Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 23 - النِّسَاء - Page - Juz 4
﴿حُرِّمَتۡ عَلَيۡكُمۡ أُمَّهَٰتُكُمۡ وَبَنَاتُكُمۡ وَأَخَوَٰتُكُمۡ وَعَمَّٰتُكُمۡ وَخَٰلَٰتُكُمۡ وَبَنَاتُ ٱلۡأَخِ وَبَنَاتُ ٱلۡأُخۡتِ وَأُمَّهَٰتُكُمُ ٱلَّٰتِيٓ أَرۡضَعۡنَكُمۡ وَأَخَوَٰتُكُم مِّنَ ٱلرَّضَٰعَةِ وَأُمَّهَٰتُ نِسَآئِكُمۡ وَرَبَٰٓئِبُكُمُ ٱلَّٰتِي فِي حُجُورِكُم مِّن نِّسَآئِكُمُ ٱلَّٰتِي دَخَلۡتُم بِهِنَّ فَإِن لَّمۡ تَكُونُواْ دَخَلۡتُم بِهِنَّ فَلَا جُنَاحَ عَلَيۡكُمۡ وَحَلَٰٓئِلُ أَبۡنَآئِكُمُ ٱلَّذِينَ مِنۡ أَصۡلَٰبِكُمۡ وَأَن تَجۡمَعُواْ بَيۡنَ ٱلۡأُخۡتَيۡنِ إِلَّا مَا قَدۡ سَلَفَۗ إِنَّ ٱللَّهَ كَانَ غَفُورٗا رَّحِيمٗا ﴾
[النِّسَاء: 23]
﴿حرمت عليكم أمهاتكم وبناتكم وأخواتكم وعماتكم وخالاتكم وبنات الأخ وبنات الأخت وأمهاتكم﴾ [النِّسَاء: 23]
Abdul Raheem Mohammad Moulana miku i strilu nisedhimpabaddaru. Mi tallulu, mi kuramartelu, mi sodarimanulu, mi menattalu, mi tallisodari manulu (pinatallulu), mi sodarula kumartelu, mi sodarimanula kumartelu, miku paliccina tallulu (dadulu), mito patu palu tragina sodarimanulu, mi bharyala tallulu; mi sanraksanalo unna mi bharyala kumartelu - e bharyalatonaite miru sambhogincaro - kani miru varito sambhogincaka mundu (variki vidakulicci vari kutullanu pendladite) tappuledu; mi vennu nundi puttina mi kumarula bharyalu mariyu eka kalanlo akka cellellanu iddarini cercatam (bharyaluga cesukovatam nisid'dham); kani intaku purvam jarigindedo jarigi poyindi. Niscayanga, allah ksamasiludu, apara karunapradata |
Abdul Raheem Mohammad Moulana mīku ī strīlu niṣēdhimpabaḍḍāru. Mī tallulu, mī kuramārtelu, mī sōdarīmaṇulu, mī mēnattalu, mī tallisōdarī maṇulu (pinatallulu), mī sōdarula kumārtelu, mī sōdarīmaṇula kumārtelu, mīku pāliccina tallulu (dādulu), mītō pāṭu pālu trāgina sōdarīmaṇulu, mī bhāryala tallulu; mī sanrakṣaṇalō unna mī bhāryala kumārtelu - ē bhāryalatōnaitē mīru sambhōgin̄cārō - kāni mīru vāritō sambhōgin̄caka mundu (vāriki viḍākulicci vāri kūtuḷḷanu peṇḍlāḍitē) tappulēdu; mī vennu nuṇḍi puṭṭina mī kumārula bhāryalu mariyu ēka kālanlō akkā celleḷḷanu iddarinī cērcaṭaṁ (bhāryalugā cēsukōvaṭaṁ niṣid'dhaṁ); kāni intaku pūrvaṁ jarigindēdō jarigi pōyindi. Niścayaṅgā, allāh kṣamāśīluḍu, apāra karuṇāpradāta |
Muhammad Aziz Ur Rehman మీ కొరకు నిషేధించబడినవారు – మీ తల్లులు, మీ కుమార్తెలు, మీ అక్కా చెల్లెళ్ళు, మీ మేనత్తలు, మీ తల్లి సోదరీమణులు (మీ పిన్నమ్మ పెద్దమ్మలు), మీ అన్నదమ్ముల కుమార్తెలు, అక్కాచెల్లెళ్ళ కూతుళ్ళు (మేనకోడళ్ళు), మీకు పాలిచ్చిన తల్లులు, పాల వరుస ద్వారా మీకు అక్కాచెల్లెళ్ళు అయినవారు, మీ భార్యల తల్లులు (అత్తలు), మీరు దాంపత్య సుఖాన్ని అనుభవించిన మీ భార్యల (ఆమె మాజీ భర్త ద్వారా పుట్టిన) మీ సంరక్షణలోనున్న కూతుళ్ళు – ఒకవేళ మీరు వారితో సమాగమం జరపకుండా ఉంటే (కేవలం పెళ్ళిమాత్రం చేసుకుని వారికి విడాకులు యిచ్చేసివున్న పక్షంలో వారి కూతుళ్లను వివాహమాడటం) మీ కొరకు పాపం కాదు. అలాగే మీ వెన్ను నుండి (స్ఖలించబడిన వీర్యంతో) పుట్టిన మీ కొడుకుల భార్యలు (కోడళ్ళు) మీ కోసం నిషేధించబడ్డారు. (ఏకకాలంలో) ఇద్దరు అక్కా చెల్లెళ్ళను కలిపి భార్యలుగా చేసుకోవటం కూడా మీ కొరకు నిషిద్ధమే, లోగడ జరిగిందేదో జరిగిపోయింది. నిస్సందేహంగా అల్లాహ్ క్షమాశీలి, కృపాకరుడు కూడాను |