Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 3 - المَائدة - Page - Juz 6
﴿حُرِّمَتۡ عَلَيۡكُمُ ٱلۡمَيۡتَةُ وَٱلدَّمُ وَلَحۡمُ ٱلۡخِنزِيرِ وَمَآ أُهِلَّ لِغَيۡرِ ٱللَّهِ بِهِۦ وَٱلۡمُنۡخَنِقَةُ وَٱلۡمَوۡقُوذَةُ وَٱلۡمُتَرَدِّيَةُ وَٱلنَّطِيحَةُ وَمَآ أَكَلَ ٱلسَّبُعُ إِلَّا مَا ذَكَّيۡتُمۡ وَمَا ذُبِحَ عَلَى ٱلنُّصُبِ وَأَن تَسۡتَقۡسِمُواْ بِٱلۡأَزۡلَٰمِۚ ذَٰلِكُمۡ فِسۡقٌۗ ٱلۡيَوۡمَ يَئِسَ ٱلَّذِينَ كَفَرُواْ مِن دِينِكُمۡ فَلَا تَخۡشَوۡهُمۡ وَٱخۡشَوۡنِۚ ٱلۡيَوۡمَ أَكۡمَلۡتُ لَكُمۡ دِينَكُمۡ وَأَتۡمَمۡتُ عَلَيۡكُمۡ نِعۡمَتِي وَرَضِيتُ لَكُمُ ٱلۡإِسۡلَٰمَ دِينٗاۚ فَمَنِ ٱضۡطُرَّ فِي مَخۡمَصَةٍ غَيۡرَ مُتَجَانِفٖ لِّإِثۡمٖ فَإِنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمٞ ﴾
[المَائدة: 3]
﴿حرمت عليكم الميتة والدم ولحم الخنـزير وما أهل لغير الله به والمنخنقة﴾ [المَائدة: 3]
Abdul Raheem Mohammad Moulana (Sahajanga) maranincindi, raktam, pandi mansam mariyu allah tappa itarula koraku (itarula peruto) vadhimpabadinadi (jib h ceyabadinadi), gontu pisiki upiradaka, debba tagili, ettu nundi padi, kom'mu tagili mariyu kruramrgam nota padi caccina (pasuvu/ paksi) anni, miku tinataniki nisid'dham (haram) ceyabaddayi. Kani (krura mrgam nota padina danini) cavaka munde miru jib h cesinatlaite adi nisid'dham kadu. Mariyu balipitham mida vadhincabadinadi, mariyu banala dvara sakunam cudatam nisedhimpabaddayi. Ivanni ghora papalu (phis khun). Inadu satyatiraskarulu, mi dharmam gurinci purtiga asalu vadulu kunnaru. Kanuka miru variki bhayapadakandi, nake bhayapadandi. Inadu nenu mi dharmanni mi koraku paripurnam cesi, mipai na anugrahanni purti cesanu mariyu mi koraku allah ku vidheyuluga undatanne (islanne) dharmanga sam'matincanu. Evadaina akaliki orcukoleka, papaniki punukoka, (nisid'dhamaina vastuvulanu tinnatlaite)! Niscayanga allah ksamasiludu, apara karuna pradata |
Abdul Raheem Mohammad Moulana (Sahajaṅgā) maraṇin̄cindi, raktaṁ, pandi mānsaṁ mariyu allāh tappa itarula koraku (itarula pērutō) vadhimpabaḍinadi (jib h cēyabaḍinadi), gontu pisiki ūpirāḍaka, debba tagili, ettu nuṇḍi paḍi, kom'mu tagili mariyu krūramr̥gaṁ nōṭa paḍi caccina (paśuvu/ pakṣi) annī, mīku tinaṭāniki niṣid'dhaṁ (harām) cēyabaḍḍāyi. Kāni (krūra mr̥gaṁ nōṭa paḍina dānini) cāvaka mundē mīru jib h cēsinaṭlaitē adi niṣid'dhaṁ kādu. Mariyu balipīṭhaṁ mīda vadhin̄cabaḍinadi, mariyu bāṇāla dvārā śakunaṁ cūḍaṭaṁ niṣēdhimpabaḍḍāyi. Ivannī ghōra pāpālu (phis khun). Īnāḍu satyatiraskārulu, mī dharmaṁ gurin̄ci pūrtigā āśalu vadulu kunnāru. Kanuka mīru vāriki bhayapaḍakaṇḍi, nākē bhayapaḍaṇḍi. Īnāḍu nēnu mī dharmānni mī koraku paripūrṇaṁ cēsi, mīpai nā anugrahānni pūrti cēśānu mariyu mī koraku allāh ku vidhēyulugā uṇḍaṭānnē (islānnē) dharmaṅgā sam'matin̄cānu. Evaḍainā ākaliki ōrcukōlēka, pāpāniki pūnukōka, (niṣid'dhamaina vastuvulanu tinnaṭlaitē)! Niścayaṅgā allāh kṣamāśīluḍu, apāra karuṇā pradāta |
Muhammad Aziz Ur Rehman మీ కొరకు నిషేధించబడిన వస్తువులు ఇవి : మృత పశువు, రక్తం, పంది మాంసం, అల్లాహ్ పేరుగాక వేరితరుల పేరు ఉచ్చరించబడినది, గొంతు పిసకబడటం వల్ల చచ్చిన పశువు, దెబ్బ తగిలి చనిపోయిన పశువు, ఎత్తయిన స్థలం నుంచి క్రిందపడి చనిపోయినది లేక కొమ్ము తగలటం వల్ల చచ్చిపోయినది, క్రూరమృగాలు చీల్చి తినటం వల్ల చనిపోయిన పశువు (ఇవి మీ కొరకు హరామ్ గావించబడ్డాయి). కాని మీరు ఒకవేళ ‘జిబహ్’ చేస్తే అది మీ కొరకు నిషిద్ధం కాదు. అలాగే ఆస్థానాల వద్ద బలి ఇచ్చినవి కూడా నిషిద్ధమే. అదే విధంగా బాణాల ప్రయోగం ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకోవటం కూడా నిషిద్ధమే. ఇవన్నీ అత్యంత నీచమైన పాప కార్యాలు. ఈ రోజు అవిశ్వాసులు మీ ధర్మం గురించి ఇక ఆశను వదులుకున్నారు. జాగ్రత్త! మీరు భయపడవలసింది వారికి కాదు, మీరు నాకు భయపడండి. ఈ రోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణం గావించాను. మీపై నా అనుగ్రహాన్ని పూర్తిచేశాను. ఇంకా, ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను. ఎవడయినా తీవ్రమయిన ఆకలి బాధతో అల్లాడిపోతూ – గత్యంతరంలేని పరిస్థితిలో పాపానికి పాల్పడే ఉద్దేశం లేకుండా ఉండి (పై వాటిలో దేన్నయినా తిన్నట్లయితే) నిస్సందేహంగా అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడూను |