×

మరియు అతను తన తల్లిదండ్రులను సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. మరియు వారందరూ అతని ముందు సాష్టాంగపడ్డారు. 12:100 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:100) ayat 100 in Telugu

12:100 Surah Yusuf ayat 100 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 100 - يُوسُف - Page - Juz 13

﴿وَرَفَعَ أَبَوَيۡهِ عَلَى ٱلۡعَرۡشِ وَخَرُّواْ لَهُۥ سُجَّدٗاۖ وَقَالَ يَٰٓأَبَتِ هَٰذَا تَأۡوِيلُ رُءۡيَٰيَ مِن قَبۡلُ قَدۡ جَعَلَهَا رَبِّي حَقّٗاۖ وَقَدۡ أَحۡسَنَ بِيٓ إِذۡ أَخۡرَجَنِي مِنَ ٱلسِّجۡنِ وَجَآءَ بِكُم مِّنَ ٱلۡبَدۡوِ مِنۢ بَعۡدِ أَن نَّزَغَ ٱلشَّيۡطَٰنُ بَيۡنِي وَبَيۡنَ إِخۡوَتِيٓۚ إِنَّ رَبِّي لَطِيفٞ لِّمَا يَشَآءُۚ إِنَّهُۥ هُوَ ٱلۡعَلِيمُ ٱلۡحَكِيمُ ﴾
[يُوسُف: 100]

మరియు అతను తన తల్లిదండ్రులను సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు. మరియు వారందరూ అతని ముందు సాష్టాంగపడ్డారు. మరియు (యూసుఫ్) అన్నాడు: "ఓ నా తండ్రీ! నేను పూర్వం కన్న కల యొక్క భావం ఇదే కదా! నా ప్రభువు వాస్తవంగా దానిని సత్యం చేసి చూపాడు. మరియు వాస్తవంగా నన్ను చెరసాన నుండి బయటికి తీసి కూడా నాకు ఎంతో మేలు చేశాడు; నాకూ మరియు నా సోదరుల మధ్య షైతాను విరోధం కలిగించిన తరువాత (ఇప్పుడు) మిమ్మల్ని ఎడారి నుండి (ఇక్కడకు) తెచ్చాడు. నిశ్చయంగా, నా ప్రభువు సూక్ష్మగ్రాహి తాను కోరినది యుక్తితో నెరవేర్చుతాడు. నిశ్చయంగా ఆయన సర్వజ్ఞుడు, మహా వివేకవంతుడు

❮ Previous Next ❯

ترجمة: ورفع أبويه على العرش وخروا له سجدا وقال ياأبت هذا تأويل رؤياي, باللغة التيلجو

﴿ورفع أبويه على العرش وخروا له سجدا وقال ياأبت هذا تأويل رؤياي﴾ [يُوسُف: 100]

Abdul Raheem Mohammad Moulana
mariyu atanu tana tallidandrulanu sinhasanam mida kurcobettukunnadu. Mariyu varandaru atani mundu sastangapaddaru. Mariyu (yusuph) annadu: "O na tandri! Nenu purvam kanna kala yokka bhavam ide kada! Na prabhuvu vastavanga danini satyam cesi cupadu. Mariyu vastavanga nannu cerasana nundi bayatiki tisi kuda naku ento melu cesadu; naku mariyu na sodarula madhya saitanu virodham kaligincina taruvata (ippudu) mim'malni edari nundi (ikkadaku) teccadu. Niscayanga, na prabhuvu suksmagrahi tanu korinadi yuktito neravercutadu. Niscayanga ayana sarvajnudu, maha vivekavantudu
Abdul Raheem Mohammad Moulana
mariyu atanu tana tallidaṇḍrulanu sinhāsanaṁ mīda kūrcōbeṭṭukunnāḍu. Mariyu vārandarū atani mundu sāṣṭāṅgapaḍḍāru. Mariyu (yūsuph) annāḍu: "Ō nā taṇḍrī! Nēnu pūrvaṁ kanna kala yokka bhāvaṁ idē kadā! Nā prabhuvu vāstavaṅgā dānini satyaṁ cēsi cūpāḍu. Mariyu vāstavaṅgā nannu cerasāna nuṇḍi bayaṭiki tīsi kūḍā nāku entō mēlu cēśāḍu; nākū mariyu nā sōdarula madhya ṣaitānu virōdhaṁ kaligin̄cina taruvāta (ippuḍu) mim'malni eḍāri nuṇḍi (ikkaḍaku) teccāḍu. Niścayaṅgā, nā prabhuvu sūkṣmagrāhi tānu kōrinadi yuktitō neravērcutāḍu. Niścayaṅgā āyana sarvajñuḍu, mahā vivēkavantuḍu
Muhammad Aziz Ur Rehman
అతను తన తల్లిదండ్రులను ఎత్తయిన సింహాసనంపై కూర్చోబెట్టాడు. వారందరూ అతని ముందు సాష్టాంగపడ్డారు. అప్పుడు అతనిలా అన్నాడు : “నాన్నగారూ! పూర్వం నేను కన్నకలకు భావం ఇది. నా ప్రభువు దీన్ని నిజం చేసి చూపాడు. కారాగారం నుండి బయటకు తీసినపుడు ఆయన నాకు మహోపకారం చేశాడు. నాకూ – నా సోదరులకూ మధ్య షైతాన్‌ చిచ్చుపెట్టిన తరువాత అందరినీ ఎడారి ప్రాంతం నుంచి తీసుకొచ్చి కలిపాడు. నా ప్రభువు తన సంకల్పాన్ని ఎవరూ గ్రహించలేని యుక్తులద్వారా నెరవేరుస్తాడు. ఆయన అన్నీ తెలిసినవాడూ, వివేకవంతుడూను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek