×

అల్లాహ్ సర్వశ్రేష్ఠమైన బోధనలను ఒక గ్రంథ రూపంలో అవతరింపజేశాడు. దానిలో ఒకే రకమైన వాటిని (వచనాలను) 39:23 Telugu translation

Quran infoTeluguSurah Az-Zumar ⮕ (39:23) ayat 23 in Telugu

39:23 Surah Az-Zumar ayat 23 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Az-Zumar ayat 23 - الزُّمَر - Page - Juz 23

﴿ٱللَّهُ نَزَّلَ أَحۡسَنَ ٱلۡحَدِيثِ كِتَٰبٗا مُّتَشَٰبِهٗا مَّثَانِيَ تَقۡشَعِرُّ مِنۡهُ جُلُودُ ٱلَّذِينَ يَخۡشَوۡنَ رَبَّهُمۡ ثُمَّ تَلِينُ جُلُودُهُمۡ وَقُلُوبُهُمۡ إِلَىٰ ذِكۡرِ ٱللَّهِۚ ذَٰلِكَ هُدَى ٱللَّهِ يَهۡدِي بِهِۦ مَن يَشَآءُۚ وَمَن يُضۡلِلِ ٱللَّهُ فَمَا لَهُۥ مِنۡ هَادٍ ﴾
[الزُّمَر: 23]

అల్లాహ్ సర్వశ్రేష్ఠమైన బోధనలను ఒక గ్రంథ రూపంలో అవతరింపజేశాడు. దానిలో ఒకే రకమైన వాటిని (వచనాలను) మాటిమాటికీ ఎన్నో విధాలుగా (విశదీకరించాడు). తమ ప్రభువుకు భయపడే వారి శరీరాలు (చర్మాలు) దానితో (ఆ పఠనంతో) గజగజ వణుకుతాయి. కాని తరువాత వారి చర్మాలు మరియు వారి హృదయాలు అల్లాహ్ ధ్యానం వలన మెత్తబడతాయి. ఇది అల్లాహ్ మార్గదర్శకత్వం. ఆయన దీనితో తాను కోరిన వారికి మార్గదర్శకత్వం చేస్తాడు. మరియు ఏ వ్యక్తిని అల్లాహ్ మార్గభ్రష్టత్వంలో వదలుతాడో, అతనికి మార్గదర్శకుడు ఎవ్వడూ ఉండడు

❮ Previous Next ❯

ترجمة: الله نـزل أحسن الحديث كتابا متشابها مثاني تقشعر منه جلود الذين يخشون, باللغة التيلجو

﴿الله نـزل أحسن الحديث كتابا متشابها مثاني تقشعر منه جلود الذين يخشون﴾ [الزُّمَر: 23]

Abdul Raheem Mohammad Moulana
allah sarvasresthamaina bodhanalanu oka grantha rupanlo avatarimpajesadu. Danilo oke rakamaina vatini (vacanalanu) matimatiki enno vidhaluga (visadikarincadu). Tama prabhuvuku bhayapade vari sariralu (carmalu) danito (a pathananto) gajagaja vanukutayi. Kani taruvata vari carmalu mariyu vari hrdayalu allah dhyanam valana mettabadatayi. Idi allah margadarsakatvam. Ayana dinito tanu korina variki margadarsakatvam cestadu. Mariyu e vyaktini allah margabhrastatvanlo vadalutado, ataniki margadarsakudu evvadu undadu
Abdul Raheem Mohammad Moulana
allāh sarvaśrēṣṭhamaina bōdhanalanu oka grantha rūpanlō avatarimpajēśāḍu. Dānilō okē rakamaina vāṭini (vacanālanu) māṭimāṭikī ennō vidhālugā (viśadīkarin̄cāḍu). Tama prabhuvuku bhayapaḍē vāri śarīrālu (carmālu) dānitō (ā paṭhanantō) gajagaja vaṇukutāyi. Kāni taruvāta vāri carmālu mariyu vāri hr̥dayālu allāh dhyānaṁ valana mettabaḍatāyi. Idi allāh mārgadarśakatvaṁ. Āyana dīnitō tānu kōrina vāriki mārgadarśakatvaṁ cēstāḍu. Mariyu ē vyaktini allāh mārgabhraṣṭatvanlō vadalutāḍō, ataniki mārgadarśakuḍu evvaḍū uṇḍaḍu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ అత్యుత్తమమైన విషయాన్ని అవతరింపజేశాడు. అది పరస్పరం పోలిక కలిగి ఉండే, పదేపదే పునరావృతం అవుతూ ఉండే ఆయతులతో కూడిన గ్రంథం రూపంలో ఉంది. దాని వల్ల తమ ప్రభువుకు భయపడేవారి శరీరాలపై రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ తరువాత వారి శరీరాలు, హృదయాలు అల్లాహ్‌ స్మరణపట్ల మెత్తబడి పోతాయి. ఇదీ అల్లాహ్‌ మార్గదర్శకత్వం. దాని ద్వారా ఆయన తాను కోరిన వారిని సన్మార్గానికి తెస్తాడు. మరి అల్లాహ్‌ ఎవరిని మార్గం నుండి తప్పిస్తాడో అతనికి మార్గం చూపేవాడెవడూ ఉండడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek