×

కావున మీరు సత్యతిరస్కారులను (యుద్ధంలో) ఎదుర్కొన్నప్పుడు, వారిపై ప్రాబల్యం పొందే వరకు, వారి మెడలపై కొట్టండి. 47:4 Telugu translation

Quran infoTeluguSurah Muhammad ⮕ (47:4) ayat 4 in Telugu

47:4 Surah Muhammad ayat 4 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Muhammad ayat 4 - مُحمد - Page - Juz 26

﴿فَإِذَا لَقِيتُمُ ٱلَّذِينَ كَفَرُواْ فَضَرۡبَ ٱلرِّقَابِ حَتَّىٰٓ إِذَآ أَثۡخَنتُمُوهُمۡ فَشُدُّواْ ٱلۡوَثَاقَ فَإِمَّا مَنَّۢا بَعۡدُ وَإِمَّا فِدَآءً حَتَّىٰ تَضَعَ ٱلۡحَرۡبُ أَوۡزَارَهَاۚ ذَٰلِكَۖ وَلَوۡ يَشَآءُ ٱللَّهُ لَٱنتَصَرَ مِنۡهُمۡ وَلَٰكِن لِّيَبۡلُوَاْ بَعۡضَكُم بِبَعۡضٖۗ وَٱلَّذِينَ قُتِلُواْ فِي سَبِيلِ ٱللَّهِ فَلَن يُضِلَّ أَعۡمَٰلَهُمۡ ﴾
[مُحمد: 4]

కావున మీరు సత్యతిరస్కారులను (యుద్ధంలో) ఎదుర్కొన్నప్పుడు, వారిపై ప్రాబల్యం పొందే వరకు, వారి మెడలపై కొట్టండి. ఆ తరువాత వారిని గట్టిగా బంధించండి, (యుద్ధం ముగిసిన) తరువాత వారిని కనికరించి వదలి పెట్టండి, లేదా పరిహార ధనం తీసుకొని వదలి పెట్టండి. (మీతో) యుద్ధం చేసేవారు తమ ఆయుధాలను పడవేసే వరకు (వారితో పోరాడండి). ఇది మీరు చేయవలసిన పని. అల్లాహ్ తలుచుకుంటే ఆయన వారికి ప్రతీకారం చేసేవాడు, కాని మిమ్మల్ని ఒకరి ద్వారా మరొకరిని పరీక్షించటానికి (ఆయన ఇలా చేశాడు). మరియు ఎవరైతే అల్లాహ్ మార్గంలో చంపబడ్డారో, అలాంటి వారి కర్మలను ఆయన వ్యర్థం చేయడు

❮ Previous Next ❯

ترجمة: فإذا لقيتم الذين كفروا فضرب الرقاب حتى إذا أثخنتموهم فشدوا الوثاق فإما, باللغة التيلجو

﴿فإذا لقيتم الذين كفروا فضرب الرقاب حتى إذا أثخنتموهم فشدوا الوثاق فإما﴾ [مُحمد: 4]

Abdul Raheem Mohammad Moulana
kavuna miru satyatiraskarulanu (yud'dhanlo) edurkonnappudu, varipai prabalyam ponde varaku, vari medalapai kottandi. A taruvata varini gattiga bandhincandi, (yud'dham mugisina) taruvata varini kanikarinci vadali pettandi, leda parihara dhanam tisukoni vadali pettandi. (Mito) yud'dham cesevaru tama ayudhalanu padavese varaku (varito poradandi). Idi miru ceyavalasina pani. Allah talucukunte ayana variki pratikaram cesevadu, kani mim'malni okari dvara marokarini pariksincataniki (ayana ila cesadu). Mariyu evaraite allah marganlo campabaddaro, alanti vari karmalanu ayana vyartham ceyadu
Abdul Raheem Mohammad Moulana
kāvuna mīru satyatiraskārulanu (yud'dhanlō) edurkonnappuḍu, vāripai prābalyaṁ pondē varaku, vāri meḍalapai koṭṭaṇḍi. Ā taruvāta vārini gaṭṭigā bandhin̄caṇḍi, (yud'dhaṁ mugisina) taruvāta vārini kanikarin̄ci vadali peṭṭaṇḍi, lēdā parihāra dhanaṁ tīsukoni vadali peṭṭaṇḍi. (Mītō) yud'dhaṁ cēsēvāru tama āyudhālanu paḍavēsē varaku (vāritō pōrāḍaṇḍi). Idi mīru cēyavalasina pani. Allāh talucukuṇṭē āyana vāriki pratīkāraṁ cēsēvāḍu, kāni mim'malni okari dvārā marokarini parīkṣin̄caṭāniki (āyana ilā cēśāḍu). Mariyu evaraitē allāh mārganlō campabaḍḍārō, alāṇṭi vāri karmalanu āyana vyarthaṁ cēyaḍu
Muhammad Aziz Ur Rehman
మరి మీరు అవిశ్వాసులను (రణరంగంలో) ఎదుర్కొన్నప్పుడు వారి మెడలపై వ్రేటు వేయండి. వారిని బాగా అణచిన తరువాత గట్టిగా బంధించండి. పిదప మీరు వారిని (పరిహారం తీసుకోకుండా) వదలిపెట్టి మేలు చేసినా లేక పరిహారం పుచ్చుకొని వదలినా ( అది మీ ఇష్టం). యుద్ధం ఆయుధాలను పడవేసే దాకా (ఈ పోరు సాగాలి). (ఆజ్ఞాపించబడినది మాత్రం) ఇదే. అల్లాహ్ గనక తలచుకొంటే (స్వయంగా) తానొక్కడే ప్రతీకారం తీర్చుకునేవాడు. కాని మీలో ఒకరిని ఇంకొకరి ద్వారా పరీక్షించాలన్నది ఆయన అభిమతం. అల్లాహ్ మార్గంలో చంపబడినవారి కర్మలను ఆయన వృధా కానివ్వడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek