×

లేక! ఒక వ్యక్తి ఇండ్ల కప్పులన్నీ కూలిపోయి, పాడుపడిన (తలక్రిందులై బోర్లా పడిన) నగరం మీదుగా 2:259 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:259) ayat 259 in Telugu

2:259 Surah Al-Baqarah ayat 259 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 259 - البَقَرَة - Page - Juz 3

﴿أَوۡ كَٱلَّذِي مَرَّ عَلَىٰ قَرۡيَةٖ وَهِيَ خَاوِيَةٌ عَلَىٰ عُرُوشِهَا قَالَ أَنَّىٰ يُحۡيِۦ هَٰذِهِ ٱللَّهُ بَعۡدَ مَوۡتِهَاۖ فَأَمَاتَهُ ٱللَّهُ مِاْئَةَ عَامٖ ثُمَّ بَعَثَهُۥۖ قَالَ كَمۡ لَبِثۡتَۖ قَالَ لَبِثۡتُ يَوۡمًا أَوۡ بَعۡضَ يَوۡمٖۖ قَالَ بَل لَّبِثۡتَ مِاْئَةَ عَامٖ فَٱنظُرۡ إِلَىٰ طَعَامِكَ وَشَرَابِكَ لَمۡ يَتَسَنَّهۡۖ وَٱنظُرۡ إِلَىٰ حِمَارِكَ وَلِنَجۡعَلَكَ ءَايَةٗ لِّلنَّاسِۖ وَٱنظُرۡ إِلَى ٱلۡعِظَامِ كَيۡفَ نُنشِزُهَا ثُمَّ نَكۡسُوهَا لَحۡمٗاۚ فَلَمَّا تَبَيَّنَ لَهُۥ قَالَ أَعۡلَمُ أَنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ ﴾
[البَقَرَة: 259]

లేక! ఒక వ్యక్తి ఇండ్ల కప్పులన్నీ కూలిపోయి, పాడుపడిన (తలక్రిందులై బోర్లా పడిన) నగరం మీదుగా పోతూ: "వాస్తవానికి! నశించిపోయిన ఈ నగరానికి అల్లాహ్ తిరిగి ఏ విధంగా జీవం పోయగలడు?" అని అన్నాడు. అప్పుడు అల్లాహ్ అతనిని మరణింపజేసి నూరు సంవత్సరాల తరువాత తిరిగి బ్రతికింపజేసి: "ఈ స్థితిలో నీవు ఎంతకాలముంటివి?" అని అడిగాడు. అతడు: "ఒక దినమో, లేక ఒక దినములో కొంత భాగమో!" అని అన్నాడు. దానికి ఆయన: "కాదు, నీవు ఇక్కడ ఈ (మరణించిన) స్థితిలో, నూరు సంవత్సరాలు ఉంటివి. ఇక నీ అన్నపానీయాల వైపు చూడు, వాటిలో ఏ మార్పూ లేదు. ఇంకా నీవు నా గాడిదను కూడా చూడు! మేము ప్రజల కొరకు నిన్ను దృష్టాంతంగా చేయదలిచాము. ఇక ఆ (గాడిద) ఎముకలను చూడు, ఏ విధంగా వాటిని ఉద్ధరించి తిరిగి వాటిపై మాంసం కప్పుతామో!" అని అన్నాడు. ఇవి అతనికి స్పష్టంగా తెలిసిన తరువాత అతడు: "నిశ్చయంగా, అల్లాహ్ ప్రతిదీ చేయగల సమర్ధుడని నాకు (ఇప్పుడు) తెలిసింది!" అని అన్నాడు

❮ Previous Next ❯

ترجمة: أو كالذي مر على قرية وهي خاوية على عروشها قال أنى يحيي, باللغة التيلجو

﴿أو كالذي مر على قرية وهي خاوية على عروشها قال أنى يحيي﴾ [البَقَرَة: 259]

Abdul Raheem Mohammad Moulana
Leka! Oka vyakti indla kappulanni kulipoyi, padupadina (talakrindulai borla padina) nagaram miduga potu: "Vastavaniki! Nasincipoyina i nagaraniki allah tirigi e vidhanga jivam poyagaladu?" Ani annadu. Appudu allah atanini maranimpajesi nuru sanvatsarala taruvata tirigi bratikimpajesi: "I sthitilo nivu entakalamuntivi?" Ani adigadu. Atadu: "Oka dinamo, leka oka dinamulo konta bhagamo!" Ani annadu. Daniki ayana: "Kadu, nivu ikkada i (maranincina) sthitilo, nuru sanvatsaralu untivi. Ika ni annapaniyala vaipu cudu, vatilo e marpu ledu. Inka nivu na gadidanu kuda cudu! Memu prajala koraku ninnu drstantanga ceyadalicamu. Ika a (gadida) emukalanu cudu, e vidhanga vatini ud'dharinci tirigi vatipai mansam kapputamo!" Ani annadu. Ivi ataniki spastanga telisina taruvata atadu: "Niscayanga, allah pratidi ceyagala samardhudani naku (ippudu) telisindi!" Ani annadu
Abdul Raheem Mohammad Moulana
Lēka! Oka vyakti iṇḍla kappulannī kūlipōyi, pāḍupaḍina (talakrindulai bōrlā paḍina) nagaraṁ mīdugā pōtū: "Vāstavāniki! Naśin̄cipōyina ī nagarāniki allāh tirigi ē vidhaṅgā jīvaṁ pōyagalaḍu?" Ani annāḍu. Appuḍu allāh atanini maraṇimpajēsi nūru sanvatsarāla taruvāta tirigi bratikimpajēsi: "Ī sthitilō nīvu entakālamuṇṭivi?" Ani aḍigāḍu. Ataḍu: "Oka dinamō, lēka oka dinamulō konta bhāgamō!" Ani annāḍu. Dāniki āyana: "Kādu, nīvu ikkaḍa ī (maraṇin̄cina) sthitilō, nūru sanvatsarālu uṇṭivi. Ika nī annapānīyāla vaipu cūḍu, vāṭilō ē mārpū lēdu. Iṅkā nīvu nā gāḍidanu kūḍā cūḍu! Mēmu prajala koraku ninnu dr̥ṣṭāntaṅgā cēyadalicāmu. Ika ā (gāḍida) emukalanu cūḍu, ē vidhaṅgā vāṭini ud'dharin̄ci tirigi vāṭipai mānsaṁ kapputāmō!" Ani annāḍu. Ivi ataniki spaṣṭaṅgā telisina taruvāta ataḍu: "Niścayaṅgā, allāh pratidī cēyagala samardhuḍani nāku (ippuḍu) telisindi!" Ani annāḍu
Muhammad Aziz Ur Rehman
లేదా ఇండ్ల కప్పులు కూలి తలక్రిందులుగా పడివున్న పట్టణం మీదుగా పోయినవాడు; (అతనిని నీవు చూడలేదా?) “దీని చావు తరువాత అల్లాహ్‌ తిరిగి దీనికి ఎలా ప్రాణం పోస్తాడు?” అని ఆ వ్యక్తి ఆశ్చర్యపోయినప్పుడు అల్లాహ్‌ అతన్ని చంపి నూరేళ్ళవరకు మరణస్థితిలో ఉంచాడు. తరువాత అతన్ని లేపి, “ఈ స్థితిలో నువ్వు ఎంతకాలం ఉన్నావు?” అని అడిగాడు. “మహా అయితే ఒక రోజు లేక ఒక రోజులో కొంత భాగం” అని అతను బదులిచ్చాడు. “లేదు. నువ్వు నూరేళ్ళు ఈ స్థితిలో పడిఉన్నావు. కాస్త నీ అన్నపానీయాల వైపు చూడు. అవి ఏ మాత్రం చెడిపోలేదు. మరి నీ గాడిదను కూడా చూసుకో. మేము నిన్ను ప్రజల కోసం ఒక నిదర్శనంగా చేయదలిచాము. మేము (గాడిద) ఎముకలను ఏ విధంగా లేపి, వాటిపై మాంసం నింపుతామో చూడు! ఇదంతా ప్రస్ఫుటమయి పోయాక, “అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడని నాకు తెలుసు” అని అన్నాడతను
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek