×

ఆ తరువాత మీరో ఒకరినొకరు చంపుకునే వారు. మరియు మీరు మీలోని ఒక వర్గం వారిని 2:85 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:85) ayat 85 in Telugu

2:85 Surah Al-Baqarah ayat 85 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 85 - البَقَرَة - Page - Juz 1

﴿ثُمَّ أَنتُمۡ هَٰٓؤُلَآءِ تَقۡتُلُونَ أَنفُسَكُمۡ وَتُخۡرِجُونَ فَرِيقٗا مِّنكُم مِّن دِيَٰرِهِمۡ تَظَٰهَرُونَ عَلَيۡهِم بِٱلۡإِثۡمِ وَٱلۡعُدۡوَٰنِ وَإِن يَأۡتُوكُمۡ أُسَٰرَىٰ تُفَٰدُوهُمۡ وَهُوَ مُحَرَّمٌ عَلَيۡكُمۡ إِخۡرَاجُهُمۡۚ أَفَتُؤۡمِنُونَ بِبَعۡضِ ٱلۡكِتَٰبِ وَتَكۡفُرُونَ بِبَعۡضٖۚ فَمَا جَزَآءُ مَن يَفۡعَلُ ذَٰلِكَ مِنكُمۡ إِلَّا خِزۡيٞ فِي ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَاۖ وَيَوۡمَ ٱلۡقِيَٰمَةِ يُرَدُّونَ إِلَىٰٓ أَشَدِّ ٱلۡعَذَابِۗ وَمَا ٱللَّهُ بِغَٰفِلٍ عَمَّا تَعۡمَلُونَ ﴾
[البَقَرَة: 85]

ఆ తరువాత మీరో ఒకరినొకరు చంపుకునే వారు. మరియు మీరు మీలోని ఒక వర్గం వారిని వారి ఇండ్ల నుండి తరిమేవారు. మరియు వారికి అన్యాయం చేయటంలోనూ మరియు వారిపై దౌర్జన్యం చేయటంలోనూ, (వారి విరోధులకు) తోడ్పడేవారు. మరియు వారు (శతృవుల చేతిలో) ఖైదీలై మీ వద్దకు వచ్చినపుడు మీరు వారిని విమోచనాధనం ఇచ్చి విడిపించేవారు. మరియు (వాస్తవానికి) వారిని తరమటం మీకు నిషిద్ధం చేయబడింది. ఏమీ? మీరు గ్రంథంలోని కొన్ని విషయాలను విశ్వసించి, మరి కొన్నింటిని తిరస్కరిస్తారా? మీలో ఇలా చేసే వారికి, ఇహలోక జీవితంలో అవమానమూ మరియు పునరుత్థాన దినమున మిమ్మల్ని కఠిన శిక్షకు గురి చేయటం తప్ప మరెలాంటి ప్రతిఫలం ఉంటుంది? మరియు అల్లాహ్ మీ కర్మల విషయంలో నిర్లక్షంగా లేడు

❮ Previous Next ❯

ترجمة: ثم أنتم هؤلاء تقتلون أنفسكم وتخرجون فريقا منكم من ديارهم تظاهرون عليهم, باللغة التيلجو

﴿ثم أنتم هؤلاء تقتلون أنفسكم وتخرجون فريقا منكم من ديارهم تظاهرون عليهم﴾ [البَقَرَة: 85]

Abdul Raheem Mohammad Moulana
a taruvata miro okarinokaru campukune varu. Mariyu miru miloni oka vargam varini vari indla nundi tarimevaru. Mariyu variki an'yayam ceyatanlonu mariyu varipai daurjan'yam ceyatanlonu, (vari virodhulaku) todpadevaru. Mariyu varu (satrvula cetilo) khaidilai mi vaddaku vaccinapudu miru varini vimocanadhanam icci vidipincevaru. Mariyu (vastavaniki) varini taramatam miku nisid'dham ceyabadindi. Emi? Miru granthanloni konni visayalanu visvasinci, mari konnintini tiraskaristara? Milo ila cese variki, ihaloka jivitanlo avamanamu mariyu punarut'thana dinamuna mim'malni kathina siksaku guri ceyatam tappa marelanti pratiphalam untundi? Mariyu allah mi karmala visayanlo nirlaksanga ledu
Abdul Raheem Mohammad Moulana
ā taruvāta mīrō okarinokaru campukunē vāru. Mariyu mīru mīlōni oka vargaṁ vārini vāri iṇḍla nuṇḍi tarimēvāru. Mariyu vāriki an'yāyaṁ cēyaṭanlōnū mariyu vāripai daurjan'yaṁ cēyaṭanlōnū, (vāri virōdhulaku) tōḍpaḍēvāru. Mariyu vāru (śatr̥vula cētilō) khaidīlai mī vaddaku vaccinapuḍu mīru vārini vimōcanādhanaṁ icci viḍipin̄cēvāru. Mariyu (vāstavāniki) vārini taramaṭaṁ mīku niṣid'dhaṁ cēyabaḍindi. Ēmī? Mīru granthanlōni konni viṣayālanu viśvasin̄ci, mari konniṇṭini tiraskaristārā? Mīlō ilā cēsē vāriki, ihalōka jīvitanlō avamānamū mariyu punarut'thāna dinamuna mim'malni kaṭhina śikṣaku guri cēyaṭaṁ tappa marelāṇṭi pratiphalaṁ uṇṭundi? Mariyu allāh mī karmala viṣayanlō nirlakṣaṅgā lēḍu
Muhammad Aziz Ur Rehman
కాని మీరు పరస్పరం చంపుకున్నారు. మీలోని ఒక వర్గం వారిని ఇండ్ల నుంచి బహిష్కరించటం కూడా చేశారు. పాపానికి, దౌర్జన్యానికి పాల్పడుతూ మీరు వారికి వ్యతిరేకంగా-ఇతరులను సమర్థించారు. మరి వారు బందీలుగా పట్టుబడి మీ వద్దకు వచ్చినప్పుడు మీరు వారికోసం నష్టపరిహారం ఇచ్చిన మాట వాస్తవమే. కాని మీరు వారిని వెళ్ళగొట్టడమే అధర్మం (అప్పుడు మీరు దాన్ని అస్సలు లెక్కచేయలేదు). ఏమిటీ? మీరు కొన్ని ఆజ్ఞలను విశ్వసించి, మరికొన్నింటిని తిరస్కరిస్తున్నారా? మీలో ఇలా చేసేవారికి ప్రపంచ జీవితంలో అవమానం తప్ప ఇంకేం ప్రతిఫలం ఉంటుంది? ఇక ప్రళయ దినాన వారు మరింత కఠినమైన శిక్ష వైపు మరలించబడతారు. అల్లాహ్‌కు మీ చేష్టలు తెలియకుండా లేవు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek