×

మరియు వివాహయోగ్యమైన వయస్సు వచ్చే వరకూ మీరు అనాథులను పరీక్షించండి, ఇక వారిలో మీకు యోగ్యత 4:6 Telugu translation

Quran infoTeluguSurah An-Nisa’ ⮕ (4:6) ayat 6 in Telugu

4:6 Surah An-Nisa’ ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah An-Nisa’ ayat 6 - النِّسَاء - Page - Juz 4

﴿وَٱبۡتَلُواْ ٱلۡيَتَٰمَىٰ حَتَّىٰٓ إِذَا بَلَغُواْ ٱلنِّكَاحَ فَإِنۡ ءَانَسۡتُم مِّنۡهُمۡ رُشۡدٗا فَٱدۡفَعُوٓاْ إِلَيۡهِمۡ أَمۡوَٰلَهُمۡۖ وَلَا تَأۡكُلُوهَآ إِسۡرَافٗا وَبِدَارًا أَن يَكۡبَرُواْۚ وَمَن كَانَ غَنِيّٗا فَلۡيَسۡتَعۡفِفۡۖ وَمَن كَانَ فَقِيرٗا فَلۡيَأۡكُلۡ بِٱلۡمَعۡرُوفِۚ فَإِذَا دَفَعۡتُمۡ إِلَيۡهِمۡ أَمۡوَٰلَهُمۡ فَأَشۡهِدُواْ عَلَيۡهِمۡۚ وَكَفَىٰ بِٱللَّهِ حَسِيبٗا ﴾
[النِّسَاء: 6]

మరియు వివాహయోగ్యమైన వయస్సు వచ్చే వరకూ మీరు అనాథులను పరీక్షించండి, ఇక వారిలో మీకు యోగ్యత కనిపించినప్పుడు, వారి ఆస్తులను వారికి అప్పగించండి. మరియు వారు పెరిగి పెద్దవారు అవుతారనే తలంపుతో దానిని (వారి ఆస్తిని) త్వరపడి అపరిమితంగా తినకండి. మరియు అతడు (సంరక్షకుడు) సంపన్నుడైతే, వారి సొమ్ముకు దూరంగా ఉండాలి. కాని అతడు పేదవాడైతే, దాని నుండి ధర్మసమ్మతంగా తినాలి. ఇక వారి ఆస్తిని వారికి అప్పగించేటప్పుడు దానికి సాక్షులను పెట్టుకోండి. మరియు లెక్క తీసుకోవటానికి అల్లాహ్ చాలు

❮ Previous Next ❯

ترجمة: وابتلوا اليتامى حتى إذا بلغوا النكاح فإن آنستم منهم رشدا فادفعوا إليهم, باللغة التيلجو

﴿وابتلوا اليتامى حتى إذا بلغوا النكاح فإن آنستم منهم رشدا فادفعوا إليهم﴾ [النِّسَاء: 6]

Abdul Raheem Mohammad Moulana
mariyu vivahayogyamaina vayas'su vacce varaku miru anathulanu pariksincandi, ika varilo miku yogyata kanipincinappudu, vari astulanu variki appagincandi. Mariyu varu perigi peddavaru avutarane talamputo danini (vari astini) tvarapadi aparimitanga tinakandi. Mariyu atadu (sanraksakudu) sampannudaite, vari som'muku duranga undali. Kani atadu pedavadaite, dani nundi dharmasam'matanga tinali. Ika vari astini variki appagincetappudu daniki saksulanu pettukondi. Mariyu lekka tisukovataniki allah calu
Abdul Raheem Mohammad Moulana
mariyu vivāhayōgyamaina vayas'su vaccē varakū mīru anāthulanu parīkṣin̄caṇḍi, ika vārilō mīku yōgyata kanipin̄cinappuḍu, vāri āstulanu vāriki appagin̄caṇḍi. Mariyu vāru perigi peddavāru avutāranē talamputō dānini (vāri āstini) tvarapaḍi aparimitaṅgā tinakaṇḍi. Mariyu ataḍu (sanrakṣakuḍu) sampannuḍaitē, vāri som'muku dūraṅgā uṇḍāli. Kāni ataḍu pēdavāḍaitē, dāni nuṇḍi dharmasam'mataṅgā tināli. Ika vāri āstini vāriki appagin̄cēṭappuḍu dāniki sākṣulanu peṭṭukōṇḍi. Mariyu lekka tīsukōvaṭāniki allāh cālu
Muhammad Aziz Ur Rehman
తండ్రిలేని బిడ్డలు పెళ్ళీడుకు వచ్చేవరకూ వారిని తీర్చిదిద్దుతూ, పరీక్షిస్తూ ఉండండి. ఒకవేళ వారిలో తెలివితేటలు, కార్యదక్షత కానవస్తే వారి ఆస్తిని వారికి అప్పగించండి. వారు పెద్దవారవుతున్నారన్న భయంతో వారి ఆస్తిపాస్తులను ఆదరా బాదరాగా దుబారా ఖర్చుచేయకండి. తండ్రిలేని బిడ్డల పోషకుడు ధనవంతుడైన పక్షంలో వారి సొమ్మును ముట్టుకోకూడదు. ఒకవేళ అతడు పేదవాడైతే ధర్మబద్ధంగా – అవసరమైనంత మేరకు – అనుభవించవచ్చు. మరి వారి ఆస్తిని వారికి అప్పగించేటప్పుడు దానికి సాక్షుల్ని పెట్టుకోండి. లెక్క తీసుకోవటానికి అల్లాహ్‌ చాలు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek