×

మరియు మేము నిర్ణయించిన గడువు కొరకు, మూసా తన జాతి వారిలో నుండి డెబ్బై మందిని 7:155 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:155) ayat 155 in Telugu

7:155 Surah Al-A‘raf ayat 155 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 155 - الأعرَاف - Page - Juz 9

﴿وَٱخۡتَارَ مُوسَىٰ قَوۡمَهُۥ سَبۡعِينَ رَجُلٗا لِّمِيقَٰتِنَاۖ فَلَمَّآ أَخَذَتۡهُمُ ٱلرَّجۡفَةُ قَالَ رَبِّ لَوۡ شِئۡتَ أَهۡلَكۡتَهُم مِّن قَبۡلُ وَإِيَّٰيَۖ أَتُهۡلِكُنَا بِمَا فَعَلَ ٱلسُّفَهَآءُ مِنَّآۖ إِنۡ هِيَ إِلَّا فِتۡنَتُكَ تُضِلُّ بِهَا مَن تَشَآءُ وَتَهۡدِي مَن تَشَآءُۖ أَنتَ وَلِيُّنَا فَٱغۡفِرۡ لَنَا وَٱرۡحَمۡنَاۖ وَأَنتَ خَيۡرُ ٱلۡغَٰفِرِينَ ﴾
[الأعرَاف: 155]

మరియు మేము నిర్ణయించిన గడువు కొరకు, మూసా తన జాతి వారిలో నుండి డెబ్బై మందిని ఎన్నుకున్నాడు. ఆ పిదప వారిని భూకంపం ఆవరించగా (మూసా) ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నీవు కోరితే, వీరిని మరియు నన్ను కూడా ఇంతకు పూర్వమే సంహరించి ఉండేవాడవు. ఏమీ? మాలో కొందరు మూఢులు చేసిన పనికి నీవు మమ్మల్ని నశింపజేస్తావా? ఇదంతా నీ పరీక్షయే! దీని ద్వారా నీవు కోరిన వారిని మార్గభ్రష్టత్వానికి గురి చేస్తావు మరియు నీవు కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తావు. మా సంరక్షకుడవు నీవే, కావున మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు. మరియు క్షమించే వారందరిలో నీవే అత్యుత్తముడవు

❮ Previous Next ❯

ترجمة: واختار موسى قومه سبعين رجلا لميقاتنا فلما أخذتهم الرجفة قال رب لو, باللغة التيلجو

﴿واختار موسى قومه سبعين رجلا لميقاتنا فلما أخذتهم الرجفة قال رب لو﴾ [الأعرَاف: 155]

Abdul Raheem Mohammad Moulana
Mariyu memu nirnayincina gaduvu koraku, musa tana jati varilo nundi debbai mandini ennukunnadu. A pidapa varini bhukampam avarincaga (musa) ila prarthincadu: "O na prabhu! Nivu korite, virini mariyu nannu kuda intaku purvame sanharinci undevadavu. Emi? Malo kondaru mudhulu cesina paniki nivu mam'malni nasimpajestava? Idanta ni pariksaye! Dini dvara nivu korina varini margabhrastatvaniki guri cestavu mariyu nivu korina variki margadarsakatvam cestavu. Ma sanraksakudavu nive, kavuna mam'malni ksamincu, mam'malni karunincu. Mariyu ksamince varandarilo nive atyuttamudavu
Abdul Raheem Mohammad Moulana
Mariyu mēmu nirṇayin̄cina gaḍuvu koraku, mūsā tana jāti vārilō nuṇḍi ḍebbai mandini ennukunnāḍu. Ā pidapa vārini bhūkampaṁ āvarin̄cagā (mūsā) ilā prārthin̄cāḍu: "Ō nā prabhū! Nīvu kōritē, vīrini mariyu nannu kūḍā intaku pūrvamē sanharin̄ci uṇḍēvāḍavu. Ēmī? Mālō kondaru mūḍhulu cēsina paniki nīvu mam'malni naśimpajēstāvā? Idantā nī parīkṣayē! Dīni dvārā nīvu kōrina vārini mārgabhraṣṭatvāniki guri cēstāvu mariyu nīvu kōrina vāriki mārgadarśakatvaṁ cēstāvu. Mā sanrakṣakuḍavu nīvē, kāvuna mam'malni kṣamin̄cu, mam'malni karuṇin̄cu. Mariyu kṣamin̄cē vārandarilō nīvē atyuttamuḍavu
Muhammad Aziz Ur Rehman
మేము నిర్థారించిన సమయం కోసం మూసా (అలైహిస్సలాం) తన జాతికి చెందిన డెబ్భై మందిని ఎన్నుకున్నాడు. మరి వారిని భూకంపం కబళించినప్పుడు మూసా (అలైహిస్సలాం) ఇలా నివేదించుకున్నాడు : “నా ప్రభూ! నీవు గనక తలచుకుని ఉంటే ఇంతకు ముందే వీళ్ళనూ, నన్నూ తుదముట్టించి ఉండేవాడివి. ఏమిటీ (ప్రభూ!) మాలోని కొంతమంది అవివేకులు చేసిన పనికి మమ్మల్నందరినీ నాశనం చేస్తావా? ఈ సంఘటన వాస్తవానికి నీ తరఫున పెట్టబడిన ఒక పరీక్ష. ఇలాంటి పరీక్షల ద్వారా నీవు కోరిన వారిని అపమార్గానికి గురిచేసి, నీవు కోరిన వారిని సన్మార్గంపై నిలపగలవు. నువ్వే మా సంరక్షకుడవు. కనుక మాకు క్షమాభిక్ష పెట్టు. మాపై దయజూపు. నీవు క్షమించే వారందరిలోకీ ఉత్తమ క్షమాశీలివి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek