Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 176 - النِّسَاء - Page - Juz 6
﴿يَسۡتَفۡتُونَكَ قُلِ ٱللَّهُ يُفۡتِيكُمۡ فِي ٱلۡكَلَٰلَةِۚ إِنِ ٱمۡرُؤٌاْ هَلَكَ لَيۡسَ لَهُۥ وَلَدٞ وَلَهُۥٓ أُخۡتٞ فَلَهَا نِصۡفُ مَا تَرَكَۚ وَهُوَ يَرِثُهَآ إِن لَّمۡ يَكُن لَّهَا وَلَدٞۚ فَإِن كَانَتَا ٱثۡنَتَيۡنِ فَلَهُمَا ٱلثُّلُثَانِ مِمَّا تَرَكَۚ وَإِن كَانُوٓاْ إِخۡوَةٗ رِّجَالٗا وَنِسَآءٗ فَلِلذَّكَرِ مِثۡلُ حَظِّ ٱلۡأُنثَيَيۡنِۗ يُبَيِّنُ ٱللَّهُ لَكُمۡ أَن تَضِلُّواْۗ وَٱللَّهُ بِكُلِّ شَيۡءٍ عَلِيمُۢ ﴾
[النِّسَاء: 176]
﴿يستفتونك قل الله يفتيكم في الكلالة إن امرؤ هلك ليس له ولد﴾ [النِّسَاء: 176]
Abdul Raheem Mohammad Moulana varu ninnu, (kalalanu) gurinci dharmika sasanam (phatva) adugutunnaru. Allah miku, kalalanu gurinci, i vidhanga dharmika sasanam istunnadani ceppu: "Oka purusudu maraninci, ataniki santanam lekunda oka sodari matrame unte, atadu vidicina astilo ameku sagam vata labhistundi. Pillalu leka canipoyina sodari mottam astiki, atadu (ame nija sodarudu) varasudavutadu. Ataniki (mrtuniki) iddaru sodarimanulu unte, variddariki atadu vadalina astilo mudinta rendu vantula bhagam labhistundi. Okavela sodara sodarimanulu (anekulunte) prati purusuniki iddaru strila bhaganiki samananga vata labhistundi. Miru dari tappakunda undataniki allah miku anta spastanga teluputunnadu. Mariyu allah ku prati visayam gurinci baga telusu |
Abdul Raheem Mohammad Moulana vāru ninnu, (kalālanu) gurin̄ci dhārmika śāsanaṁ (phatvā) aḍugutunnāru. Allāh mīku, kalālanu gurin̄ci, ī vidhaṅgā dhārmika śāsanaṁ istunnāḍani ceppu: "Oka puruṣuḍu maraṇin̄ci, ataniki santānaṁ lēkuṇḍā oka sōdari mātramē uṇṭē, ataḍu viḍicina āstilō āmeku sagaṁ vāṭā labhistundi. Pillalu lēka canipōyina sōdari mottaṁ āstiki, ataḍu (āme nija sōdaruḍu) vārasuḍavutāḍu. Ataniki (mr̥tuniki) iddaru sōdarīmaṇulu uṇṭē, vāriddarikī ataḍu vadalina āstilō mūḍiṇṭa reṇḍu vantula bhāgaṁ labhistundi. Okavēḷa sōdara sōdarīmaṇulu (anēkuluṇṭē) prati puruṣuniki iddaru strīla bhāgāniki samānaṅgā vāṭā labhistundi. Mīru dāri tappakuṇḍā uṇḍaṭāniki allāh mīku antā spaṣṭaṅgā teluputunnāḍu. Mariyu allāh ku prati viṣayaṁ gurin̄ci bāgā telusu |
Muhammad Aziz Ur Rehman (ఓ ప్రవక్తా!) వీరు నిన్ను (‘కలాలా’ గురించి) ధర్మాదేశం అడుగుతున్నారు. అల్లాహ్ (స్వయంగా) ‘కలాలా’ గురించి మీకు ఆదేశం ఇస్తున్నాడని నువ్వు వారికి చెప్పు. ఏ వ్యక్తయినా సంతానం లేకుండా చనిపోతే, అతనికి ఒక సోదరి మాత్రమే ఉంటే, అతను వదలి వెళ్ళిన ఆస్తిలో సగభాగం ఆమెకు లభిస్తుంది. ఒకవేళ సోదరి-సంతానం లేకుండా మరణిస్తే ఆమె సోదరుడు ఆమె ఆస్తికి వారసుడౌతాడు. ఒకవేళ (మరణించిన వ్యక్తికి) ఇద్దరు సోదరీమణులుంటే, అతని మొత్తం ఆస్తిలో మూడింట రెండొంతుల భాగం వారిద్దరికీ దక్కుతుంది. ఒకవేళ సోదరీసోదరులు అనేకమంది వారసులుగా ఉన్నప్పుడు, ఒక పురుషుని భాగం ఇద్దరు స్త్రీలకు ఇచ్చే భాగాలకు సమానంగా ఉంటుంది. మీరు పెడదారి పట్టకుండా ఉండేందుకుగాను అల్లాహ్ మీకు స్పష్టంగా విడమరచి చెబుతున్నాడు. అల్లాహ్ ప్రతిదీ తెలిసినవాడు |