×

మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్: "ఓ నా ప్రభూ! నీవు మృతులను ఎలా సజీవులుగా చేస్తావో 2:260 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:260) ayat 260 in Telugu

2:260 Surah Al-Baqarah ayat 260 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 260 - البَقَرَة - Page - Juz 3

﴿وَإِذۡ قَالَ إِبۡرَٰهِـۧمُ رَبِّ أَرِنِي كَيۡفَ تُحۡيِ ٱلۡمَوۡتَىٰۖ قَالَ أَوَلَمۡ تُؤۡمِنۖ قَالَ بَلَىٰ وَلَٰكِن لِّيَطۡمَئِنَّ قَلۡبِيۖ قَالَ فَخُذۡ أَرۡبَعَةٗ مِّنَ ٱلطَّيۡرِ فَصُرۡهُنَّ إِلَيۡكَ ثُمَّ ٱجۡعَلۡ عَلَىٰ كُلِّ جَبَلٖ مِّنۡهُنَّ جُزۡءٗا ثُمَّ ٱدۡعُهُنَّ يَأۡتِينَكَ سَعۡيٗاۚ وَٱعۡلَمۡ أَنَّ ٱللَّهَ عَزِيزٌ حَكِيمٞ ﴾
[البَقَرَة: 260]

మరియు (జ్ఞాపకం చేసుకోండి) ఇబ్రాహీమ్: "ఓ నా ప్రభూ! నీవు మృతులను ఎలా సజీవులుగా చేస్తావో నాకు చూపు!" అని అన్నప్పుడు, (అల్లాహ్) అన్నాడు: "ఏమీ? నీకు విశ్వాసం లేదా?" దానికి (ఇబ్రాహీమ్): "ఉంది, కానీ నా మనస్సు తృప్తి కొరకు అడుగు తున్నాను!" అని అన్నాడు. అపుడు (అల్లాహ్): "నాలుగు పక్షులను తీసుకో, వాటిని బాగా మచ్చిక చేసుకో! తరువాత (వాటిని కోసి) ఒక్కొక్కదాని ఒక్కొక్క భాగాన్ని, ఒక్కొక్క కొండపై పెట్టి రా, మళ్ళీ వాటిని రమ్మని పిలువు, అవి నీ వద్దకు ఎగురుకుంటూ వస్తాయి. కాబట్టి నిశ్చయంగా, అల్లాహ్ సర్వశక్తిమంతుడు, మహా వివేకవంతుడు అని తెలుసుకో!"అని అన్నాడు

❮ Previous Next ❯

ترجمة: وإذ قال إبراهيم رب أرني كيف تحي الموتى قال أو لم تؤمن, باللغة التيلجو

﴿وإذ قال إبراهيم رب أرني كيف تحي الموتى قال أو لم تؤمن﴾ [البَقَرَة: 260]

Abdul Raheem Mohammad Moulana
mariyu (jnapakam cesukondi) ibrahim: "O na prabhu! Nivu mrtulanu ela sajivuluga cestavo naku cupu!" Ani annappudu, (allah) annadu: "Emi? Niku visvasam leda?" Daniki (ibrahim): "Undi, kani na manas'su trpti koraku adugu tunnanu!" Ani annadu. Apudu (allah): "Nalugu paksulanu tisuko, vatini baga maccika cesuko! Taruvata (vatini kosi) okkokkadani okkokka bhaganni, okkokka kondapai petti ra, malli vatini ram'mani piluvu, avi ni vaddaku egurukuntu vastayi. Kabatti niscayanga, allah sarvasaktimantudu, maha vivekavantudu ani telusuko!"Ani annadu
Abdul Raheem Mohammad Moulana
mariyu (jñāpakaṁ cēsukōṇḍi) ibrāhīm: "Ō nā prabhū! Nīvu mr̥tulanu elā sajīvulugā cēstāvō nāku cūpu!" Ani annappuḍu, (allāh) annāḍu: "Ēmī? Nīku viśvāsaṁ lēdā?" Dāniki (ibrāhīm): "Undi, kānī nā manas'su tr̥pti koraku aḍugu tunnānu!" Ani annāḍu. Apuḍu (allāh): "Nālugu pakṣulanu tīsukō, vāṭini bāgā maccika cēsukō! Taruvāta (vāṭini kōsi) okkokkadāni okkokka bhāgānni, okkokka koṇḍapai peṭṭi rā, maḷḷī vāṭini ram'mani piluvu, avi nī vaddaku egurukuṇṭū vastāyi. Kābaṭṭi niścayaṅgā, allāh sarvaśaktimantuḍu, mahā vivēkavantuḍu ani telusukō!"Ani annāḍu
Muhammad Aziz Ur Rehman
(మరొక సంఘటన.) “ఓ ప్రభూ! నీవు మృతులను ఎలా బ్రతికిస్తావో కాస్త నాకు చూపవా?” అని ఇబ్రాహీం విన్నవించుకున్నప్పుడు, “నీకు నమ్మకం లేదా?” అని దేవుని తరఫున సెలవీయబడింది. “ఎందుకు లేదు?! (నాకు పూర్తి నమ్మకం ఉంది. కాకపోతే) ఆత్మ తృప్తికై ఇలా అడిగాను” అని అతనన్నాడు. అప్పుడు అల్లాహ్‌, “నాలుగు పక్షులను తీసుకో. వాటిని మచ్చిక చేసుకో. (వాటిని కోసి ముక్కలు ముక్కలుగా చెయ్యి). తరువాత ఒక్కో పర్వతంపై దాని ఒక్కో (మాంసపు) ముక్కను ఉంచు. ఆపైన వాటిని పిలువు. అవి నీ వద్దకు పరుగెత్తుకుంటూ వస్తాయి. అల్లాహ్‌ సర్వశక్తిమంతుడు, వివేకవంతుడన్న సంగతిని బాగా తెలుసుకో” అని అన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek