ఎలా విశాలంగా పరచబడి ఉందో |
فَذَكِّرْ إِنَّمَا أَنتَ مُذَكِّرٌ (21) కావున (ఓ ముహమ్మద్!) నీవు హితోపదేశం చేస్తూ ఉండు, వాస్తవానికి నీవు కేవలం హితోపదేశం చేసే వాడవు మాత్రమే |
لَّسْتَ عَلَيْهِم بِمُصَيْطِرٍ (22) నీవు వారిని (విశ్వసించమని) బలవంతం చేసేవాడవు కావు |
إِلَّا مَن تَوَلَّىٰ وَكَفَرَ (23) ఇక, ఎవడైతే వెనుదిరుగుతాడో మరియు సత్యాన్ని తిరస్కరిస్తాడో |
فَيُعَذِّبُهُ اللَّهُ الْعَذَابَ الْأَكْبَرَ (24) అప్పుడు అతనికి అల్లాహ్ ఘోరశిక్ష విధిస్తాడు |
إِنَّ إِلَيْنَا إِيَابَهُمْ (25) నిశ్చయంగా, మా వైపునకే వారి మరలింపు ఉంది |
ثُمَّ إِنَّ عَلَيْنَا حِسَابَهُم (26) ఆ తర్వాత నిశ్చయంగా, వారి లెక్క తీసుకునేదీ మేమే |