Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 282 - البَقَرَة - Page - Juz 3
﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِذَا تَدَايَنتُم بِدَيۡنٍ إِلَىٰٓ أَجَلٖ مُّسَمّٗى فَٱكۡتُبُوهُۚ وَلۡيَكۡتُب بَّيۡنَكُمۡ كَاتِبُۢ بِٱلۡعَدۡلِۚ وَلَا يَأۡبَ كَاتِبٌ أَن يَكۡتُبَ كَمَا عَلَّمَهُ ٱللَّهُۚ فَلۡيَكۡتُبۡ وَلۡيُمۡلِلِ ٱلَّذِي عَلَيۡهِ ٱلۡحَقُّ وَلۡيَتَّقِ ٱللَّهَ رَبَّهُۥ وَلَا يَبۡخَسۡ مِنۡهُ شَيۡـٔٗاۚ فَإِن كَانَ ٱلَّذِي عَلَيۡهِ ٱلۡحَقُّ سَفِيهًا أَوۡ ضَعِيفًا أَوۡ لَا يَسۡتَطِيعُ أَن يُمِلَّ هُوَ فَلۡيُمۡلِلۡ وَلِيُّهُۥ بِٱلۡعَدۡلِۚ وَٱسۡتَشۡهِدُواْ شَهِيدَيۡنِ مِن رِّجَالِكُمۡۖ فَإِن لَّمۡ يَكُونَا رَجُلَيۡنِ فَرَجُلٞ وَٱمۡرَأَتَانِ مِمَّن تَرۡضَوۡنَ مِنَ ٱلشُّهَدَآءِ أَن تَضِلَّ إِحۡدَىٰهُمَا فَتُذَكِّرَ إِحۡدَىٰهُمَا ٱلۡأُخۡرَىٰۚ وَلَا يَأۡبَ ٱلشُّهَدَآءُ إِذَا مَا دُعُواْۚ وَلَا تَسۡـَٔمُوٓاْ أَن تَكۡتُبُوهُ صَغِيرًا أَوۡ كَبِيرًا إِلَىٰٓ أَجَلِهِۦۚ ذَٰلِكُمۡ أَقۡسَطُ عِندَ ٱللَّهِ وَأَقۡوَمُ لِلشَّهَٰدَةِ وَأَدۡنَىٰٓ أَلَّا تَرۡتَابُوٓاْ إِلَّآ أَن تَكُونَ تِجَٰرَةً حَاضِرَةٗ تُدِيرُونَهَا بَيۡنَكُمۡ فَلَيۡسَ عَلَيۡكُمۡ جُنَاحٌ أَلَّا تَكۡتُبُوهَاۗ وَأَشۡهِدُوٓاْ إِذَا تَبَايَعۡتُمۡۚ وَلَا يُضَآرَّ كَاتِبٞ وَلَا شَهِيدٞۚ وَإِن تَفۡعَلُواْ فَإِنَّهُۥ فُسُوقُۢ بِكُمۡۗ وَٱتَّقُواْ ٱللَّهَۖ وَيُعَلِّمُكُمُ ٱللَّهُۗ وَٱللَّهُ بِكُلِّ شَيۡءٍ عَلِيمٞ ﴾
[البَقَرَة: 282]
﴿ياأيها الذين آمنوا إذا تداينتم بدين إلى أجل مسمى فاكتبوه وليكتب بينكم﴾ [البَقَرَة: 282]
Abdul Raheem Mohammad Moulana O visvasulara! Miru parasparam oka nirnitakalam koraku appu tisukunnappudu, danini vrasipettukondi. Mariyu milo patram vrasevadu, n'yayanga vrayali. Mariyu vrasevadu nirakarincakunda, allah nerpinatlu vrayali. Rnagrahita allah ku bhayapadi, nirnita saratulanu taggincakunda, ceppi vrayincali. Rnagrahita alpajnani leka samarthyam lenivadu leka balahinudu mariyu tanu ceppi vrayincaleni vadaite, atani sanraksakudu n'yayanga vrayincali. Mariyu milo iddaru magavarini saksyamivvataniki saksuluga uncukondi. Iddaru purusulu dorakani paksamuna oka purusudu mariyu miku sam'matamaina iddaru strilanu saksuluga tisukondi. (Endukante) varilo okame maracipote, rendava stri ameku jnapakam ceyincavaccu. Mariyu piluvabadinappudu saksulu, saksyamivvataniki nirakarincakudadu. Mariyu vyavaharam cinnadaina peddadaina danini gaduvu nirnayanto patu vrasipettataniki asrad'dha cupakudadu. Allah drstilo idi n'yayasam'matamainadi mariyu sthiramaina saksyanga todpadutundi mariyu e vidhamaina sandehalaku avakasam lekunda cestundi. Kani, miru appatikappudu icci puccukune (sadharana) lavadevilu cestunnapudu vrayakunna dosam ledu. Kani, vyapara vyavaharalu nirnayincetappudu saksulanu pettukondi. Kani vrasevaniki gani, saksulaku gani e vidhamaina hani jarugakudadu. Okavela ala jarigite! Niscayanga, adi miku papam. Mariyu allah yandu bhayabhaktulu kaligi undandi. Mariyu idi allah miku nerputunnadu. Mariyu allah ku pratidani jnanam undi |
Abdul Raheem Mohammad Moulana Ō viśvāsulārā! Mīru parasparaṁ oka nirṇītakālaṁ koraku appu tīsukunnappuḍu, dānini vrāsipeṭṭukōṇḍi. Mariyu mīlō patraṁ vrāsēvāḍu, n'yāyaṅgā vrāyāli. Mariyu vrāsēvāḍu nirākarin̄cakuṇḍā, allāh nērpinaṭlu vrāyāli. R̥ṇagrahīta allāh ku bhayapaḍi, nirṇīta ṣaratulanu taggin̄cakuṇḍā, ceppi vrāyin̄cāli. R̥ṇagrahīta alpajñāni lēka sāmarthyaṁ lēnivāḍu lēka balahīnuḍu mariyu tānu ceppi vrāyin̄calēni vāḍaitē, atani sanrakṣakuḍu n'yāyaṅgā vrāyin̄cāli. Mariyu mīlō iddaru magavārini sākṣyamivvaṭāniki sākṣulugā un̄cukōṇḍi. Iddaru puruṣulu dorakani pakṣamuna oka puruṣuḍu mariyu mīku sam'matamaina iddaru strīlanu sākṣulugā tīsukōṇḍi. (Endukaṇṭē) vārilō okāme maracipōtē, reṇḍava strī āmeku jñāpakaṁ cēyin̄cavaccu. Mariyu piluvabaḍinappuḍu sākṣulu, sākṣyamivvaṭāniki nirākarin̄cakūḍadu. Mariyu vyavahāraṁ cinnadainā peddadainā dānini gaḍuvu nirṇayantō pāṭu vrāsipeṭṭaṭāniki aśrad'dha cūpakūḍadu. Allāh dr̥ṣṭilō idi n'yāyasam'matamainadi mariyu sthiramaina sākṣyaṅgā tōḍpaḍutundi mariyu ē vidhamaina sandēhālaku avakāśaṁ lēkuṇḍā cēstundi. Kāni, mīru appaṭikappuḍu icci puccukunē (sādhāraṇa) lāvādēvīlu cēstunnapuḍu vrāyakunnā dōṣaṁ lēdu. Kāni, vyāpāra vyavahārālu nirṇayin̄cēṭappuḍu sākṣulanu peṭṭukōṇḍi. Kāni vrāsēvāniki gānī, sākṣulaku gānī ē vidhamaina hāni jarugakūḍadu. Okavēḷa alā jarigitē! Niścayaṅgā, adi mīku pāpaṁ. Mariyu allāh yandu bhayabhaktulu kaligi uṇḍaṇḍi. Mariyu idi allāh mīku nērputunnāḍu. Mariyu allāh ku pratidāni jñānaṁ undi |
Muhammad Aziz Ur Rehman ఓ విశ్వాసులారా! మీరు పరస్పరం ఒక నిర్ణీత గడువు కొరకు అప్పు వ్యవహారం చేసుకుంటున్నప్పుడు దాన్ని (స్పష్టంగా) వ్రాసుకోండి. వ్రాసేవాడు ఈ వ్యవహారాన్ని మీ మధ్య న్యాయబద్ధంగా వ్రాయాలి. అల్లాహ్ ఎవడికైతే వ్రాయటం నేర్పాడో, అతను వ్రాయటానికి నిరాకరించకూడదు. అతడు వ్రాయాలి. రుణం పుచ్చుకున్న వ్యక్తి విషయాన్ని విడమరచి వ్రాయించాలి. ఈ విషయంలో అతను తన ప్రభువైన అల్లాహ్‌కు భయపడాలి. పుచ్చుకున్న దాన్ని తగ్గించి వ్రాయించకూడదు. ఒకవేళ రుణ గ్రహీత అమాయకుడో, బలహీనుడో, లేక చెప్పి వ్రాయించ లేనివాడో అయి ఉంటే అతని సంరక్షకుడు న్యాయంగా వ్రాయించాలి. మీలో ఇద్దరు పురుషులను ఈ వ్యవహారానికి సాక్షులుగా పెట్టుకోండి. ఇద్దరు పురుషులు లభ్యం కానిపక్షంలో మీరిష్టపడే సాక్షులలో ఒక పురుషుణ్ణి, ఇద్దరు స్త్రీలను సాక్షులుగా పెట్టుకోండి. ఎందుకంటే వారిలో ఒకామె మరచిపోతే, రెండవ స్త్రీ మరచిపోయిన ఆమెకు జ్ఞాపకం చేయవచ్చు. సాక్ష్యం కోసం పిలువబడినప్పుడు సాక్షులు రావటానికి నిరాకరించకూడదు. నిర్ణీతకాలం కొరకు తీసుకునే అప్పు, చిన్నదైనా పెద్దదైనా దాన్ని వ్రాసుకోవటంలో మాత్రం అశ్రద్ధ చేయరాదు. అల్లాహ్ దృష్టిలో ఈ పద్ధతి ఎంతో న్యాయవంతమైనది. ఇది సాక్ష్యాన్ని స్థిరంగా ఉంచుతుంది. సందేహాలకు, (అపార్థాలకు) లోనుకాకుండా ఉండేందుకు కూడా ఇది బాగా దోహదపడుతుంది. ఒకవేళ మీ మధ్య జరిగే వ్యవహారం అప్పటికప్పుడు తేలిపోయే వ్యాపార లావాదేవీలదైతే అట్టి పరిస్థితిలో దాన్ని వ్రాసుకోకపోయినా ఫరవాలేదు. కాని క్రయ విక్రయాల సందర్భంగా కూడా సాక్షులను ఉంచుకోండి. దస్తావేజు వ్రాసేవారిని గానీ, సాక్షులను గానీ ఇరకాటంలో పెట్టరాదు (అని తెలుసుకోండి). ఒకవేళ మీరు గనక అలాచేస్తే అది నియమోల్లంఘన క్రిందికి వస్తుంది. అల్లాహ్‌కు భయపడండి. అల్లాహ్ మీకు (పద్ధతిని) నేర్పుతున్నాడు. అల్లాహ్ అన్నీ తెలిసినవాడు |