×

మరియు ప్రజలలో కొందరు అంచున నిలచి (సందేహంతో) అల్లాహ్ ను ఆరాధించే వారున్నారు. (అలాంటివాడు) తనకు 22:11 Telugu translation

Quran infoTeluguSurah Al-hajj ⮕ (22:11) ayat 11 in Telugu

22:11 Surah Al-hajj ayat 11 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hajj ayat 11 - الحج - Page - Juz 17

﴿وَمِنَ ٱلنَّاسِ مَن يَعۡبُدُ ٱللَّهَ عَلَىٰ حَرۡفٖۖ فَإِنۡ أَصَابَهُۥ خَيۡرٌ ٱطۡمَأَنَّ بِهِۦۖ وَإِنۡ أَصَابَتۡهُ فِتۡنَةٌ ٱنقَلَبَ عَلَىٰ وَجۡهِهِۦ خَسِرَ ٱلدُّنۡيَا وَٱلۡأٓخِرَةَۚ ذَٰلِكَ هُوَ ٱلۡخُسۡرَانُ ٱلۡمُبِينُ ﴾
[الحج: 11]

మరియు ప్రజలలో కొందరు అంచున నిలచి (సందేహంతో) అల్లాహ్ ను ఆరాధించే వారున్నారు. (అలాంటివాడు) తనకు లాభం కలిగితే, ఎంతో తృప్తి పొందుతాడు. కాని ఆపదకు గురి అయితే ముఖం త్రిప్పుకొని, ఇహమును మరియు పరమును కూడా కోల్పోతాడు. స్పష్టమైన నష్టమంటే ఇదే

❮ Previous Next ❯

ترجمة: ومن الناس من يعبد الله على حرف فإن أصابه خير اطمأن به, باللغة التيلجو

﴿ومن الناس من يعبد الله على حرف فإن أصابه خير اطمأن به﴾ [الحج: 11]

Abdul Raheem Mohammad Moulana
mariyu prajalalo kondaru ancuna nilaci (sandehanto) allah nu aradhince varunnaru. (Alantivadu) tanaku labham kaligite, ento trpti pondutadu. Kani apadaku guri ayite mukham trippukoni, ihamunu mariyu paramunu kuda kolpotadu. Spastamaina nastamante ide
Abdul Raheem Mohammad Moulana
mariyu prajalalō kondaru an̄cuna nilaci (sandēhantō) allāh nu ārādhin̄cē vārunnāru. (Alāṇṭivāḍu) tanaku lābhaṁ kaligitē, entō tr̥pti pondutāḍu. Kāni āpadaku guri ayitē mukhaṁ trippukoni, ihamunu mariyu paramunu kūḍā kōlpōtāḍu. Spaṣṭamaina naṣṭamaṇṭē idē
Muhammad Aziz Ur Rehman
ప్రజలలో మరికొంతమంది (కూడా ఉన్నారు. వారు) ఎలాంటి వారంటే, వారు ఒక అంచున (నిలబడి) అల్లాహ్‌ను ఆరాధిస్తుంటారు. తమకేదన్నా లాభం కలిగితే ఆరాధన పట్ల సంతృప్తి చెందుతారు. ఏదన్నా ఆపద వచ్చిపడితే మాత్రం అప్పటికప్పుడే ముఖం తిప్పుకునిపోతారు. అలాంటి వారు ప్రాపంచికంగానూ, పారలౌకికంగానూ నష్టపోయారు. స్పష్టంగా నష్టపోవటం అంటే ఇదే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek