×

మరియు (జ్ఞాపకం చేసుకోండి)! మూసా తన జాతివారితో ఇలా అన్న విషయాన్ని: "ఓ నా జాతి 2:54 Telugu translation

Quran infoTeluguSurah Al-Baqarah ⮕ (2:54) ayat 54 in Telugu

2:54 Surah Al-Baqarah ayat 54 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Baqarah ayat 54 - البَقَرَة - Page - Juz 1

﴿وَإِذۡ قَالَ مُوسَىٰ لِقَوۡمِهِۦ يَٰقَوۡمِ إِنَّكُمۡ ظَلَمۡتُمۡ أَنفُسَكُم بِٱتِّخَاذِكُمُ ٱلۡعِجۡلَ فَتُوبُوٓاْ إِلَىٰ بَارِئِكُمۡ فَٱقۡتُلُوٓاْ أَنفُسَكُمۡ ذَٰلِكُمۡ خَيۡرٞ لَّكُمۡ عِندَ بَارِئِكُمۡ فَتَابَ عَلَيۡكُمۡۚ إِنَّهُۥ هُوَ ٱلتَّوَّابُ ٱلرَّحِيمُ ﴾
[البَقَرَة: 54]

మరియు (జ్ఞాపకం చేసుకోండి)! మూసా తన జాతివారితో ఇలా అన్న విషయాన్ని: "ఓ నా జాతి ప్రజలారా! నిశ్చయంగా, ఆవుదూడను (ఆరాధ్యదైవంగా) చేసుకొని మీకు మీరే అన్యాయం చేసుకున్నారు. కనుక పశ్చాత్తాపంతో క్షమాభిక్ష కొరకు మీ నిర్మాతను (సృష్టికర్తను) వేడుకోండి. మీలోని వారిని (ఘోరపాతకులను) సంహరించండి. ఇదే మీ కొరకు - మీ సృష్టికర్త దృష్టిలో - శ్రేష్ఠమైనది." ఆ తరువాత ఆయన (అల్లాహ్) మీ పశ్చాత్తాపాన్ని అంగీకరించాడు. నిశ్చయంగా ఆయనే పశ్చాత్తాపాన్ని అంగీకరించేవాడు. అపార కరుణాప్రదాత

❮ Previous Next ❯

ترجمة: وإذ قال موسى لقومه ياقوم إنكم ظلمتم أنفسكم باتخاذكم العجل فتوبوا إلى, باللغة التيلجو

﴿وإذ قال موسى لقومه ياقوم إنكم ظلمتم أنفسكم باتخاذكم العجل فتوبوا إلى﴾ [البَقَرَة: 54]

Abdul Raheem Mohammad Moulana
mariyu (jnapakam cesukondi)! Musa tana jativarito ila anna visayanni: "O na jati prajalara! Niscayanga, avududanu (aradhyadaivanga) cesukoni miku mire an'yayam cesukunnaru. Kanuka pascattapanto ksamabhiksa koraku mi nirmatanu (srstikartanu) vedukondi. Miloni varini (ghorapatakulanu) sanharincandi. Ide mi koraku - mi srstikarta drstilo - sresthamainadi." A taruvata ayana (allah) mi pascattapanni angikarincadu. Niscayanga ayane pascattapanni angikarincevadu. Apara karunapradata
Abdul Raheem Mohammad Moulana
mariyu (jñāpakaṁ cēsukōṇḍi)! Mūsā tana jātivāritō ilā anna viṣayānni: "Ō nā jāti prajalārā! Niścayaṅgā, āvudūḍanu (ārādhyadaivaṅgā) cēsukoni mīku mīrē an'yāyaṁ cēsukunnāru. Kanuka paścāttāpantō kṣamābhikṣa koraku mī nirmātanu (sr̥ṣṭikartanu) vēḍukōṇḍi. Mīlōni vārini (ghōrapātakulanu) sanharin̄caṇḍi. Idē mī koraku - mī sr̥ṣṭikarta dr̥ṣṭilō - śrēṣṭhamainadi." Ā taruvāta āyana (allāh) mī paścāttāpānni aṅgīkarin̄cāḍu. Niścayaṅgā āyanē paścāttāpānni aṅgīkarin̄cēvāḍu. Apāra karuṇāpradāta
Muhammad Aziz Ur Rehman
(గుర్తు చేయి) మూసా తన జాతి ప్రజలతో ఇలా అన్నాడు: “ఓ నా జాతివారలారా! ఆవుదూడను ఆరాధ్య దైవంగా చేసుకుని మీరు మీ స్వయానికి అన్యాయం చేసుకున్నారు. కనుక ఇప్పుడు మీరు పశ్చాత్తాప భావంతో మీ సృష్టికర్త వైపుకు మరలండి. (ఈ ఘోర కృత్యానికి పాల్పడిన) మీలోని వారిని చంపండి. మీ సృష్టికర్త వద్ద ఇదే మీ కొరకు మేలైనది.” మరి ఆయన మీ పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు. నిస్సందేహంగా ఆయన పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కనికరించేవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek