×

మరియు అల్లాహ్ (ప్రసన్నత) కొరకు హజ్జ్ మరియు ఉమ్రా పూర్తి చేయండి. మీకు అక్కడ చేరటానికి 2:196 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:196) ayat 196 in Telugu

2:196 Surah Al-Baqarah ayat 196 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 196 - البَقَرَة - Page - Juz 2

﴿وَأَتِمُّواْ ٱلۡحَجَّ وَٱلۡعُمۡرَةَ لِلَّهِۚ فَإِنۡ أُحۡصِرۡتُمۡ فَمَا ٱسۡتَيۡسَرَ مِنَ ٱلۡهَدۡيِۖ وَلَا تَحۡلِقُواْ رُءُوسَكُمۡ حَتَّىٰ يَبۡلُغَ ٱلۡهَدۡيُ مَحِلَّهُۥۚ فَمَن كَانَ مِنكُم مَّرِيضًا أَوۡ بِهِۦٓ أَذٗى مِّن رَّأۡسِهِۦ فَفِدۡيَةٞ مِّن صِيَامٍ أَوۡ صَدَقَةٍ أَوۡ نُسُكٖۚ فَإِذَآ أَمِنتُمۡ فَمَن تَمَتَّعَ بِٱلۡعُمۡرَةِ إِلَى ٱلۡحَجِّ فَمَا ٱسۡتَيۡسَرَ مِنَ ٱلۡهَدۡيِۚ فَمَن لَّمۡ يَجِدۡ فَصِيَامُ ثَلَٰثَةِ أَيَّامٖ فِي ٱلۡحَجِّ وَسَبۡعَةٍ إِذَا رَجَعۡتُمۡۗ تِلۡكَ عَشَرَةٞ كَامِلَةٞۗ ذَٰلِكَ لِمَن لَّمۡ يَكُنۡ أَهۡلُهُۥ حَاضِرِي ٱلۡمَسۡجِدِ ٱلۡحَرَامِۚ وَٱتَّقُواْ ٱللَّهَ وَٱعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ شَدِيدُ ٱلۡعِقَابِ ﴾
[البَقَرَة: 196]

మరియు అల్లాహ్ (ప్రసన్నత) కొరకు హజ్జ్ మరియు ఉమ్రా పూర్తి చేయండి. మీకు అక్కడ చేరటానికి (వాటిని పూర్తి చేయటానికి) ఆటంకం కలిగినట్లైతే, మీరు ఇవ్వదలుచుకున్న బలి (ఖుర్బానీ) ఇవ్వండి. బలి జంతువు దాని గమ్యస్థానానికి చేరనంత వరకు మీరు శిరోముండనం చేసుకోకండి. కానీ, మీలో ఎవడైనా వ్యాధిగ్రస్తుడై ఉంటే లేదా అతని తలకు బాధ ఉంటే (శిరోముండనం చేసుకొని) దాని పరిహారంగా (మూడు రోజులు) ఉపవాసం ఉండాలి. లేదా దానధర్మాలు చేయాలి (ఆరుగురు నిరుపేదలకు భోజనం పెట్టాలి), లేదా బలి ఇవ్వాలి. కాని శాంతి భద్రతలు ఉన్న సమయాలలో ఎవడైనా హజ్జె తమత్తు చేయదలుచుకుంటే, అతడు తన శక్తిమేరకు బలి ఇవ్వాలి. కాని ఎవడైతే ఖుర్బానీ ఇవ్వలేడో, హజ్జ్ కాలంలో మూడు దినాలు మరియు (ఇంటికి) తిరిగి వచ్చిన పిమ్మట ఏడు దినాలు ఉపవాసం ఉండాలి. ఈ విధంగా మొత్తం పది దినాలు ఉపవాసాలు ఉండాలి. ఇది మస్జిద్ అల్ హరామ్ దగ్గర నివసించని వారికి మాత్రమే. మరియు అల్లాహ్ యెడల భయభక్తులు కలిగి ఉండండి. మరియు నిశ్చయంగా, అల్లాహ్ శిక్ష విధించటంలో చాలా కఠినుడు, అని తెలుసుకోండి

❮ Previous Next ❯

ترجمة: وأتموا الحج والعمرة لله فإن أحصرتم فما استيسر من الهدي ولا تحلقوا, باللغة التيلجو

﴿وأتموا الحج والعمرة لله فإن أحصرتم فما استيسر من الهدي ولا تحلقوا﴾ [البَقَرَة: 196]

Abdul Raheem Mohammad Moulana
Mariyu allah (prasannata) koraku hajj mariyu umra purti ceyandi. Miku akkada cerataniki (vatini purti ceyataniki) atankam kaliginatlaite, miru ivvadalucukunna bali (khurbani) ivvandi. Bali jantuvu dani gamyasthananiki cerananta varaku miru siromundanam cesukokandi. Kani, milo evadaina vyadhigrastudai unte leda atani talaku badha unte (siromundanam cesukoni) dani pariharanga (mudu rojulu) upavasam undali. Leda danadharmalu ceyali (aruguru nirupedalaku bhojanam pettali), leda bali ivvali. Kani santi bhadratalu unna samayalalo evadaina hajje tamattu ceyadalucukunte, atadu tana saktimeraku bali ivvali. Kani evadaite khurbani ivvaledo, hajj kalanlo mudu dinalu mariyu (intiki) tirigi vaccina pim'mata edu dinalu upavasam undali. I vidhanga mottam padi dinalu upavasalu undali. Idi masjid al haram daggara nivasincani variki matrame. Mariyu allah yedala bhayabhaktulu kaligi undandi. Mariyu niscayanga, allah siksa vidhincatanlo cala kathinudu, ani telusukondi
Abdul Raheem Mohammad Moulana
Mariyu allāh (prasannata) koraku hajj mariyu umrā pūrti cēyaṇḍi. Mīku akkaḍa cēraṭāniki (vāṭini pūrti cēyaṭāniki) āṭaṅkaṁ kaliginaṭlaitē, mīru ivvadalucukunna bali (khurbānī) ivvaṇḍi. Bali jantuvu dāni gamyasthānāniki cērananta varaku mīru śirōmuṇḍanaṁ cēsukōkaṇḍi. Kānī, mīlō evaḍainā vyādhigrastuḍai uṇṭē lēdā atani talaku bādha uṇṭē (śirōmuṇḍanaṁ cēsukoni) dāni parihāraṅgā (mūḍu rōjulu) upavāsaṁ uṇḍāli. Lēdā dānadharmālu cēyāli (āruguru nirupēdalaku bhōjanaṁ peṭṭāli), lēdā bali ivvāli. Kāni śānti bhadratalu unna samayālalō evaḍainā hajje tamattu cēyadalucukuṇṭē, ataḍu tana śaktimēraku bali ivvāli. Kāni evaḍaitē khurbānī ivvalēḍō, hajj kālanlō mūḍu dinālu mariyu (iṇṭiki) tirigi vaccina pim'maṭa ēḍu dinālu upavāsaṁ uṇḍāli. Ī vidhaṅgā mottaṁ padi dinālu upavāsālu uṇḍāli. Idi masjid al harām daggara nivasin̄cani vāriki mātramē. Mariyu allāh yeḍala bhayabhaktulu kaligi uṇḍaṇḍi. Mariyu niścayaṅgā, allāh śikṣa vidhin̄caṭanlō cālā kaṭhinuḍu, ani telusukōṇḍi
Muhammad Aziz Ur Rehman
హజ్‌, ఉమ్రహ్‌లను అల్లాహ్‌ కొరకు పూర్తిచేయండి. ఒకవేళ మీరు నిలువరించబడితే, మీరు ఇవ్వగలిగిన ఖుర్బానీని ఇచ్చివేయండి. మీరు ఇచ్చే ఖుర్బానీ, ఖుర్బానీ స్థలానికి చేరనంతవరకూ శిరోముండనం చేయించుకోకండి. అయితే మీలో వ్యాధిగ్రస్తులుగా ఉన్నవారు, లేదా తలలో బాధ ఉన్నవారు (శిరోముండనం చేయించుకుంటే ఫరవాలేదు. కాని వారు) దీనికి పరిహారంగా ఉపవాసం ఉండటమో, దానధర్మాలు చేయటమో, ఖుర్బానీ ఇవ్వటమో చేయాలి. మరి ఆ తర్వాత (చిక్కుల నుంచి, నిలువరింపు నుంచి) ప్రశాంతతను పొంది ఉన్న స్థితిలో మీలో ఎవరయినా ఉమ్రహ్‌ మొదలుకుని హజ్‌ వరకు సంకల్పం బూని ప్రయోజనం (తమత్తు) పొందినట్లయితే, వారు తమ వద్దనున్న ఖుర్బానీని ఇచ్చివేయాలి. ఖుర్బానీ ఇవ్వలేనివారు హజ్‌ దినాలలో మూడు రోజులు ఉపవాసం పాటించాలి. హజ్‌ నుండి తిరిగి వచ్చిన తరువాత ఏడు రోజులు ఉపవాసముండాలి. ఈ విధంగా మొత్తం పది ఉపవాసాలవుతాయి. మస్జిదె హరామ్‌కు సమీపంలో ఉండని వారికి మాత్రమే ఈ ఆదేశం వర్తిస్తుంది. (ప్రజలారా!) అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. అల్లాహ్‌ కఠినంగా శిక్షించేవాడన్న సంగతిని తెలుసుకోండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek