×

ఓ విశ్వాసులారా! మీరు మత్తులో ఉంటే, మీరు పలికేది గ్రహించనంత వరకు మరియు మీకు ఇంద్రియ 4:43 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:43) ayat 43 in Telugu

4:43 Surah An-Nisa’ ayat 43 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 43 - النِّسَاء - Page - Juz 5

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ لَا تَقۡرَبُواْ ٱلصَّلَوٰةَ وَأَنتُمۡ سُكَٰرَىٰ حَتَّىٰ تَعۡلَمُواْ مَا تَقُولُونَ وَلَا جُنُبًا إِلَّا عَابِرِي سَبِيلٍ حَتَّىٰ تَغۡتَسِلُواْۚ وَإِن كُنتُم مَّرۡضَىٰٓ أَوۡ عَلَىٰ سَفَرٍ أَوۡ جَآءَ أَحَدٞ مِّنكُم مِّنَ ٱلۡغَآئِطِ أَوۡ لَٰمَسۡتُمُ ٱلنِّسَآءَ فَلَمۡ تَجِدُواْ مَآءٗ فَتَيَمَّمُواْ صَعِيدٗا طَيِّبٗا فَٱمۡسَحُواْ بِوُجُوهِكُمۡ وَأَيۡدِيكُمۡۗ إِنَّ ٱللَّهَ كَانَ عَفُوًّا غَفُورًا ﴾
[النِّسَاء: 43]

ఓ విశ్వాసులారా! మీరు మత్తులో ఉంటే, మీరు పలికేది గ్రహించనంత వరకు మరియు మీకు ఇంద్రియ స్ఖలనం (జునుబున్) అయి ఉంటే - స్నానం చేయనంత వరకు - నమాజ్ సమీపానికి వెళ్లకండి; కాని నడుస్తూ (మస్జిద్) నుండి దాట వలసి వస్తే తప్ప. కాని ఒకవేళ మీరు రోగపీడితులై ఉంటే, లేదా ప్రయాణంలో ఉంటే, లేక మలమూత్రవిసర్జన చేసి ఉంటే, లేక స్త్రీలతో సంభోగం చేసి ఉంటే - మీకు నీళ్ళు దొరక్కపోతే - పరిశుద్ధమైన మట్టిని చేతులతో స్పర్శించి, ఆ చేతులతో మీ ముఖాలను మరియు మీ చేతులను, తుడుచుకోండి (తయమ్మమ్ చేయండి). నిశ్చయంగా అల్లాహ్ తప్పులను మన్నించేవాడు, క్షమించేవాడు

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا لا تقربوا الصلاة وأنتم سكارى حتى تعلموا ما تقولون, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا لا تقربوا الصلاة وأنتم سكارى حتى تعلموا ما تقولون﴾ [النِّسَاء: 43]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Miru mattulo unte, miru palikedi grahincananta varaku mariyu miku indriya skhalanam (junubun) ayi unte - snanam ceyananta varaku - namaj samipaniki vellakandi; kani nadustu (masjid) nundi data valasi vaste tappa. Kani okavela miru rogapiditulai unte, leda prayananlo unte, leka malamutravisarjana cesi unte, leka strilato sambhogam cesi unte - miku nillu dorakkapote - parisud'dhamaina mattini cetulato sparsinci, a cetulato mi mukhalanu mariyu mi cetulanu, tuducukondi (tayam'mam ceyandi). Niscayanga allah tappulanu mannincevadu, ksamincevadu
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Mīru mattulō uṇṭē, mīru palikēdi grahin̄cananta varaku mariyu mīku indriya skhalanaṁ (junubun) ayi uṇṭē - snānaṁ cēyananta varaku - namāj samīpāniki veḷlakaṇḍi; kāni naḍustū (masjid) nuṇḍi dāṭa valasi vastē tappa. Kāni okavēḷa mīru rōgapīḍitulai uṇṭē, lēdā prayāṇanlō uṇṭē, lēka malamūtravisarjana cēsi uṇṭē, lēka strīlatō sambhōgaṁ cēsi uṇṭē - mīku nīḷḷu dorakkapōtē - pariśud'dhamaina maṭṭini cētulatō sparśin̄ci, ā cētulatō mī mukhālanu mariyu mī cētulanu, tuḍucukōṇḍi (tayam'mam cēyaṇḍi). Niścayaṅgā allāh tappulanu mannin̄cēvāḍu, kṣamin̄cēvāḍu
Muhammad Aziz Ur Rehman
విశ్వసించిన ప్రజలారా! మీరు (తాగిన) మత్తులో ఉన్నప్పుడు నమాజు దరిదాపులకు కూడా పోకండి. మీరు పలికేదేమిటో మీకు అర్థం కాగలిగినప్పుడే (నమాజు చెయ్యాలి). లైంగిక అశుద్ధావస్థలో కూడా – స్నానం చేయనంతవరకూ – నమాజు చేయరాదు. (మస్జిదు) దారిగుండా సాగిపోయేటి పరిస్థితి అయితే అది వేరే విషయం! ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే, లేక ప్రయాణంలో ఉంటే లేక మీలో ఎవరయినా మలమూత్ర విసర్జన చేసివస్తే లేక మీరు స్త్రీలతో సమాగమం జరిపి ఉంటే – అట్టి స్థితిలో మీకు నీరు లభ్యం కానిపక్షంలో పరిశుభ్రమైన మట్టి(ని ఉపయోగించే) సంకల్పం చేసుకోండి. (దాంతో) మీ ముఖాలను, చేతులను తుడుచుకోండి. నిశ్చయంగా అల్లాహ్‌ మన్నించేవాడు, క్షమాభిక్ష పెట్టేవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek