×

ఓ విశ్వాసులారా! మీరు సత్యతిరస్కారుల మాదిరిగా ప్రవర్తించకండి; వారు తమ సోదరులు ఎప్పుడైనా ప్రయాణంలో ఉంటే, 3:156 Telugu translation

Quran infoTeluguSurah al-‘Imran ⮕ (3:156) ayat 156 in Telugu

3:156 Surah al-‘Imran ayat 156 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah al-‘Imran ayat 156 - آل عِمران - Page - Juz 4

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَكُونُواْ كَٱلَّذِينَ كَفَرُواْ وَقَالُواْ لِإِخۡوَٰنِهِمۡ إِذَا ضَرَبُواْ فِي ٱلۡأَرۡضِ أَوۡ كَانُواْ غُزّٗى لَّوۡ كَانُواْ عِندَنَا مَا مَاتُواْ وَمَا قُتِلُواْ لِيَجۡعَلَ ٱللَّهُ ذَٰلِكَ حَسۡرَةٗ فِي قُلُوبِهِمۡۗ وَٱللَّهُ يُحۡيِۦ وَيُمِيتُۗ وَٱللَّهُ بِمَا تَعۡمَلُونَ بَصِيرٞ ﴾
[آل عِمران: 156]

ఓ విశ్వాసులారా! మీరు సత్యతిరస్కారుల మాదిరిగా ప్రవర్తించకండి; వారు తమ సోదరులు ఎప్పుడైనా ప్రయాణంలో ఉంటే, లేదా యుద్ధంలో ఉంటే, (అక్కడ వారు ఏదైనా ప్రమాదానికి గురి అయితే) వారిని గురించి ఇలా అనేవారు: "ఒకవేళ వారు మాతోపాటు ఉండివుంటే చనిపోయే వారు కాదు మరియు చంపబడేవారునూ కాదు!" వాటిని (ఈ విధమైన మాటలను) అల్లాహ్ వారి హృదయ ఆవేదనకు కారణాలుగా చేస్తాడు. మరియు అల్లాహ్ యే జీవనమిచ్చే వాడు. మరియు మరణమిచ్చే వాడు మరియు మీరు చేస్తున్నదంతా అల్లాహ్ చూస్తున్నాడు

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا لا تكونوا كالذين كفروا وقالوا لإخوانهم إذا ضربوا في, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا لا تكونوا كالذين كفروا وقالوا لإخوانهم إذا ضربوا في﴾ [آل عِمران: 156]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Miru satyatiraskarula madiriga pravartincakandi; varu tama sodarulu eppudaina prayananlo unte, leda yud'dhanlo unte, (akkada varu edaina pramadaniki guri ayite) varini gurinci ila anevaru: "Okavela varu matopatu undivunte canipoye varu kadu mariyu campabadevarunu kadu!" Vatini (i vidhamaina matalanu) allah vari hrdaya avedanaku karanaluga cestadu. Mariyu allah ye jivanamicce vadu. Mariyu maranamicce vadu mariyu miru cestunnadanta allah custunnadu
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Mīru satyatiraskārula mādirigā pravartin̄cakaṇḍi; vāru tama sōdarulu eppuḍainā prayāṇanlō uṇṭē, lēdā yud'dhanlō uṇṭē, (akkaḍa vāru ēdainā pramādāniki guri ayitē) vārini gurin̄ci ilā anēvāru: "Okavēḷa vāru mātōpāṭu uṇḍivuṇṭē canipōyē vāru kādu mariyu campabaḍēvārunū kādu!" Vāṭini (ī vidhamaina māṭalanu) allāh vāri hr̥daya āvēdanaku kāraṇālugā cēstāḍu. Mariyu allāh yē jīvanamiccē vāḍu. Mariyu maraṇamiccē vāḍu mariyu mīru cēstunnadantā allāh cūstunnāḍu
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వసించిన వారలారా! మీరు ఆ అవిశ్వాసుల్లాగా ప్రవర్తించకండి. వారు, తమ సోదరులు ప్రయాణంలోనో, యుద్ధంలోనో ఉన్నప్పుడు, ”ఒకవేళ వారు మా వద్దనే ఉండి ఉంటే చనిపోయేవారూ కాదు, చంపబడేవారూ కాదు” అని అంటారు. ఈ విధమైన తమ ఆలోచనలను అల్లాహ్‌ తమ హృదయశోకానికి కారణాలుగా చేయాలనే వారిలాంటి మాటలు మాట్లాడుతుంటారు. వాస్తవానికి ప్రాణభిక్ష పెట్టేవాడు, ప్రాణం తీసేవాడు అల్లాహ్‌ మాత్రమే. మీరు చేసే పనులన్నిటినీ అల్లాహ్‌ కనిపెడుతూనే ఉన్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek