×

మీ చేతులను ఆపుకోండి, నమాజ్ ను స్థాపించండి, విధిదానం (జకాత్) ఇవ్వండి." అని చెప్పబడిన వారిని 4:77 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:77) ayat 77 in Telugu

4:77 Surah An-Nisa’ ayat 77 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 77 - النِّسَاء - Page - Juz 5

﴿أَلَمۡ تَرَ إِلَى ٱلَّذِينَ قِيلَ لَهُمۡ كُفُّوٓاْ أَيۡدِيَكُمۡ وَأَقِيمُواْ ٱلصَّلَوٰةَ وَءَاتُواْ ٱلزَّكَوٰةَ فَلَمَّا كُتِبَ عَلَيۡهِمُ ٱلۡقِتَالُ إِذَا فَرِيقٞ مِّنۡهُمۡ يَخۡشَوۡنَ ٱلنَّاسَ كَخَشۡيَةِ ٱللَّهِ أَوۡ أَشَدَّ خَشۡيَةٗۚ وَقَالُواْ رَبَّنَا لِمَ كَتَبۡتَ عَلَيۡنَا ٱلۡقِتَالَ لَوۡلَآ أَخَّرۡتَنَآ إِلَىٰٓ أَجَلٖ قَرِيبٖۗ قُلۡ مَتَٰعُ ٱلدُّنۡيَا قَلِيلٞ وَٱلۡأٓخِرَةُ خَيۡرٞ لِّمَنِ ٱتَّقَىٰ وَلَا تُظۡلَمُونَ فَتِيلًا ﴾
[النِّسَاء: 77]

మీ చేతులను ఆపుకోండి, నమాజ్ ను స్థాపించండి, విధిదానం (జకాత్) ఇవ్వండి." అని చెప్పబడిన వారిని నీవు చూడలేదా? యుద్ధం చేయమని వారిని ఆదేశించినప్పుడు, వారిలో కొందరు అల్లాహ్ కు భయపడవలసిన విధంగా మానవులకు భయపడుతున్నారు. కాదు! అంతకంటే ఎక్కువగానే భయపడుతున్నారు. వారు: "ఓ మా ప్రభూ! యుద్ధం చేయమని ఈ ఆజ్ఞను మా కొరకు ఎందుకు విధించావు? మాకు ఇంకా కొంత వ్యవధి ఎందుకివ్వలేదు? అని అంటారు. వారితో ఇలా అను: "ఇహలోక సుఖం తుచ్ఛమైనది మరియు దైవభీతి గలవారికి పరలోక సుఖమే ఉత్తమమైనది. మరియు మీకు ఖర్జూర బీజపు చీలికలోని పొర (ఫతీల) అంత అన్యాయం కూడా జరుగదు

❮ Previous Next ❯

ترجمة: ألم تر إلى الذين قيل لهم كفوا أيديكم وأقيموا الصلاة وآتوا الزكاة, باللغة التيلجو

﴿ألم تر إلى الذين قيل لهم كفوا أيديكم وأقيموا الصلاة وآتوا الزكاة﴾ [النِّسَاء: 77]

Abdul Raheem Mohammad Moulana
mi cetulanu apukondi, namaj nu sthapincandi, vidhidanam (jakat) ivvandi." Ani ceppabadina varini nivu cudaleda? Yud'dham ceyamani varini adesincinappudu, varilo kondaru allah ku bhayapadavalasina vidhanga manavulaku bhayapadutunnaru. Kadu! Antakante ekkuvagane bhayapadutunnaru. Varu: "O ma prabhu! Yud'dham ceyamani i ajnanu ma koraku enduku vidhincavu? Maku inka konta vyavadhi endukivvaledu? Ani antaru. Varito ila anu: "Ihaloka sukham tucchamainadi mariyu daivabhiti galavariki paraloka sukhame uttamamainadi. Mariyu miku kharjura bijapu cilikaloni pora (phatila) anta an'yayam kuda jarugadu
Abdul Raheem Mohammad Moulana
mī cētulanu āpukōṇḍi, namāj nu sthāpin̄caṇḍi, vidhidānaṁ (jakāt) ivvaṇḍi." Ani ceppabaḍina vārini nīvu cūḍalēdā? Yud'dhaṁ cēyamani vārini ādēśin̄cinappuḍu, vārilō kondaru allāh ku bhayapaḍavalasina vidhaṅgā mānavulaku bhayapaḍutunnāru. Kādu! Antakaṇṭē ekkuvagānē bhayapaḍutunnāru. Vāru: "Ō mā prabhū! Yud'dhaṁ cēyamani ī ājñanu mā koraku enduku vidhin̄cāvu? Māku iṅkā konta vyavadhi endukivvalēdu? Ani aṇṭāru. Vāritō ilā anu: "Ihalōka sukhaṁ tucchamainadi mariyu daivabhīti galavāriki paralōka sukhamē uttamamainadi. Mariyu mīku kharjūra bījapu cīlikalōni pora (phatīla) anta an'yāyaṁ kūḍā jarugadu
Muhammad Aziz Ur Rehman
“మీ చేతులను ఆపుకోండి, నమాజులను నెలకొల్పుతూ ఉండండి, జకాతును చెల్లిస్తూ ఉండండి” అని ఆదేశించబడిన వారిని నీవు చూడలేదా? తీరా వారికి యుద్ధం చెయ్యమని ఆజ్ఞాపించబడితే, వారిలోని ఒక వర్గంవారు అల్లాహ్‌కు భయపడవలసిన రీతిలో- పైగా అంతకంటే ఎక్కువగానే- జనులకు భయపడసాగారు. “ప్రభూ! నీవు మాపై యుద్ధాన్ని ఎందుకు విధించావు? మరి కొంతకాలంపాటు మమ్మల్ని ఎందుకు బ్రతకనివ్వలేదు?” అని అనసాగారు. వారితో ఇలా చెప్పు: ప్రాపంచిక ప్రయోజనాలు బహు స్వల్పమైనవి. (అల్లాహ్‌కు) భయపడేవారికి పరలోకమే మేలైనది. మీకు (అక్కడ) ఒక చిన్న పీచు అంత అన్యాయం కూడా జరగదు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek