Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 233 - البَقَرَة - Page - Juz 2
﴿۞ وَٱلۡوَٰلِدَٰتُ يُرۡضِعۡنَ أَوۡلَٰدَهُنَّ حَوۡلَيۡنِ كَامِلَيۡنِۖ لِمَنۡ أَرَادَ أَن يُتِمَّ ٱلرَّضَاعَةَۚ وَعَلَى ٱلۡمَوۡلُودِ لَهُۥ رِزۡقُهُنَّ وَكِسۡوَتُهُنَّ بِٱلۡمَعۡرُوفِۚ لَا تُكَلَّفُ نَفۡسٌ إِلَّا وُسۡعَهَاۚ لَا تُضَآرَّ وَٰلِدَةُۢ بِوَلَدِهَا وَلَا مَوۡلُودٞ لَّهُۥ بِوَلَدِهِۦۚ وَعَلَى ٱلۡوَارِثِ مِثۡلُ ذَٰلِكَۗ فَإِنۡ أَرَادَا فِصَالًا عَن تَرَاضٖ مِّنۡهُمَا وَتَشَاوُرٖ فَلَا جُنَاحَ عَلَيۡهِمَاۗ وَإِنۡ أَرَدتُّمۡ أَن تَسۡتَرۡضِعُوٓاْ أَوۡلَٰدَكُمۡ فَلَا جُنَاحَ عَلَيۡكُمۡ إِذَا سَلَّمۡتُم مَّآ ءَاتَيۡتُم بِٱلۡمَعۡرُوفِۗ وَٱتَّقُواْ ٱللَّهَ وَٱعۡلَمُوٓاْ أَنَّ ٱللَّهَ بِمَا تَعۡمَلُونَ بَصِيرٞ ﴾
[البَقَرَة: 233]
﴿والوالدات يرضعن أولادهن حولين كاملين لمن أراد أن يتم الرضاعة وعلى المولود﴾ [البَقَرَة: 233]
| Abdul Raheem Mohammad Moulana (Viḍākula taruvāta) pūrti reṇḍu sanvatsarāla pāla gaḍuvu pūrti cēyavalenani (tallidaṇḍrulu) kōrinaṭlayitē, tallulu tama pillalaku pālivvāli. Biḍḍa taṇḍripai, vāriki tagu rītigā bhōjanaṁ mariyu vastrālicci pōṣin̄cavalasina bādhyata uṇṭundi. Śaktiki min̄cina bhāraṁ ē vyaktipai kūḍā mōpabaḍadu. Talli tana biḍḍa valana kaṣṭālaku guri kākūḍadu. Mariyu taṇḍri kūḍā tana biḍḍa valana (kaṣṭālaku guri kākūḍadu). Mariyu (pāliccē tallini pōṣin̄cē bādhyata taṇḍripai unnaṭlu taṇḍri canipōtē) atani vārasulapai kūḍā uṇṭundi. Mariyu (tallidaṇḍrulu) iruvuru sampradin̄cukoni paraspara aṅgīkārantō (reṇḍu sanvatsarālu pūrtikāka mundē) biḍḍa cēta pālu viḍipistē, vāriruvuriki elāṇṭi dōṣaṁ lēdu. Mariyu mīru mī biḍḍalaku vērē strī dvārā pālu ippin̄cē ērpāṭu cēyadalistē, mīpai elāṇṭi dōṣaṁ lēdu. Kāni mīru āmeku (talliki) ivva valasindi dharmasam'mataṅgā cellin̄cāli. Allāh yandu bhayabhaktulu kaligi uṇḍaṇḍi. Mariyu mīru cēsēdantā niścayaṅgā, allāh cūstunnāḍani telusukōṇḍi |
| Muhammad Aziz Ur Rehman పాల గడువును పూర్తి చేయాలని (తండ్రులు) కోరినపక్షంలో తల్లులు తమ పిల్లలకు పూర్తిగా రెండు సంవత్సరాలపాటు పాలు పట్టాలి. బిడ్డల తండ్రులపై పోషణాభారం ఉంటుంది. కనుక వారు వారికి ఉత్తమ రీతిలో అన్నవస్త్రాలను సమకూర్చాలి. ఎవరిపైనా శక్తికి మించిన భారం వేయబడదు. బిడ్డ మూలంగా తల్లిని వేధించటంగానీ, సంతానం కారణంగా తండ్రిని ముప్పు తిప్పలు పెట్టడంగానీ చేయరాదు. వారసులపై కూడా ఇటువంటి బాధ్యతే ఉంటుంది. ఒకవేళ ఉభయులూ (తల్లిదండ్రులు) తమ ఇష్టపూర్వకంగా, పరస్పర సంప్రతింపులతో పాలు విడిపించదలిస్తే వారు నిందార్హులు కారు. ఒకవేళ మీ సంతానానికి పాలు పట్టాలన్నదే మీ అభిలాష అయితే అందులోనూ దోషంలేదు. అయితే మీరు ఆమెకు సముచితమైన రీతిలో ఇవ్వవలసిన దాన్ని ఇవ్వండి. అల్లాహ్‌కు భయపడుతూ మసలుకోండి. అల్లాహ్ మీ కార్యకలాపాలన్నింటినీ గమనిస్తున్నాడన్న విషయాన్ని తెలుసుకోండి |