×

అల్లాహ్ మరియు పరలోకాన్ని విశ్వసించే జనులలో, అల్లాహ్ మరియు ఆయన సందేశహరుణ్ణి వ్యతిరేకించేవారితో స్నేహం చేసుకునే 58:22 Telugu translation

Quran infoTeluguSurah Al-Mujadilah ⮕ (58:22) ayat 22 in Telugu

58:22 Surah Al-Mujadilah ayat 22 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mujadilah ayat 22 - المُجَادلة - Page - Juz 28

﴿لَّا تَجِدُ قَوۡمٗا يُؤۡمِنُونَ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِ يُوَآدُّونَ مَنۡ حَآدَّ ٱللَّهَ وَرَسُولَهُۥ وَلَوۡ كَانُوٓاْ ءَابَآءَهُمۡ أَوۡ أَبۡنَآءَهُمۡ أَوۡ إِخۡوَٰنَهُمۡ أَوۡ عَشِيرَتَهُمۡۚ أُوْلَٰٓئِكَ كَتَبَ فِي قُلُوبِهِمُ ٱلۡإِيمَٰنَ وَأَيَّدَهُم بِرُوحٖ مِّنۡهُۖ وَيُدۡخِلُهُمۡ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ خَٰلِدِينَ فِيهَاۚ رَضِيَ ٱللَّهُ عَنۡهُمۡ وَرَضُواْ عَنۡهُۚ أُوْلَٰٓئِكَ حِزۡبُ ٱللَّهِۚ أَلَآ إِنَّ حِزۡبَ ٱللَّهِ هُمُ ٱلۡمُفۡلِحُونَ ﴾
[المُجَادلة: 22]

అల్లాహ్ మరియు పరలోకాన్ని విశ్వసించే జనులలో, అల్లాహ్ మరియు ఆయన సందేశహరుణ్ణి వ్యతిరేకించేవారితో స్నేహం చేసుకునే వారిని నీవు పొందలేవు! ఆ వ్యతిరేకించేవారు, తమ తండ్రులైనా లేదా తమ కుమారులైనా లేదా తమ సోదరులైనా లేదా తమ కుటుంబం వారైనా సరే! అలాంటి వారి హృదయాలలో ఆయన విశ్వాసాన్ని స్థిరపరచాడు. మరియు వారిని తన వైపు నుండి ఒక ఆత్మశక్తి (రూహ్) ఇచ్చి బలపరిచాడు. మరియు వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడవుతాడు మరియు వారు ఆయన పట్ల ప్రసన్నులవుతారు. ఇలాంటి వారు అల్లాహ్ పక్షానికి చెందినవారు. గుర్తుంచుకోండి! నిశ్చయంగా, అల్లాహ్ పక్షం వారే సాఫల్యం పొందేవారు

❮ Previous Next ❯

ترجمة: لا تجد قوما يؤمنون بالله واليوم الآخر يوادون من حاد الله ورسوله, باللغة التيلجو

﴿لا تجد قوما يؤمنون بالله واليوم الآخر يوادون من حاد الله ورسوله﴾ [المُجَادلة: 22]

Abdul Raheem Mohammad Moulana
allah mariyu paralokanni visvasince janulalo, allah mariyu ayana sandesaharunni vyatirekincevarito sneham cesukune varini nivu pondalevu! A vyatirekincevaru, tama tandrulaina leda tama kumarulaina leda tama sodarulaina leda tama kutumbam varaina sare! Alanti vari hrdayalalo ayana visvasanni sthiraparacadu. Mariyu varini tana vaipu nundi oka atmasakti (ruh) icci balaparicadu. Mariyu varini krinda kaluvalu pravahince svargavanalalo pravesimpajestadu. Andulo varu sasvatanga untaru. Allah vari patla prasannudavutadu mariyu varu ayana patla prasannulavutaru. Ilanti varu allah paksaniki cendinavaru. Gurtuncukondi! Niscayanga, allah paksam vare saphalyam pondevaru
Abdul Raheem Mohammad Moulana
allāh mariyu paralōkānni viśvasin̄cē janulalō, allāh mariyu āyana sandēśaharuṇṇi vyatirēkin̄cēvāritō snēhaṁ cēsukunē vārini nīvu pondalēvu! Ā vyatirēkin̄cēvāru, tama taṇḍrulainā lēdā tama kumārulainā lēdā tama sōdarulainā lēdā tama kuṭumbaṁ vārainā sarē! Alāṇṭi vāri hr̥dayālalō āyana viśvāsānni sthiraparacāḍu. Mariyu vārini tana vaipu nuṇḍi oka ātmaśakti (rūh) icci balaparicāḍu. Mariyu vārini krinda kāluvalu pravahin̄cē svargavanālalō pravēśimpajēstāḍu. Andulō vāru śāśvataṅgā uṇṭāru. Allāh vāri paṭla prasannuḍavutāḍu mariyu vāru āyana paṭla prasannulavutāru. Ilāṇṭi vāru allāh pakṣāniki cendinavāru. Gurtun̄cukōṇḍi! Niścayaṅgā, allāh pakṣaṁ vārē sāphalyaṁ pondēvāru
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్ ను, అంతిమదినాన్ని విశ్వసించేవారు అల్లాహ్ పట్ల, ఆయన ప్రవక్త పట్ల శత్రుత్వం వహించేవారిని ప్రేమిస్తున్నట్లు నీవు ఎక్కడా చూడవు – ఆఖరికి వారు తమ తండ్రులైనాసరే, తమ కొడుకులైనాసరే, తమ అన్నదమ్ములైనాసరే, తమ పరివారజనులైనా సరే (ససేమిరా వారిని ప్రేమించరు). అల్లాహ్ విశ్వాసాన్ని రాసి పెట్టినది ఇలాంటి వారి హృదయాలలోనే! ఆయన తన ఆత్మ ద్వారా వీరిని ప్రత్యేకంగా బలపరిచాడు. ఇంకా వీరికి, క్రింద సెలయేరులు పారే స్వర్గ వనాలలో ప్రవేశం కల్పిస్తాడు. అందులో వీరు కలకాలం ఉంటారు. అల్లాహ్ వీరి పట్ల ప్రసన్నుడయ్యాడు. వీరు అల్లాహ్ పట్ల సంతుష్టులయ్యారు. అల్లాహ్ పక్షానికి చెందిన వారంటే వీరే. నిశ్చయంగా సాఫల్యం పొందేవారు అల్లాహ్ పక్షం వారే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek