Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 160 - الأعرَاف - Page - Juz 9
﴿وَقَطَّعۡنَٰهُمُ ٱثۡنَتَيۡ عَشۡرَةَ أَسۡبَاطًا أُمَمٗاۚ وَأَوۡحَيۡنَآ إِلَىٰ مُوسَىٰٓ إِذِ ٱسۡتَسۡقَىٰهُ قَوۡمُهُۥٓ أَنِ ٱضۡرِب بِّعَصَاكَ ٱلۡحَجَرَۖ فَٱنۢبَجَسَتۡ مِنۡهُ ٱثۡنَتَا عَشۡرَةَ عَيۡنٗاۖ قَدۡ عَلِمَ كُلُّ أُنَاسٖ مَّشۡرَبَهُمۡۚ وَظَلَّلۡنَا عَلَيۡهِمُ ٱلۡغَمَٰمَ وَأَنزَلۡنَا عَلَيۡهِمُ ٱلۡمَنَّ وَٱلسَّلۡوَىٰۖ كُلُواْ مِن طَيِّبَٰتِ مَا رَزَقۡنَٰكُمۡۚ وَمَا ظَلَمُونَا وَلَٰكِن كَانُوٓاْ أَنفُسَهُمۡ يَظۡلِمُونَ ﴾
[الأعرَاف: 160]
﴿وقطعناهم اثنتي عشرة أسباطا أمما وأوحينا إلى موسى إذ استسقاه قومه أن﴾ [الأعرَاف: 160]
Abdul Raheem Mohammad Moulana mariyu memu varini pannendu tegaluga (vargaluga) vibhavincamu. Mariyu musa jati varu atanini niti koraku adiginapudu, memu atanini: "Ni cetikarrato rayipai kottu!" Ani ajnapincamu. Apudu dani nundi pannendu utalu pravahincasagayi. Apudu prati tegavaru, tamu nillu tisukune sthalanni telusukunnaru. Mariyu memu varipai meghala chayanu kalpincamu. Mariyu vari koraku manna mariyu salvalanu dimpamu: "Memu miku prasadincina parisud'dhamaina padarthalanu tinandi." Ani annamu. Mariyu varu maku an'yayam ceyaledu, kani tamaku tame an'yayam cesukunnaru |
Abdul Raheem Mohammad Moulana mariyu mēmu vārini panneṇḍu tegalugā (vargālugā) vibhavin̄cāmu. Mariyu mūsā jāti vāru atanini nīṭi koraku aḍiginapuḍu, mēmu atanini: "Nī cētikarratō rāyipai koṭṭu!" Ani ājñāpin̄cāmu. Apuḍu dāni nuṇḍi panneṇḍu ūṭalu pravahin̄casāgāyi. Apuḍu prati tegavāru, tāmu nīḷḷu tīsukunē sthalānni telusukunnāru. Mariyu mēmu vāripai mēghāla chāyanu kalpin̄cāmu. Mariyu vāri koraku manna mariyu salvālanu dimpāmu: "Mēmu mīku prasādin̄cina pariśud'dhamaina padārthālanu tinaṇḍi." Ani annāmu. Mariyu vāru māku an'yāyaṁ cēyalēdu, kāni tamaku tāmē an'yāyaṁ cēsukunnāru |
Muhammad Aziz Ur Rehman మేము (మూసా జాతి) వారిని పన్నెండు తెగలుగా విభజించి, వేర్వేరు సమూహాలుగా చేశాము. మూసా జాతి వారు అతన్ని నీళ్ళు అడిగినప్పుడు, “నీ చేతి కర్రను ఫలానా రాతిపై కొట్టు” అని మేమతన్ని ఆదేశించాము. అంతే! (అతను కర్రతో కొట్టగానే) ఆ రాతి బండ నుంచి పన్నెండు ఊటలు చిమ్ముకువచ్చాయి. ప్రతి తెగవారూ తాము నీళ్లు తాగవలసిన చోటును తెలుసుకున్నారు. మేము వారిపై మబ్బుల ద్వారా నీడను కల్పించాము. వారిపై ‘మన్న సల్వా’లను (ఆహారంగా) దించాము. “మేము మీకు ప్రసాదించిన పరిశుద్ధమైన పదార్థాలను తినండి” (అని వారికి చెప్పాము.) అయితే వారు (కృతఘ్నతకు పాల్పడి) మాకు చేకూర్చిన నష్టం ఏమీలేదు. వారు తమ స్వయానికే నష్టం చేకూర్చుకునేవారు |