The Quran in Telugu - Surah Humazah translated into Telugu, Surah Al-Humazah in Telugu. We provide accurate translation of Surah Humazah in Telugu - التيلجو, Verses 9 - Surah Number 104 - Page 601.
وَيْلٌ لِّكُلِّ هُمَزَةٍ لُّمَزَةٍ (1) అపనిందలు మోపే, చాడీలు చెప్పే ప్రతి ఒక్కడికీ వినాశం తప్పదు |
الَّذِي جَمَعَ مَالًا وَعَدَّدَهُ (2) ఎవడైతే ధనాన్ని కూడబెట్టి, మాటి మాటికి దాన్ని లెక్కబెడుతూ ఉంటాడో |
يَحْسَبُ أَنَّ مَالَهُ أَخْلَدَهُ (3) తన ధనం, తనను శాశ్వతంగా ఉంచుతుందని అతడు భావిస్తున్నాడు |
كَلَّا ۖ لَيُنبَذَنَّ فِي الْحُطَمَةِ (4) ఎంత మాత్రం కాదు! అతడు (రాబోయే జీవితంలో) తప్పకుండా అణగ ద్రొక్కబడే నరకాగ్నిలో వేయబడతాడు |
وَمَا أَدْرَاكَ مَا الْحُطَمَةُ (5) ఆ (అణగద్రొక్కబడే) నరకాగ్ని అంటే ఏమిటో నీకు తెలుసా |
نَارُ اللَّهِ الْمُوقَدَةُ (6) అల్లాహ్, తీవ్రంగా ప్రజ్వలింపజేసిన అగ్ని |
الَّتِي تَطَّلِعُ عَلَى الْأَفْئِدَةِ (7) అది గుండెల దాకా చేరుకుంటుంది |
إِنَّهَا عَلَيْهِم مُّؤْصَدَةٌ (8) నిశ్చయంగా, అది వారి మీద క్రమ్ముకొంటుంది |
فِي عَمَدٍ مُّمَدَّدَةٍ (9) పొడుగాటి (అగ్ని) స్థంభాల వలే |