×

మరియు వాస్తవంగా మేము మూసాకు గ్రంథాన్ని (తౌరాత్ ను) ప్రసాదించాము మరియు అతని తర్వాత వరుసగా 2:87 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:87) ayat 87 in Telugu

2:87 Surah Al-Baqarah ayat 87 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 87 - البَقَرَة - Page - Juz 1

﴿وَلَقَدۡ ءَاتَيۡنَا مُوسَى ٱلۡكِتَٰبَ وَقَفَّيۡنَا مِنۢ بَعۡدِهِۦ بِٱلرُّسُلِۖ وَءَاتَيۡنَا عِيسَى ٱبۡنَ مَرۡيَمَ ٱلۡبَيِّنَٰتِ وَأَيَّدۡنَٰهُ بِرُوحِ ٱلۡقُدُسِۗ أَفَكُلَّمَا جَآءَكُمۡ رَسُولُۢ بِمَا لَا تَهۡوَىٰٓ أَنفُسُكُمُ ٱسۡتَكۡبَرۡتُمۡ فَفَرِيقٗا كَذَّبۡتُمۡ وَفَرِيقٗا تَقۡتُلُونَ ﴾
[البَقَرَة: 87]

మరియు వాస్తవంగా మేము మూసాకు గ్రంథాన్ని (తౌరాత్ ను) ప్రసాదించాము మరియు అతని తర్వాత వరుసగా ప్రవక్తలను పంపాము. మరియు మర్యమ్ కుమారుడైన ఈసాకు (ఏసుకు) స్పష్టమైన సూచనలను ఇచ్చాము మరియు పరిశుద్ధాత్మ (రూహుల్ ఖుదుస్) తో అతనిని బలపరిచాము. ఏమీ? మీ మనోవాంఛలకు ప్రతికూలంగా ఉన్న దాన్ని తీసుకుని ఏ ప్రవక్త అయినా మీ వద్దకు వస్తే, మీరు వారి పట్ల దురహంకారంతో ప్రవర్తించలేదా? వారిలో కొందరిని మీరు అసత్యవాదులన్నారు, మరి కొందరిని చంపారు

❮ Previous Next ❯

ترجمة: ولقد آتينا موسى الكتاب وقفينا من بعده بالرسل وآتينا عيسى ابن مريم, باللغة التيلجو

﴿ولقد آتينا موسى الكتاب وقفينا من بعده بالرسل وآتينا عيسى ابن مريم﴾ [البَقَرَة: 87]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavanga memu musaku granthanni (taurat nu) prasadincamu mariyu atani tarvata varusaga pravaktalanu pampamu. Mariyu maryam kumarudaina isaku (esuku) spastamaina sucanalanu iccamu mariyu parisud'dhatma (ruhul khudus) to atanini balaparicamu. Emi? Mi manovanchalaku pratikulanga unna danni tisukuni e pravakta ayina mi vaddaku vaste, miru vari patla durahankaranto pravartincaleda? Varilo kondarini miru asatyavadulannaru, mari kondarini camparu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavaṅgā mēmu mūsāku granthānni (taurāt nu) prasādin̄cāmu mariyu atani tarvāta varusagā pravaktalanu pampāmu. Mariyu maryam kumāruḍaina īsāku (ēsuku) spaṣṭamaina sūcanalanu iccāmu mariyu pariśud'dhātma (rūhul khudus) tō atanini balaparicāmu. Ēmī? Mī manōvān̄chalaku pratikūlaṅgā unna dānni tīsukuni ē pravakta ayinā mī vaddaku vastē, mīru vāri paṭla durahaṅkārantō pravartin̄calēdā? Vārilō kondarini mīru asatyavādulannāru, mari kondarini campāru
Muhammad Aziz Ur Rehman
మేము మూసాకు గ్రంథం వొసగాము. అతని తరువాత కూడా ప్రవక్తలను పంపించాము. ఇంకా మేము మర్యమ్‌ కుమారుడైన ఈసాకు స్పష్టమైన నిదర్శనాలు ఇచ్చాము. రూహుల్‌ ఖుదుస్‌ ద్వారా అతనికి సహాయం చేశాము. అయితే ఏ ప్రవక్త అయినా మీ మనసులకు నచ్చని విషయాలు మీ వద్దకు తెచ్చినప్పుడల్లా మీరు అహంకారం ప్రదర్శించారు. వారిలో కొందరిని ధిక్కరించారు, మరి కొందరిని హతమార్చటం కూడా చేశారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek