×

మరియు విడాకులివ్వబడిన స్త్రీలు మూడు ఋతువుల వరకు (మరొకతనితో పెండ్లి చేసుకోకుండా) వేచి ఉండాలి. మరియు 2:228 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:228) ayat 228 in Telugu

2:228 Surah Al-Baqarah ayat 228 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 228 - البَقَرَة - Page - Juz 2

﴿وَٱلۡمُطَلَّقَٰتُ يَتَرَبَّصۡنَ بِأَنفُسِهِنَّ ثَلَٰثَةَ قُرُوٓءٖۚ وَلَا يَحِلُّ لَهُنَّ أَن يَكۡتُمۡنَ مَا خَلَقَ ٱللَّهُ فِيٓ أَرۡحَامِهِنَّ إِن كُنَّ يُؤۡمِنَّ بِٱللَّهِ وَٱلۡيَوۡمِ ٱلۡأٓخِرِۚ وَبُعُولَتُهُنَّ أَحَقُّ بِرَدِّهِنَّ فِي ذَٰلِكَ إِنۡ أَرَادُوٓاْ إِصۡلَٰحٗاۚ وَلَهُنَّ مِثۡلُ ٱلَّذِي عَلَيۡهِنَّ بِٱلۡمَعۡرُوفِۚ وَلِلرِّجَالِ عَلَيۡهِنَّ دَرَجَةٞۗ وَٱللَّهُ عَزِيزٌ حَكِيمٌ ﴾
[البَقَرَة: 228]

మరియు విడాకులివ్వబడిన స్త్రీలు మూడు ఋతువుల వరకు (మరొకతనితో పెండ్లి చేసుకోకుండా) వేచి ఉండాలి. మరియు వారు అల్లాహ్ యందు మరియు అంతిమ దినమునందు విశ్వాసమున్నవారే అయితే, అల్లాహ్ వారి గర్భాలలో సృష్టించిన దానిని దాచటం వారికి ధర్మసమ్మతం కాదు. మరియు వారి భర్తలు దాంపత్య సంబంధాలను సరిదిద్దుకోవటానికి సిద్ధంగా ఉంటే! ఈ నిరీక్షణ కాలంలో వారిని తమ భార్యలుగా తిరిగి స్వీకరించే హక్కు వారికి ఉంది. మరియు వారికి (స్త్రీలకు) వారి (భర్తల)పై ధర్మసమ్మతమైన హక్కులున్నాయి. ఏ విధంగానైతే వారికి (భర్తలకు) వారిపై ఉన్నాయో. కాని పురుషులకు స్త్రీలపై (కర్తవ్య) ఆధిక్యత ఉంది. మరియు అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు

❮ Previous Next ❯

ترجمة: والمطلقات يتربصن بأنفسهن ثلاثة قروء ولا يحل لهن أن يكتمن ما خلق, باللغة التيلجو

﴿والمطلقات يتربصن بأنفسهن ثلاثة قروء ولا يحل لهن أن يكتمن ما خلق﴾ [البَقَرَة: 228]

Abdul Raheem Mohammad Moulana
Mariyu vidakulivvabadina strilu mudu rtuvula varaku (marokatanito pendli cesukokunda) veci undali. Mariyu varu allah yandu mariyu antima dinamunandu visvasamunnavare ayite, allah vari garbhalalo srstincina danini dacatam variki dharmasam'matam kadu. Mariyu vari bhartalu dampatya sambandhalanu sarididdukovataniki sid'dhanga unte! I niriksana kalanlo varini tama bharyaluga tirigi svikarince hakku variki undi. Mariyu variki (strilaku) vari (bhartala)pai dharmasam'matamaina hakkulunnayi. E vidhanganaite variki (bhartalaku) varipai unnayo. Kani purusulaku strilapai (kartavya) adhikyata undi. Mariyu allah sarvasaktimantudu, maha vivekavantudu
Abdul Raheem Mohammad Moulana
Mariyu viḍākulivvabaḍina strīlu mūḍu r̥tuvula varaku (marokatanitō peṇḍli cēsukōkuṇḍā) vēci uṇḍāli. Mariyu vāru allāh yandu mariyu antima dinamunandu viśvāsamunnavārē ayitē, allāh vāri garbhālalō sr̥ṣṭin̄cina dānini dācaṭaṁ vāriki dharmasam'mataṁ kādu. Mariyu vāri bhartalu dāmpatya sambandhālanu sarididdukōvaṭāniki sid'dhaṅgā uṇṭē! Ī nirīkṣaṇa kālanlō vārini tama bhāryalugā tirigi svīkarin̄cē hakku vāriki undi. Mariyu vāriki (strīlaku) vāri (bhartala)pai dharmasam'matamaina hakkulunnāyi. Ē vidhaṅgānaitē vāriki (bhartalaku) vāripai unnāyō. Kāni puruṣulaku strīlapai (kartavya) ādhikyata undi. Mariyu allāh sarvaśaktimantuḍu, mahā vivēkavantuḍu
Muhammad Aziz Ur Rehman
విడాకులు పొందిన స్త్రీలు తమను తాము మూడు రుతువుల దాకా ఆపి ఉంచుకోవాలి. వారు అల్లాహ్‌ను, అంతిమదినాన్నీ విశ్వసించేవారే అయితే అల్లాహ్‌ వారి గర్భాలలో సృష్టించిన దానిని దాచి ఉంచటం వారికి ధర్మ సమ్మతంకాదు. ఒకవేళ ఈ గడువు లోపల వారిని తిరిగి రప్పించుకోవాలన్న సదుద్దేశం భర్తలకు ఉంటే ధర్మం ప్రకారం అలా రప్పించుకునే హక్కు వారికి ఉంది. భర్తలకు స్త్రీలపై హక్కులున్నట్లే స్త్రీలకు కూడా వారిపై హక్కులున్నాయి – కాని ఉత్తమ రీతిలో! కాకపోతే పురుషులకు స్త్రీలపై ఒకింత ప్రాధాన్యత ఉంది. అల్లాహ్‌ సర్వాధికుడు, వివేచనాపరుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek