×

ఓ విశ్వాసులారా! అల్లాహ్ (నియమించిన) చిహ్నాలను మరియు నిషిద్ధ మాసాన్ని ఉల్లంఘించకండి. మరియు బలి పశువులకు 5:2 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:2) ayat 2 in Telugu

5:2 Surah Al-Ma’idah ayat 2 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 2 - المَائدة - Page - Juz 6

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تُحِلُّواْ شَعَٰٓئِرَ ٱللَّهِ وَلَا ٱلشَّهۡرَ ٱلۡحَرَامَ وَلَا ٱلۡهَدۡيَ وَلَا ٱلۡقَلَٰٓئِدَ وَلَآ ءَآمِّينَ ٱلۡبَيۡتَ ٱلۡحَرَامَ يَبۡتَغُونَ فَضۡلٗا مِّن رَّبِّهِمۡ وَرِضۡوَٰنٗاۚ وَإِذَا حَلَلۡتُمۡ فَٱصۡطَادُواْۚ وَلَا يَجۡرِمَنَّكُمۡ شَنَـَٔانُ قَوۡمٍ أَن صَدُّوكُمۡ عَنِ ٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِ أَن تَعۡتَدُواْۘ وَتَعَاوَنُواْ عَلَى ٱلۡبِرِّ وَٱلتَّقۡوَىٰۖ وَلَا تَعَاوَنُواْ عَلَى ٱلۡإِثۡمِ وَٱلۡعُدۡوَٰنِۚ وَٱتَّقُواْ ٱللَّهَۖ إِنَّ ٱللَّهَ شَدِيدُ ٱلۡعِقَابِ ﴾
[المَائدة: 2]

ఓ విశ్వాసులారా! అల్లాహ్ (నియమించిన) చిహ్నాలను మరియు నిషిద్ధ మాసాన్ని ఉల్లంఘించకండి. మరియు బలి పశువులకు మరియు మెడలలో పట్టీ ఉన్న పశువులకు (హాని చేయకండి). మరియు తమ ప్రభువు అనుగ్రహాన్ని మరియు ప్రీతిని కోరుతూ పవిత్ర గృహానికి (కఅబహ్ కు) పోయే వారిని (ఆటంక పరచకండి). కానీ ఇహ్రామ్ స్థితి ముగిసిన తరువాత మీరు వేటాడవచ్చు. మిమ్మల్ని పవిత్ర మస్జిద్ (మస్జిద్ అల్ హరామ్) ను సందర్శించకుండా నిరోధించిన వారి పట్ల గల విరోధం వలన వారితో హద్దులు మీరి ప్రవర్తించకండి. మరియు పుణ్యకార్యాలు మరియు దైవభీతి విషయాలలో, ఒకరికొకరు తోడ్పడండి. మరియు పాపకార్యాలలో గానీ, దౌర్జన్యాలలో గానీ తోడ్పడకండి. అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి. నిశ్చయంగా, అల్లాహ్ శిక్ష విధించటంలో చాల కఠినుడు

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا لا تحلوا شعائر الله ولا الشهر الحرام ولا الهدي, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا لا تحلوا شعائر الله ولا الشهر الحرام ولا الهدي﴾ [المَائدة: 2]

Abdul Raheem Mohammad Moulana
O visvasulara! Allah (niyamincina) cihnalanu mariyu nisid'dha masanni ullanghincakandi. Mariyu bali pasuvulaku mariyu medalalo patti unna pasuvulaku (hani ceyakandi). Mariyu tama prabhuvu anugrahanni mariyu pritini korutu pavitra grhaniki (ka'abah ku) poye varini (atanka paracakandi). Kani ihram sthiti mugisina taruvata miru vetadavaccu. Mim'malni pavitra masjid (masjid al haram) nu sandarsincakunda nirodhincina vari patla gala virodham valana varito haddulu miri pravartincakandi. Mariyu punyakaryalu mariyu daivabhiti visayalalo, okarikokaru todpadandi. Mariyu papakaryalalo gani, daurjan'yalalo gani todpadakandi. Allah yandu bhayabhaktulu kaligi undandi. Niscayanga, allah siksa vidhincatanlo cala kathinudu
Abdul Raheem Mohammad Moulana
Ō viśvāsulārā! Allāh (niyamin̄cina) cihnālanu mariyu niṣid'dha māsānni ullaṅghin̄cakaṇḍi. Mariyu bali paśuvulaku mariyu meḍalalō paṭṭī unna paśuvulaku (hāni cēyakaṇḍi). Mariyu tama prabhuvu anugrahānni mariyu prītini kōrutū pavitra gr̥hāniki (ka'abah ku) pōyē vārini (āṭaṅka paracakaṇḍi). Kānī ihrām sthiti mugisina taruvāta mīru vēṭāḍavaccu. Mim'malni pavitra masjid (masjid al harām) nu sandarśin̄cakuṇḍā nirōdhin̄cina vāri paṭla gala virōdhaṁ valana vāritō haddulu mīri pravartin̄cakaṇḍi. Mariyu puṇyakāryālu mariyu daivabhīti viṣayālalō, okarikokaru tōḍpaḍaṇḍi. Mariyu pāpakāryālalō gānī, daurjan'yālalō gānī tōḍpaḍakaṇḍi. Allāh yandu bhayabhaktulu kaligi uṇḍaṇḍi. Niścayaṅgā, allāh śikṣa vidhin̄caṭanlō cāla kaṭhinuḍu
Muhammad Aziz Ur Rehman
విశ్వసించిన ఓ ప్రజలారా! అల్లాహ్‌ చిహ్నాలనుగానీ, ఏ నిషిద్ధ మాసాన్నిగానీ అగౌరవపరచకండి. ఖుర్బానీ నిమిత్తం కాబా గృహానికి గొనిపోబడుతున్న జంతువుల, మెడలో పట్టాలు కట్టబడి ఉన్న జంతువుల జోలికిపోకండి. అలాగే తమ ప్రభువు అనుగ్రహాన్ని, ప్రసన్నతను పొందే ఉద్దేశ్యంతో పవిత్ర గృహం (కాబా) వైపుకు వెళుతున్న వారికి అడ్డు తగలకండి. అయితే మీరు ఇహ్రామ్‌ దీక్షను విరమించిన మీదట వేటాడవచ్చు. మస్జిదె హరామ్‌కు పోకుండా (ఒకప్పుడు) మిమ్మల్ని నిలువరించిన వారి పట్ల ద్వేషం మిమ్మల్ని హద్దుమీరినవారుగా మార్చివేయరాదు. సత్కార్యాలలో, అల్లాహ్‌ భీతితో కూడిన విషయాలలో ఒండొకరికి తోడ్పడుతూ ఉండండి. పాపకార్యాలలో, దౌర్జన్యపు పనుల్లో ఎవరితోనూ సహకరించకండి. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. నిస్సందేహంగా అల్లాహ్‌ చాలా కఠినంగా శిక్షించేవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek