×

అంధుని మీద నిందలేదు మరియు కుంటివాని మీద నిందలేదు మరియు రోగి మీద నిందలేదు మరియు 24:61 Telugu translation

Quran infoTeluguSurah An-Nur ⮕ (24:61) ayat 61 in Telugu

24:61 Surah An-Nur ayat 61 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nur ayat 61 - النور - Page - Juz 18

﴿لَّيۡسَ عَلَى ٱلۡأَعۡمَىٰ حَرَجٞ وَلَا عَلَى ٱلۡأَعۡرَجِ حَرَجٞ وَلَا عَلَى ٱلۡمَرِيضِ حَرَجٞ وَلَا عَلَىٰٓ أَنفُسِكُمۡ أَن تَأۡكُلُواْ مِنۢ بُيُوتِكُمۡ أَوۡ بُيُوتِ ءَابَآئِكُمۡ أَوۡ بُيُوتِ أُمَّهَٰتِكُمۡ أَوۡ بُيُوتِ إِخۡوَٰنِكُمۡ أَوۡ بُيُوتِ أَخَوَٰتِكُمۡ أَوۡ بُيُوتِ أَعۡمَٰمِكُمۡ أَوۡ بُيُوتِ عَمَّٰتِكُمۡ أَوۡ بُيُوتِ أَخۡوَٰلِكُمۡ أَوۡ بُيُوتِ خَٰلَٰتِكُمۡ أَوۡ مَا مَلَكۡتُم مَّفَاتِحَهُۥٓ أَوۡ صَدِيقِكُمۡۚ لَيۡسَ عَلَيۡكُمۡ جُنَاحٌ أَن تَأۡكُلُواْ جَمِيعًا أَوۡ أَشۡتَاتٗاۚ فَإِذَا دَخَلۡتُم بُيُوتٗا فَسَلِّمُواْ عَلَىٰٓ أَنفُسِكُمۡ تَحِيَّةٗ مِّنۡ عِندِ ٱللَّهِ مُبَٰرَكَةٗ طَيِّبَةٗۚ كَذَٰلِكَ يُبَيِّنُ ٱللَّهُ لَكُمُ ٱلۡأٓيَٰتِ لَعَلَّكُمۡ تَعۡقِلُونَ ﴾
[النور: 61]

అంధుని మీద నిందలేదు మరియు కుంటివాని మీద నిందలేదు మరియు రోగి మీద నిందలేదు మరియు మీ మీద కూడా నిందలేదు: ఒకవేళ మీరు మీ ఇండ్లలో లేదా మీ తండ్రితాతల ఇండ్లలో లేదా మీ తల్లి నాయనమ్మల ఇండ్లలో లేదా మీ సోదరుల ఇండ్లలో లేదా మీ సోదరీమణుల ఇండ్లలో లేదా పినతండ్రుల (తండ్రి సోదరుల) ఇండ్లలో లేదా మీ మేనత్తల (తండ్రిసోదరీమణుల) ఇండ్లలో లేదా మీ మేనమామల (తల్లి సోదరుల) ఇండ్లలో లేదా మీ పిన్నమ్మల (తల్లి సోదరీమణుల) ఇండ్లలో లేదా మీ ఆధీనంలో తాళపు చెవులు ఉన్నవారి ఇండ్లలో లేదా మీ స్నేహితుల ఇండ్లలో తింటే! మీరు అందరితో కలిసి తిన్నా లేదా వేరుగా తిన్నా కూడా మీపై నింద లేదు. అయితే మీరు ఇండ్లలోనికి ప్రవేశించినపుడు, మీరు ఒకరి కొకరు సలాం చేసుకోవాలి. ఇది అల్లాహ్ తరఫు నుండి నిర్ణయించబడిన దీవెన, శుభప్రదమైనది మేలైనది. ఈ విధంగా, అల్లాహ్ - మీరు అర్థం చేసుకుంటారని - తన ఆజ్ఞలను మీకు విశదీకరిస్తున్నాడు

❮ Previous Next ❯

ترجمة: ليس على الأعمى حرج ولا على الأعرج حرج ولا على المريض حرج, باللغة التيلجو

﴿ليس على الأعمى حرج ولا على الأعرج حرج ولا على المريض حرج﴾ [النور: 61]

Abdul Raheem Mohammad Moulana
Andhuni mida nindaledu mariyu kuntivani mida nindaledu mariyu rogi mida nindaledu mariyu mi mida kuda nindaledu: Okavela miru mi indlalo leda mi tandritatala indlalo leda mi talli nayanam'mala indlalo leda mi sodarula indlalo leda mi sodarimanula indlalo leda pinatandrula (tandri sodarula) indlalo leda mi menattala (tandrisodarimanula) indlalo leda mi menamamala (talli sodarula) indlalo leda mi pinnam'mala (talli sodarimanula) indlalo leda mi adhinanlo talapu cevulu unnavari indlalo leda mi snehitula indlalo tinte! Miru andarito kalisi tinna leda veruga tinna kuda mipai ninda ledu. Ayite miru indlaloniki pravesincinapudu, miru okari kokaru salam cesukovali. Idi allah taraphu nundi nirnayincabadina divena, subhapradamainadi melainadi. I vidhanga, allah - miru artham cesukuntarani - tana ajnalanu miku visadikaristunnadu
Abdul Raheem Mohammad Moulana
Andhuni mīda nindalēdu mariyu kuṇṭivāni mīda nindalēdu mariyu rōgi mīda nindalēdu mariyu mī mīda kūḍā nindalēdu: Okavēḷa mīru mī iṇḍlalō lēdā mī taṇḍritātala iṇḍlalō lēdā mī talli nāyanam'mala iṇḍlalō lēdā mī sōdarula iṇḍlalō lēdā mī sōdarīmaṇula iṇḍlalō lēdā pinataṇḍrula (taṇḍri sōdarula) iṇḍlalō lēdā mī mēnattala (taṇḍrisōdarīmaṇula) iṇḍlalō lēdā mī mēnamāmala (talli sōdarula) iṇḍlalō lēdā mī pinnam'mala (talli sōdarīmaṇula) iṇḍlalō lēdā mī ādhīnanlō tāḷapu cevulu unnavāri iṇḍlalō lēdā mī snēhitula iṇḍlalō tiṇṭē! Mīru andaritō kalisi tinnā lēdā vērugā tinnā kūḍā mīpai ninda lēdu. Ayitē mīru iṇḍlalōniki pravēśin̄cinapuḍu, mīru okari kokaru salāṁ cēsukōvāli. Idi allāh taraphu nuṇḍi nirṇayin̄cabaḍina dīvena, śubhapradamainadi mēlainadi. Ī vidhaṅgā, allāh - mīru arthaṁ cēsukuṇṭārani - tana ājñalanu mīku viśadīkaristunnāḍu
Muhammad Aziz Ur Rehman
గుడ్డివానిపైగానీ, కుంటివానిపైగానీ, వ్యాధిగ్రస్తునిపైగానీ, స్వయంగా మీపైనగానీ – మీ ఇండ్లలో నుంచి అయినా లేదా మీ తండ్రుల ఇళ్ళ నుంచి అయినా లేదా మీ తల్లుల ఇళ్ల నుంచి అయినా, లేదా మీ అన్నదమ్ముల ఇళ్లనుంచి అయినా లేదా మీ అక్కాచెల్లెళ్ల ఇళ్ల నుంచి అయినా, లేదా మీ పిన తండ్రుల ఇళ్లనుంచి అయినా, లేదా మీ మేనత్తల ఇళ్లనుంచి అయినా లేదా మీ మేనమామల ఇళ్లనుంచి అయినా లేదా మీ పినతల్లుల ఇళ్లనుంచి అయినా లేదా తాళపు చెవులు మీ అధీనంలో వున్న ఇళ్లనుంచి అయినా లేదా మీ స్నేహితుల ఇళ్లనుంచి అయినా – ఏమైనా (ఆహార వస్తువులు) తీసుకుని తింటే అది అభ్యంతరకరం ఏమీ కాదు. మీరంతా కలిసి భుజించినా, లేక వేర్వేరుగా భుజించినా తప్పులేదు. అయితే మీరు ఇండ్లలో ప్రవేశించేటప్పుడు మాత్రం మీ స్వయానికి సలాం చేసుకోండి. ఇది అల్లాహ్‌ తరఫు నుంచి అవతరించిన, మేలు కొరకు చేయబడే ప్రార్థన, శుభకరమైనది, పవిత్రమైనది. ఈ విధంగా అల్లాహ్‌ మీరు గ్రహించగలందులకు తన ఆజ్ఞలను మీకు తేటతెల్లం చేస్తున్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek