×

(దావూద్) అన్నాడు: "వాస్తవంగా, నీ ఆడగొర్రెను తన గొర్రెలలో కలుపుకోవటానికి అడిగి, ఇతడు నీపై అన్యాయం 38:24 Telugu translation

Quran infoTeluguSurah sad ⮕ (38:24) ayat 24 in Telugu

38:24 Surah sad ayat 24 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah sad ayat 24 - صٓ - Page - Juz 23

﴿قَالَ لَقَدۡ ظَلَمَكَ بِسُؤَالِ نَعۡجَتِكَ إِلَىٰ نِعَاجِهِۦۖ وَإِنَّ كَثِيرٗا مِّنَ ٱلۡخُلَطَآءِ لَيَبۡغِي بَعۡضُهُمۡ عَلَىٰ بَعۡضٍ إِلَّا ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ وَقَلِيلٞ مَّا هُمۡۗ وَظَنَّ دَاوُۥدُ أَنَّمَا فَتَنَّٰهُ فَٱسۡتَغۡفَرَ رَبَّهُۥ وَخَرَّۤ رَاكِعٗاۤ وَأَنَابَ۩ ﴾
[صٓ: 24]

(దావూద్) అన్నాడు: "వాస్తవంగా, నీ ఆడగొర్రెను తన గొర్రెలలో కలుపుకోవటానికి అడిగి, ఇతడు నీపై అన్యాయం చేస్తున్నాడు. మరియు వాస్తవానికి, చాలా మంది భాగస్థులు ఒకరి కొకరు అన్యాయం చేసుకుంటూ ఉంటారు, విశ్వసించి సత్కార్యాలు చేసేవారు తప్ప! కాని అటువంటి వారు కొందరు మాత్రమే!" వాస్తవానికి మేము అతనిని (దావూద్ ను) పరీక్షిస్తున్నామని అతను అర్థం చేసుకున్నాడు. కాబట్టి తన ప్రభువును క్షమాపణ వేడుకున్నాడు. మరియు సాష్టాంగం (సజ్దా)లో పడిపోయాడు మరియు పశ్చాత్తాపంతో (అల్లాహ్ వైపుకు) మరలాడు

❮ Previous Next ❯

ترجمة: قال لقد ظلمك بسؤال نعجتك إلى نعاجه وإن كثيرا من الخلطاء ليبغي, باللغة التيلجو

﴿قال لقد ظلمك بسؤال نعجتك إلى نعاجه وإن كثيرا من الخلطاء ليبغي﴾ [صٓ: 24]

Abdul Raheem Mohammad Moulana
(davud) annadu: "Vastavanga, ni adagorrenu tana gorrelalo kalupukovataniki adigi, itadu nipai an'yayam cestunnadu. Mariyu vastavaniki, cala mandi bhagasthulu okari kokaru an'yayam cesukuntu untaru, visvasinci satkaryalu cesevaru tappa! Kani atuvanti varu kondaru matrame!" Vastavaniki memu atanini (davud nu) pariksistunnamani atanu artham cesukunnadu. Kabatti tana prabhuvunu ksamapana vedukunnadu. Mariyu sastangam (sajda)lo padipoyadu mariyu pascattapanto (allah vaipuku) maraladu
Abdul Raheem Mohammad Moulana
(dāvūd) annāḍu: "Vāstavaṅgā, nī āḍagorrenu tana gorrelalō kalupukōvaṭāniki aḍigi, itaḍu nīpai an'yāyaṁ cēstunnāḍu. Mariyu vāstavāniki, cālā mandi bhāgasthulu okari kokaru an'yāyaṁ cēsukuṇṭū uṇṭāru, viśvasin̄ci satkāryālu cēsēvāru tappa! Kāni aṭuvaṇṭi vāru kondaru mātramē!" Vāstavāniki mēmu atanini (dāvūd nu) parīkṣistunnāmani atanu arthaṁ cēsukunnāḍu. Kābaṭṭi tana prabhuvunu kṣamāpaṇa vēḍukunnāḍu. Mariyu sāṣṭāṅgaṁ (sajdā)lō paḍipōyāḍu mariyu paścāttāpantō (allāh vaipuku) maralāḍu
Muhammad Aziz Ur Rehman
అతను (దావూదు) ఇలా అన్నాడు: “ఇతను తన గొర్రెలతో పాటు నీ గొర్రెనొక్క దానిని కూడా కలుపుకుంటానని అడిగి నీపై అన్యాయానికి ఒడిగడుతున్నాడు. భాగస్వాములలో చాలామంది (ఇలాంటి వారే అయి ఉంటారు. వారు) ఒండొకరిపై అన్యాయానికి పాల్పడుతూ ఉంటారు. అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసేవారు మాత్రం అలా చేయరు. కాని అలాంటి వారు చాలా కొద్దిమంది మాత్రమే ఉంటారు.” (అంతే!) మేము అతన్ని పరీక్షిస్తున్నామన్న సంగతిని దావూదు గ్రహించాడు. మరి తన ప్రభువును క్షమాభిక్ష కోరసాగాడు. కడుదీనంగా మోకరిల్లాడు. (ఏకాగ్రతతో తన ప్రభువు వైపునకు) మరలాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek