Quran with Telugu translation - Surah Al-Ahzab ayat 37 - الأحزَاب - Page - Juz 22
﴿وَإِذۡ تَقُولُ لِلَّذِيٓ أَنۡعَمَ ٱللَّهُ عَلَيۡهِ وَأَنۡعَمۡتَ عَلَيۡهِ أَمۡسِكۡ عَلَيۡكَ زَوۡجَكَ وَٱتَّقِ ٱللَّهَ وَتُخۡفِي فِي نَفۡسِكَ مَا ٱللَّهُ مُبۡدِيهِ وَتَخۡشَى ٱلنَّاسَ وَٱللَّهُ أَحَقُّ أَن تَخۡشَىٰهُۖ فَلَمَّا قَضَىٰ زَيۡدٞ مِّنۡهَا وَطَرٗا زَوَّجۡنَٰكَهَا لِكَيۡ لَا يَكُونَ عَلَى ٱلۡمُؤۡمِنِينَ حَرَجٞ فِيٓ أَزۡوَٰجِ أَدۡعِيَآئِهِمۡ إِذَا قَضَوۡاْ مِنۡهُنَّ وَطَرٗاۚ وَكَانَ أَمۡرُ ٱللَّهِ مَفۡعُولٗا ﴾
[الأحزَاب: 37]
﴿وإذ تقول للذي أنعم الله عليه وأنعمت عليه أمسك عليك زوجك واتق﴾ [الأحزَاب: 37]
Abdul Raheem Mohammad Moulana Mariyu (o pravakta jnapakam cesuko!) Allah anugrahincina mariyu nivu anugrahincina vyaktito nivu: "Ni bharyanu undanivvu (vidici pettaku) mariyu allah yandu bhayabhaktulu kaligi undu." Ani annappudu; nivu allah bayata pettadalacina visayanni, ni manas'sulo daci uncavu. Nivu prajalaku bhayapaddavu, vastavaniki nivu allah ku bhayapadatame cala uttamamainadi. Jaid, ameto tana sambandhanni tana icchanusaranga trempukunna taruvatane, memu ame vivaham nito jaripincamu. Visvasulaku tama dattaputrula bharyalato pendli cesukovatanlo - varu tama bharyala nundi tama istanusaranga tama sambandham trempu kunnappudu - e vidhamaina dosam ledu. Vastavaniki allah adesam tappaka amaluloki ravalasinde |
Abdul Raheem Mohammad Moulana Mariyu (ō pravaktā jñāpakaṁ cēsukō!) Allāh anugrahin̄cina mariyu nīvu anugrahin̄cina vyaktitō nīvu: "Nī bhāryanu uṇḍanivvu (viḍici peṭṭaku) mariyu allāh yandu bhayabhaktulu kaligi uṇḍu." Ani annappuḍu; nīvu allāh bayaṭa peṭṭadalacina viṣayānni, nī manas'sulō dāci un̄cāvu. Nīvu prajalaku bhayapaḍḍāvu, vāstavāniki nīvu allāh ku bhayapaḍaṭamē cālā uttamamainadi. Jaid, āmetō tana sambandhānni tana icchānusāraṅgā trempukunna taruvātanē, mēmu āme vivāhaṁ nītō jaripin̄cāmu. Viśvāsulaku tama dattaputrula bhāryalatō peṇḍli cēsukōvaṭanlō - vāru tama bhāryala nuṇḍi tama iṣṭānusāraṅgā tama sambandhaṁ trempu kunnappuḍu - ē vidhamaina dōṣaṁ lēdu. Vāstavāniki allāh ādēśaṁ tappaka amalulōki rāvalasindē |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా! ఆ సందర్భాన్ని కాస్త జ్ఞాపకం చేసుకో) అల్లాహ్ అనుగ్రహించిన వ్యక్తితో, నువ్వు సయితం ఉపకారం చేసినవానితో “నువ్వు నీ భార్యను నీ దగ్గరే ఉండనివ్వు, అల్లాహ్‌కు భయపడు” అని చెప్పేవాడివి. కాని అల్లాహ్ బయటపెట్టాలని ఉన్న ఒక విషయాన్ని నువ్వు నీ మనసులోనే దాచిపెట్టావు. నువ్వు జనులకు భయపడేవాడివి. నిజానికి నువ్వు భయపడటానికి అల్లాహ్‌యే ఎక్కువ హక్కుదారుడు. మరి జైద్ ఆ స్త్రీతో తన లాంఛనాలన్నీ పూర్తి చేసిన తరువాత, మేము ఆమె వివాహం నీతో జరిపించాము. దత్తపుత్రులు తమ భార్యల లాంఛనాలన్నీ పూర్తిచేసిన తరువాత (వారికి విడాకులిచ్చిన పిమ్మట) వారి భార్యల (ను వివాహమాడే) విషయంలో ముస్లింలు ఎలాంటి సంకోచానికీ లోనుకాకుండా ఉండేటందుకు మేమిలా చేశాము. అల్లాహ్ ఆజ్ఞ అమలు జరిగి తీరవలసిందే |