×

మరియు ఈ విధంగా (ఉన్న తరువాత), వారు ఒకరినొకరు ప్రశ్నించుకోవటానికి మేము వారిని (నిద్ర నుండి) 18:19 Telugu translation

Quran infoTeluguSurah Al-Kahf ⮕ (18:19) ayat 19 in Telugu

18:19 Surah Al-Kahf ayat 19 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Kahf ayat 19 - الكَهف - Page - Juz 15

﴿وَكَذَٰلِكَ بَعَثۡنَٰهُمۡ لِيَتَسَآءَلُواْ بَيۡنَهُمۡۚ قَالَ قَآئِلٞ مِّنۡهُمۡ كَمۡ لَبِثۡتُمۡۖ قَالُواْ لَبِثۡنَا يَوۡمًا أَوۡ بَعۡضَ يَوۡمٖۚ قَالُواْ رَبُّكُمۡ أَعۡلَمُ بِمَا لَبِثۡتُمۡ فَٱبۡعَثُوٓاْ أَحَدَكُم بِوَرِقِكُمۡ هَٰذِهِۦٓ إِلَى ٱلۡمَدِينَةِ فَلۡيَنظُرۡ أَيُّهَآ أَزۡكَىٰ طَعَامٗا فَلۡيَأۡتِكُم بِرِزۡقٖ مِّنۡهُ وَلۡيَتَلَطَّفۡ وَلَا يُشۡعِرَنَّ بِكُمۡ أَحَدًا ﴾
[الكَهف: 19]

మరియు ఈ విధంగా (ఉన్న తరువాత), వారు ఒకరినొకరు ప్రశ్నించుకోవటానికి మేము వారిని (నిద్ర నుండి) లేపాము. వారిలో నుండి ఒకడు మాట్లాడుతూ ఇలా అన్నాడు: "మీరు ఈ స్థితిలో ఎంత కాలమున్నారు?" వారన్నారు: "మేము ఒక దినమో లేదా అంతకంటే తక్కువనో ఈ స్థితిలో ఉన్నాము." (మరికొందరు) ఇలా అన్నారు: "మీరెంత కాలమున్నారో మీ ప్రభువుకే తెలుసు! మీలో ఒకనికి నాణ్యం (డబ్బు) ఇచ్చి పట్టణానికి పంపండి. అతడు అక్కడ శ్రేష్ఠమైన ఆహారాన్ని వెతికి, దానినే మీ కొరకు తినటానికి తెస్తాడు. అతడు జాగ్రత్తగా వ్యవహరించాలి మరియు మీ గురించి ఎవ్వడికీ తెలియనివ్వ గూడదు

❮ Previous Next ❯

ترجمة: وكذلك بعثناهم ليتساءلوا بينهم قال قائل منهم كم لبثتم قالوا لبثنا يوما, باللغة التيلجو

﴿وكذلك بعثناهم ليتساءلوا بينهم قال قائل منهم كم لبثتم قالوا لبثنا يوما﴾ [الكَهف: 19]

Abdul Raheem Mohammad Moulana
mariyu i vidhanga (unna taruvata), varu okarinokaru prasnincukovataniki memu varini (nidra nundi) lepamu. Varilo nundi okadu matladutu ila annadu: "Miru i sthitilo enta kalamunnaru?" Varannaru: "Memu oka dinamo leda antakante takkuvano i sthitilo unnamu." (Marikondaru) ila annaru: "Mirenta kalamunnaro mi prabhuvuke telusu! Milo okaniki nanyam (dabbu) icci pattananiki pampandi. Atadu akkada sresthamaina aharanni vetiki, danine mi koraku tinataniki testadu. Atadu jagrattaga vyavaharincali mariyu mi gurinci evvadiki teliyanivva gudadu
Abdul Raheem Mohammad Moulana
mariyu ī vidhaṅgā (unna taruvāta), vāru okarinokaru praśnin̄cukōvaṭāniki mēmu vārini (nidra nuṇḍi) lēpāmu. Vārilō nuṇḍi okaḍu māṭlāḍutū ilā annāḍu: "Mīru ī sthitilō enta kālamunnāru?" Vārannāru: "Mēmu oka dinamō lēdā antakaṇṭē takkuvanō ī sthitilō unnāmu." (Marikondaru) ilā annāru: "Mīrenta kālamunnārō mī prabhuvukē telusu! Mīlō okaniki nāṇyaṁ (ḍabbu) icci paṭṭaṇāniki pampaṇḍi. Ataḍu akkaḍa śrēṣṭhamaina āhārānni vetiki, dāninē mī koraku tinaṭāniki testāḍu. Ataḍu jāgrattagā vyavaharin̄cāli mariyu mī gurin̄ci evvaḍikī teliyanivva gūḍadu
Muhammad Aziz Ur Rehman
ఇదే విధంగా – వారు పరస్పరం ప్రశ్నించుకోవటానికి మేము వారిని లేపి కూర్చోబెట్టాము. వారిలో ఒకతను “మీరు ఎంతసేపు ఇక్కడ విశ్రమించి ఉంటారు?” అని అడగ్గా, “ఒక రోజో లేక ఒక రోజుకన్నా తక్కువ సమయమో ఉండి ఉంటాం” అని వారు సమాధాన మిచ్చారు. మళ్లీ ఇలా చెప్పారు : “మీరు ఎంతసేపు ఉన్నారన్న విషయం మీ ప్రభువుకే బాగా తెలుసు. సరే, ఇప్పుడు ఈ వెండి (నాణెము)ని ఇచ్చి, మీలో ఒకరిని పట్టణానికి పంపండి – అతను వెళ్ళి అత్యంత పరిశుద్ధమైన భోజనం ఏదో కనుక్కుని, అందులో నుంచి మీ కోసం తినటానికి తీసుకు వస్తాడు. అయితే అతను మృదువుగా, జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ జాడ ఎవరికీ తెలియనివ్వకూడదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek