×

ఇక మీరు మీ విజయధనాన్ని తీసుకోవటానికి పోయినప్పుడు, వెనుక ఉండి పోయిన వారు ఇలా అంటారు: 48:15 Telugu translation

Quran infoTeluguSurah Al-Fath ⮕ (48:15) ayat 15 in Telugu

48:15 Surah Al-Fath ayat 15 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Fath ayat 15 - الفَتح - Page - Juz 26

﴿سَيَقُولُ ٱلۡمُخَلَّفُونَ إِذَا ٱنطَلَقۡتُمۡ إِلَىٰ مَغَانِمَ لِتَأۡخُذُوهَا ذَرُونَا نَتَّبِعۡكُمۡۖ يُرِيدُونَ أَن يُبَدِّلُواْ كَلَٰمَ ٱللَّهِۚ قُل لَّن تَتَّبِعُونَا كَذَٰلِكُمۡ قَالَ ٱللَّهُ مِن قَبۡلُۖ فَسَيَقُولُونَ بَلۡ تَحۡسُدُونَنَاۚ بَلۡ كَانُواْ لَا يَفۡقَهُونَ إِلَّا قَلِيلٗا ﴾
[الفَتح: 15]

ఇక మీరు మీ విజయధనాన్ని తీసుకోవటానికి పోయినప్పుడు, వెనుక ఉండి పోయిన వారు ఇలా అంటారు: "మమ్మల్ని కూడా మీ వెంట రానివ్వండి." వారు అల్లాహ్ ఉత్తరువును మార్చగోరుతున్నారు. వారితో అను: "మీరు మా వెంట రాజాలరు; మీ గురించి అల్లాహ్ ముందే ఈ విధంగా చెప్పాడు." అప్పుడు వారు ఇలా అంటారు: "అది కాదు! మీరు మా మీద అసూయ పడుతున్నారు." అలా కాదు! వారు వాస్తవాన్ని అర్థం చేసుకోగలిగేది చాలా తక్కువ

❮ Previous Next ❯

ترجمة: سيقول المخلفون إذا انطلقتم إلى مغانم لتأخذوها ذرونا نتبعكم يريدون أن يبدلوا, باللغة التيلجو

﴿سيقول المخلفون إذا انطلقتم إلى مغانم لتأخذوها ذرونا نتبعكم يريدون أن يبدلوا﴾ [الفَتح: 15]

Abdul Raheem Mohammad Moulana
ika miru mi vijayadhananni tisukovataniki poyinappudu, venuka undi poyina varu ila antaru: "Mam'malni kuda mi venta ranivvandi." Varu allah uttaruvunu marcagorutunnaru. Varito anu: "Miru ma venta rajalaru; mi gurinci allah munde i vidhanga ceppadu." Appudu varu ila antaru: "Adi kadu! Miru ma mida asuya padutunnaru." Ala kadu! Varu vastavanni artham cesukogaligedi cala takkuva
Abdul Raheem Mohammad Moulana
ika mīru mī vijayadhanānni tīsukōvaṭāniki pōyinappuḍu, venuka uṇḍi pōyina vāru ilā aṇṭāru: "Mam'malni kūḍā mī veṇṭa rānivvaṇḍi." Vāru allāh uttaruvunu mārcagōrutunnāru. Vāritō anu: "Mīru mā veṇṭa rājālaru; mī gurin̄ci allāh mundē ī vidhaṅgā ceppāḍu." Appuḍu vāru ilā aṇṭāru: "Adi kādu! Mīru mā mīda asūya paḍutunnāru." Alā kādu! Vāru vāstavānni arthaṁ cēsukōgaligēdi cālā takkuva
Muhammad Aziz Ur Rehman
మీరు యుద్ధప్రాప్తిని తీసుకోవటానికి వెళుతున్నప్పుడు, వెనుక ఉండిపోయిన జనులు (గబగబా) వచ్చి, “మమ్మల్ని కూడా మీ వెంట రావటానికి అనుమతించండి” అని అంటారు. వారు అల్లాహ్ మాటనే మార్చివేయజూస్తున్నారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పేయి : “మీరు ఎట్టి పరిస్థితిలోనూ మా వెంట రాలేరు. ఈ మేరకు అల్లాహ్ ముందుగానే సెలవిచ్చాడు.” దానికి వారు, “అది కాదులెండి. మీరు మాపై అసూయ చెందుతున్నారు” అని సమాధానమిస్తారు. అసలు విషయం ఏమిటంటే వారు విషయాన్ని చాలా కొద్దిగానే గ్రహిస్తారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek