Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 102 - البَقَرَة - Page - Juz 1
﴿وَٱتَّبَعُواْ مَا تَتۡلُواْ ٱلشَّيَٰطِينُ عَلَىٰ مُلۡكِ سُلَيۡمَٰنَۖ وَمَا كَفَرَ سُلَيۡمَٰنُ وَلَٰكِنَّ ٱلشَّيَٰطِينَ كَفَرُواْ يُعَلِّمُونَ ٱلنَّاسَ ٱلسِّحۡرَ وَمَآ أُنزِلَ عَلَى ٱلۡمَلَكَيۡنِ بِبَابِلَ هَٰرُوتَ وَمَٰرُوتَۚ وَمَا يُعَلِّمَانِ مِنۡ أَحَدٍ حَتَّىٰ يَقُولَآ إِنَّمَا نَحۡنُ فِتۡنَةٞ فَلَا تَكۡفُرۡۖ فَيَتَعَلَّمُونَ مِنۡهُمَا مَا يُفَرِّقُونَ بِهِۦ بَيۡنَ ٱلۡمَرۡءِ وَزَوۡجِهِۦۚ وَمَا هُم بِضَآرِّينَ بِهِۦ مِنۡ أَحَدٍ إِلَّا بِإِذۡنِ ٱللَّهِۚ وَيَتَعَلَّمُونَ مَا يَضُرُّهُمۡ وَلَا يَنفَعُهُمۡۚ وَلَقَدۡ عَلِمُواْ لَمَنِ ٱشۡتَرَىٰهُ مَا لَهُۥ فِي ٱلۡأٓخِرَةِ مِنۡ خَلَٰقٖۚ وَلَبِئۡسَ مَا شَرَوۡاْ بِهِۦٓ أَنفُسَهُمۡۚ لَوۡ كَانُواْ يَعۡلَمُونَ ﴾
[البَقَرَة: 102]
﴿واتبعوا ما تتلوا الشياطين على ملك سليمان وما كفر سليمان ولكن الشياطين﴾ [البَقَرَة: 102]
Abdul Raheem Mohammad Moulana Mariyu varu sulaiman rajya kalamuna, saitanulu pathince danini (jala vidyanu) anusarincaru. Sulaiman satyatiraskari kaledu; kani niscayanga, saitanulu satyanni tiraskarincaru. Varu babilon nagaramandu, harut marut, ane iddaru devadutala dvara tebadina jalavidyanu prajalaku nerpucundiri. Evarikaina a vidyanu nerpetappudu, variddaru (devadutalu) ila ceppe varu: "Niscayanga memu (manavulaku) oka pariksa! Kabatti miru (i jalavidyanu nercukoni) satyatiraskarulu kakandi." Ayinappatiki varu (prajalu), bharya-bhartalaku edabatu kaligincedi (jalavidya) variddari daggara nercukunevaru. Mariyu allah anumati lenide, dani dvara evariki e matram hani kaligincaleru. Mariyu varu nercukunedi, variki nastam kaligincede, kani labham kaligincedi enta matram kadu. Mariyu vastavaniki danini (jalavidyanu) svikarince vaniki paraloka saukhyalalo e matramu bhagam ledani variki baga telusu. Mariyu varu enta tucchamaina som'muku baduluga tamanu tamu am'mukunnaru! Idi variki teliste enta bagundedi |
Abdul Raheem Mohammad Moulana Mariyu vāru sulaimān rājya kālamuna, ṣaitānulu paṭhin̄cē dānini (jāla vidyanu) anusarin̄cāru. Sulaimān satyatiraskāri kālēdu; kānī niścayaṅgā, ṣaitānulu satyānni tiraskarin̄cāru. Vāru bābīlōn nagaramandu, hārūt mārūt, anē iddaru dēvadūtala dvārā tēbaḍina jālavidyanu prajalaku nērpucuṇḍiri. Evarikainā ā vidyanu nērpēṭappuḍu, vāriddaru (dēvadūtalu) ilā ceppē vāru: "Niścayaṅgā mēmu (mānavulaku) oka parīkṣa! Kābaṭṭi mīru (ī jālavidyanu nērcukoni) satyatiraskārulu kākaṇḍi." Ayinappaṭikī vāru (prajalu), bhāryā-bhartalaku eḍabāṭu kaligin̄cēdi (jālavidya) vāriddari daggara nērcukunēvāru. Mariyu allāh anumati lēnidē, dāni dvārā evarikī ē mātraṁ hāni kaligin̄calēru. Mariyu vāru nērcukunēdi, vāriki naṣṭaṁ kaligin̄cēdē, kāni lābhaṁ kaligin̄cēdi enta mātraṁ kādu. Mariyu vāstavāniki dānini (jālavidyanu) svīkarin̄cē vāniki paralōka saukhyālalō ē mātramū bhāgaṁ lēdani vāriki bāgā telusu. Mariyu vāru enta tucchamaina som'muku badulugā tamanu tāmu am'mukunnāru! Idi vāriki telistē enta bāguṇḍēdi |
Muhammad Aziz Ur Rehman వారు సులైమాను రాజ్యంలోని షైతానులు అవలంబించిన విషయాల వెనుకపడ్డారు. అసలు సులైమాను ఎన్నడూ అవిశ్వాసానికి ఒడిగట్టలేదు, ఈ అవిశ్వాస పోకడ అసలు షైతానులదే. వారు ప్రజలకు చేతబడిని నేర్పేవారు. వారు బాబిలోనియాలో హారూత్, మారూత్ అనే ఇద్దరు దైవదూతలపై అవతరింపజేయబడిన విద్య వెంటపడ్డారు. “మేము ఒక పరీక్ష వంటివారం. నువ్వు మాత్రం అవిశ్వాసానికి పాల్పడకు” అని (స్పష్టంగా) చెప్పనంతవరకూ వారు (ఇద్దరూ) ఎవరికీ ఆ విద్యను నేర్పేవారు కూడా కాదు. అయినప్పటికీ జనులు వారి దగ్గర భార్యాభర్తలను విడగొట్టే విద్యను నేర్చుకునేవారు. ఎంత చేసినా వారు అల్లాహ్ అనుమతి లేకుండా ఆ చేతబడి ద్వారా ఎవరికీ ఎలాంటి కీడు కలిగించలేరు సుమా! తమకు నష్టం తప్ప ఏమాత్రం ప్రయోజనం చేకూర్చని దానిని వారు నేర్చుకుంటున్నారు. ఆ విద్యను కొనుక్కున్నవారికి పరలోకంలో (అక్కడి సుఖసౌఖ్యాలలో) ఎలాంటి భాగం లేదన్న సంగతి వారికి సయితం తెలుసు. ఎంత నీచమైన వస్తువుకు బదులుగా వారు తమను తాము అమ్ముకుంటున్నారో వారికి తెలిస్తే ఎంత బావుండు |