×

విడాకులు రెండు సార్లే! ఆ తర్వాత (భార్యను) సహృదయంతో తమ వద్ద ఉండనివ్వాలి, లేదా ఆమెను 2:229 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:229) ayat 229 in Telugu

2:229 Surah Al-Baqarah ayat 229 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 229 - البَقَرَة - Page - Juz 2

﴿ٱلطَّلَٰقُ مَرَّتَانِۖ فَإِمۡسَاكُۢ بِمَعۡرُوفٍ أَوۡ تَسۡرِيحُۢ بِإِحۡسَٰنٖۗ وَلَا يَحِلُّ لَكُمۡ أَن تَأۡخُذُواْ مِمَّآ ءَاتَيۡتُمُوهُنَّ شَيۡـًٔا إِلَّآ أَن يَخَافَآ أَلَّا يُقِيمَا حُدُودَ ٱللَّهِۖ فَإِنۡ خِفۡتُمۡ أَلَّا يُقِيمَا حُدُودَ ٱللَّهِ فَلَا جُنَاحَ عَلَيۡهِمَا فِيمَا ٱفۡتَدَتۡ بِهِۦۗ تِلۡكَ حُدُودُ ٱللَّهِ فَلَا تَعۡتَدُوهَاۚ وَمَن يَتَعَدَّ حُدُودَ ٱللَّهِ فَأُوْلَٰٓئِكَ هُمُ ٱلظَّٰلِمُونَ ﴾
[البَقَرَة: 229]

విడాకులు రెండు సార్లే! ఆ తర్వాత (భార్యను) సహృదయంతో తమ వద్ద ఉండనివ్వాలి, లేదా ఆమెను మంచితనంతో సాగనంపాలి. మరియు సాగనంపేటప్పుడు మీరు వారికిచ్చిన వాటి నుండి ఏమైనా తిరిగి తీసుకోవడం ధర్మసమ్మతం కాదు. అల్లాహ్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేము అనే భయం ఆ ఇద్దరికీ ఉంటే తప్ప! కాని అల్లాహ్ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేమనే భయం ఆ దంపతులకు ఉంటే స్త్రీ పరిహారమిచ్చి (విడాకులు / ఖులా తీసుకంటే) అందులో వారికి ఎలాంటి దోషం లేదు. ఇవి అల్లాహ్ విధించిన హద్దులు, కావున వీటిని అతిక్రమించకండి. మరియు ఎవరైతే అల్లాహ్ విధించిన హద్దులను అతిక్రమిస్తారో, అలాంటి వారే దుర్మార్గులు

❮ Previous Next ❯

ترجمة: الطلاق مرتان فإمساك بمعروف أو تسريح بإحسان ولا يحل لكم أن تأخذوا, باللغة التيلجو

﴿الطلاق مرتان فإمساك بمعروف أو تسريح بإحسان ولا يحل لكم أن تأخذوا﴾ [البَقَرَة: 229]

Abdul Raheem Mohammad Moulana
vidakulu rendu sarle! A tarvata (bharyanu) sahrdayanto tama vadda undanivvali, leda amenu mancitananto saganampali. Mariyu saganampetappudu miru varikiccina vati nundi emaina tirigi tisukovadam dharmasam'matam kadu. Allah vidhincina haddulaku kattubadi undalemu ane bhayam a iddariki unte tappa! Kani allah vidhincina haddulaku kattubadi undalemane bhayam a dampatulaku unte stri pariharamicci (vidakulu/ khula tisukante) andulo variki elanti dosam ledu. Ivi allah vidhincina haddulu, kavuna vitini atikramincakandi. Mariyu evaraite allah vidhincina haddulanu atikramistaro, alanti vare durmargulu
Abdul Raheem Mohammad Moulana
viḍākulu reṇḍu sārlē! Ā tarvāta (bhāryanu) sahr̥dayantō tama vadda uṇḍanivvāli, lēdā āmenu man̄citanantō sāganampāli. Mariyu sāganampēṭappuḍu mīru vārikiccina vāṭi nuṇḍi ēmainā tirigi tīsukōvaḍaṁ dharmasam'mataṁ kādu. Allāh vidhin̄cina haddulaku kaṭṭubaḍi uṇḍalēmu anē bhayaṁ ā iddarikī uṇṭē tappa! Kāni allāh vidhin̄cina haddulaku kaṭṭubaḍi uṇḍalēmanē bhayaṁ ā dampatulaku uṇṭē strī parihāramicci (viḍākulu/ khulā tīsukaṇṭē) andulō vāriki elāṇṭi dōṣaṁ lēdu. Ivi allāh vidhin̄cina haddulu, kāvuna vīṭini atikramin̄cakaṇḍi. Mariyu evaraitē allāh vidhin̄cina haddulanu atikramistārō, alāṇṭi vārē durmārgulu
Muhammad Aziz Ur Rehman
ఈ విడాకులు రెండుసార్లే. ఆ తరువాత సక్రమంగా (ఆమెను) ఆపుకోవాలి. లేదంటే ఉత్తమ రీతిలో వదలి పెట్టాలి. మీరు వారికి ఇంతకు ముందు ఇచ్చి ఉన్న వాటిలో నుంచి దేన్నయినా తిరిగి తీసుకోవటం ధర్మసమ్మతం కాదు. ఆఁ ఒకవేళ అల్లాహ్‌ విధించిన హద్దులకు కట్టుబడి ఉండలేమన్న భయం వారిరువురికీ ఉంటే అది వేరే విషయం. అందువల్ల దంపతులిద్దరూ అల్లాహ్‌ ఏర్పరచిన హద్దులకు కట్టుబడి ఉండలేరన్న భయం మీకు కలిగి, అదే సమయంలో స్త్రీ తన భర్తకు కొంత నష్టపరిహారం ఇచ్చి వేర్పడదలిస్తే – అట్టి పరిస్థితిలో ఇరువురిపై ఎలాంటి దోషంలేదు. ఇవి అల్లాహ్‌ నిర్ధారించిన హద్దులు. (జాగ్రత్త!) వాటిని దాటకూడదు. ఎవరు అల్లాహ్‌ నిర్థారించిన హద్దులను మీరిపోతారో వారే దుర్మార్గులు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek