×

ఆమె వారి నిందారోపణలు విని, వారికి ఆహ్వానం పంపింది. వారికి ఒక మంచి విందు ఏర్పాటు 12:31 Telugu translation

Quran infoTeluguSurah Yusuf ⮕ (12:31) ayat 31 in Telugu

12:31 Surah Yusuf ayat 31 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Yusuf ayat 31 - يُوسُف - Page - Juz 12

﴿فَلَمَّا سَمِعَتۡ بِمَكۡرِهِنَّ أَرۡسَلَتۡ إِلَيۡهِنَّ وَأَعۡتَدَتۡ لَهُنَّ مُتَّكَـٔٗا وَءَاتَتۡ كُلَّ وَٰحِدَةٖ مِّنۡهُنَّ سِكِّينٗا وَقَالَتِ ٱخۡرُجۡ عَلَيۡهِنَّۖ فَلَمَّا رَأَيۡنَهُۥٓ أَكۡبَرۡنَهُۥ وَقَطَّعۡنَ أَيۡدِيَهُنَّ وَقُلۡنَ حَٰشَ لِلَّهِ مَا هَٰذَا بَشَرًا إِنۡ هَٰذَآ إِلَّا مَلَكٞ كَرِيمٞ ﴾
[يُوسُف: 31]

ఆమె వారి నిందారోపణలు విని, వారికి ఆహ్వానం పంపింది. వారికి ఒక మంచి విందు ఏర్పాటు చేసి, ఒక్కొక్క స్త్రీకి ఒక్కొక్క కత్తి ఇచ్చి, (యూసుఫ్ తో): "వారి ముందుకు రా!" అని అన్నది. ఆ స్త్రీలు అతనిని చూడగానే నివ్వెరపోయారు మరియు (ఆశ్చర్యంతో చేతులలో ఉన్న కత్తులతో) తమ చేతులను కోసుకున్నారు. (అప్రయత్నంగా) అన్నారు: "అల్లాహ్ మహిమ! (హాషలిల్లాహ్) ఇతను మానవుడు మాత్రం కాడు! ఇతను గొప్ప దేవదూతయే కాగలడు

❮ Previous Next ❯

ترجمة: فلما سمعت بمكرهن أرسلت إليهن وأعتدت لهن متكأ وآتت كل واحدة منهن, باللغة التيلجو

﴿فلما سمعت بمكرهن أرسلت إليهن وأعتدت لهن متكأ وآتت كل واحدة منهن﴾ [يُوسُف: 31]

Abdul Raheem Mohammad Moulana
ame vari nindaropanalu vini, variki ahvanam pampindi. Variki oka manci vindu erpatu cesi, okkokka striki okkokka katti icci, (yusuph to): "Vari munduku ra!" Ani annadi. A strilu atanini cudagane nivverapoyaru mariyu (ascaryanto cetulalo unna kattulato) tama cetulanu kosukunnaru. (Aprayatnanga) annaru: "Allah mahima! (Hasalillah) itanu manavudu matram kadu! Itanu goppa devadutaye kagaladu
Abdul Raheem Mohammad Moulana
āme vāri nindārōpaṇalu vini, vāriki āhvānaṁ pampindi. Vāriki oka man̄ci vindu ērpāṭu cēsi, okkokka strīki okkokka katti icci, (yūsuph tō): "Vāri munduku rā!" Ani annadi. Ā strīlu atanini cūḍagānē nivverapōyāru mariyu (āścaryantō cētulalō unna kattulatō) tama cētulanu kōsukunnāru. (Aprayatnaṅgā) annāru: "Allāh mahima! (Hāṣalillāh) itanu mānavuḍu mātraṁ kāḍu! Itanu goppa dēvadūtayē kāgalaḍu
Muhammad Aziz Ur Rehman
వారి మోసపు మాటల గురించి విని ఆమె వాళ్ళను పిలిపించింది. వారికోసం ఒక సదనాన్ని ఏర్పాటుచేసింది. వారిలో ఒక్కొక్కరికి ఒక్కో కత్తి ఇచ్చి, (వారంతా ఆసీనులైన తరువాత) “వీళ్లముందుకురా!” అని (యూసుఫ్‌ను) ఆదేశించింది. ఆ స్త్రీలు అతన్ని చూడగానే దిగ్భ్రమతో (మైమరచి) తమ చేతులనే కోసుకున్నారు. “హాషాలిల్లాహ్‌! (దైవమహిమ!) ఇతను మానవమాత్రుడు కాడు. నిశ్చయంగా ఇతను (దివి నుంచి భువికి దిగివచ్చిన) గొప్పదైవదూతే!” అన్నమాటలు వారినోట (అప్రయత్నంగా) వెలువడ్డాయి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek