×

మరియు విశ్వసించిన స్త్రీలతో కూడా వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడుకోమని 24:31 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:31) ayat 31 in Telugu

24:31 Surah An-Nur ayat 31 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 31 - النور - Page - Juz 18

﴿وَقُل لِّلۡمُؤۡمِنَٰتِ يَغۡضُضۡنَ مِنۡ أَبۡصَٰرِهِنَّ وَيَحۡفَظۡنَ فُرُوجَهُنَّ وَلَا يُبۡدِينَ زِينَتَهُنَّ إِلَّا مَا ظَهَرَ مِنۡهَاۖ وَلۡيَضۡرِبۡنَ بِخُمُرِهِنَّ عَلَىٰ جُيُوبِهِنَّۖ وَلَا يُبۡدِينَ زِينَتَهُنَّ إِلَّا لِبُعُولَتِهِنَّ أَوۡ ءَابَآئِهِنَّ أَوۡ ءَابَآءِ بُعُولَتِهِنَّ أَوۡ أَبۡنَآئِهِنَّ أَوۡ أَبۡنَآءِ بُعُولَتِهِنَّ أَوۡ إِخۡوَٰنِهِنَّ أَوۡ بَنِيٓ إِخۡوَٰنِهِنَّ أَوۡ بَنِيٓ أَخَوَٰتِهِنَّ أَوۡ نِسَآئِهِنَّ أَوۡ مَا مَلَكَتۡ أَيۡمَٰنُهُنَّ أَوِ ٱلتَّٰبِعِينَ غَيۡرِ أُوْلِي ٱلۡإِرۡبَةِ مِنَ ٱلرِّجَالِ أَوِ ٱلطِّفۡلِ ٱلَّذِينَ لَمۡ يَظۡهَرُواْ عَلَىٰ عَوۡرَٰتِ ٱلنِّسَآءِۖ وَلَا يَضۡرِبۡنَ بِأَرۡجُلِهِنَّ لِيُعۡلَمَ مَا يُخۡفِينَ مِن زِينَتِهِنَّۚ وَتُوبُوٓاْ إِلَى ٱللَّهِ جَمِيعًا أَيُّهَ ٱلۡمُؤۡمِنُونَ لَعَلَّكُمۡ تُفۡلِحُونَ ﴾
[النور: 31]

మరియు విశ్వసించిన స్త్రీలతో కూడా వారి చూపులను క్రిందికి పెట్టుకోమని మరియు వారి మర్మాంగాలను కాపాడుకోమని చెప్పు. మరియు వారి అలంకరణను ప్రదర్శించవద్దని చెప్పు - (దానంతట అదే) ప్రదర్శనమయ్యేది తప్ప. వారిని, తమ తల మీది దుప్పటిని రొమ్ముల వరకు కప్పుకోమని చెప్పు. వారు తమ అలంకారాన్ని తమ భర్తలకు, తమ తండ్రులకు, తమ భర్తల తండ్రులకు, తమ కుమారులకు, తమ భర్తల కుమారులకు, తమ సోదరులకు, తమ సోదరుల కుమారులకు, తమ సోదరీమణుల కుమారులకు, తమ (తోటి స్త్రీలకు, తమ బానిస స్త్రీలకు, లేక కామ ఇచ్ఛలేని మగ సేవకులకు, లేక స్త్రీల గుప్తాంగాలను గురించి తెలియని బాలురకు తప్ప. ఇతరుల ముందు ప్రదర్శించకూడదని మరియు కనబడకుండా ఉన్న తమ అలంకారం తెలియబడేటట్లుగా, వారు తమ పాదాలను నేలపై కొడుతూ నడవకూడదని చెప్పు. మరియు ఓ విశ్వాసులారా! మీరందరూ కలసి అల్లాహ్ ను క్షమాపణకై వేడుకుంటే, మీరు సాఫల్యం పొందవచ్చు)

❮ Previous Next ❯

ترجمة: وقل للمؤمنات يغضضن من أبصارهن ويحفظن فروجهن ولا يبدين زينتهن إلا ما, باللغة التيلجو

﴿وقل للمؤمنات يغضضن من أبصارهن ويحفظن فروجهن ولا يبدين زينتهن إلا ما﴾ [النور: 31]

Abdul Raheem Mohammad Moulana
Mariyu visvasincina strilato kuda vari cupulanu krindiki pettukomani mariyu vari marmangalanu kapadukomani ceppu. Mariyu vari alankarananu pradarsincavaddani ceppu - (danantata ade) pradarsanamayyedi tappa. Varini, tama tala midi duppatini rom'mula varaku kappukomani ceppu. Varu tama alankaranni tama bhartalaku, tama tandrulaku, tama bhartala tandrulaku, tama kumarulaku, tama bhartala kumarulaku, tama sodarulaku, tama sodarula kumarulaku, tama sodarimanula kumarulaku, tama (toti strilaku, tama banisa strilaku, leka kama icchaleni maga sevakulaku, leka strila guptangalanu gurinci teliyani baluraku tappa. Itarula mundu pradarsincakudadani mariyu kanabadakunda unna tama alankaram teliyabadetatluga, varu tama padalanu nelapai kodutu nadavakudadani ceppu. Mariyu o visvasulara! Mirandaru kalasi allah nu ksamapanakai vedukunte, miru saphalyam pondavaccu)
Abdul Raheem Mohammad Moulana
Mariyu viśvasin̄cina strīlatō kūḍā vāri cūpulanu krindiki peṭṭukōmani mariyu vāri marmāṅgālanu kāpāḍukōmani ceppu. Mariyu vāri alaṅkaraṇanu pradarśin̄cavaddani ceppu - (dānantaṭa adē) pradarśanamayyēdi tappa. Vārini, tama tala mīdi duppaṭini rom'mula varaku kappukōmani ceppu. Vāru tama alaṅkārānni tama bhartalaku, tama taṇḍrulaku, tama bhartala taṇḍrulaku, tama kumārulaku, tama bhartala kumārulaku, tama sōdarulaku, tama sōdarula kumārulaku, tama sōdarīmaṇula kumārulaku, tama (tōṭi strīlaku, tama bānisa strīlaku, lēka kāma icchalēni maga sēvakulaku, lēka strīla guptāṅgālanu gurin̄ci teliyani bāluraku tappa. Itarula mundu pradarśin̄cakūḍadani mariyu kanabaḍakuṇḍā unna tama alaṅkāraṁ teliyabaḍēṭaṭlugā, vāru tama pādālanu nēlapai koḍutū naḍavakūḍadani ceppu. Mariyu ō viśvāsulārā! Mīrandarū kalasi allāh nu kṣamāpaṇakai vēḍukuṇṭē, mīru sāphalyaṁ pondavaccu)
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) ముస్లిం స్త్రీలు తమ చూపులను క్రిందికి ఉంచాలనీ, తమ మర్మస్థానాలను రక్షించుకోవాలనీ, బహిర్గతమై ఉండేది తప్ప – తమ అలంకరణను బహిర్గతం చేయరాదనీ, తమ వక్షస్థలాలపై ఓణీలు వేసుకోవాలనీ, తమ భర్త లేక తమ తండ్రి లేక తమ మామగారు లేక తమ కొడుకులు లేక తమ భర్త కొడుకులు లేక తమ సోదరులు లేక తమ సోదరుల కుమారులు లేక తమ అక్కాచెల్లెళ్ల కొడుకులు లేక తమతో కలిసిమెలిసి ఉండే స్త్రీలు, లేక తమ బానిసలు లేక ఇతరత్రా ఉద్దేశాలు లేకుండా తమకు లోబడి ఉన్న పురుష సేవకులు లేక స్త్రీల గుప్త విషయాల గురించి ఇంకా తెలియని బాలురు – వీళ్ల ఎదుట తప్ప ఇతరుల ఎదుట తమ అలంకరణలను (అంద చందాలను) కనబడనివ్వకూడదనీ, దాగివున్న తమ అలంకరణ ఇతరులకు తెలిసిపోయేలా తమ కాళ్ళను నేలపై కొడుతూ నడవరాదని వారితో చెప్పు. ముస్లింలారా! మీరంతా కలసి అల్లాహ్‌ సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek