Quran with Telugu translation - Surah Al-Fath ayat 29 - الفَتح - Page - Juz 26
﴿مُّحَمَّدٞ رَّسُولُ ٱللَّهِۚ وَٱلَّذِينَ مَعَهُۥٓ أَشِدَّآءُ عَلَى ٱلۡكُفَّارِ رُحَمَآءُ بَيۡنَهُمۡۖ تَرَىٰهُمۡ رُكَّعٗا سُجَّدٗا يَبۡتَغُونَ فَضۡلٗا مِّنَ ٱللَّهِ وَرِضۡوَٰنٗاۖ سِيمَاهُمۡ فِي وُجُوهِهِم مِّنۡ أَثَرِ ٱلسُّجُودِۚ ذَٰلِكَ مَثَلُهُمۡ فِي ٱلتَّوۡرَىٰةِۚ وَمَثَلُهُمۡ فِي ٱلۡإِنجِيلِ كَزَرۡعٍ أَخۡرَجَ شَطۡـَٔهُۥ فَـَٔازَرَهُۥ فَٱسۡتَغۡلَظَ فَٱسۡتَوَىٰ عَلَىٰ سُوقِهِۦ يُعۡجِبُ ٱلزُّرَّاعَ لِيَغِيظَ بِهِمُ ٱلۡكُفَّارَۗ وَعَدَ ٱللَّهُ ٱلَّذِينَ ءَامَنُواْ وَعَمِلُواْ ٱلصَّٰلِحَٰتِ مِنۡهُم مَّغۡفِرَةٗ وَأَجۡرًا عَظِيمَۢا ﴾
[الفَتح: 29]
﴿محمد رسول الله والذين معه أشداء على الكفار رحماء بينهم تراهم ركعا﴾ [الفَتح: 29]
Abdul Raheem Mohammad Moulana muham'mad allah yokka sandesaharudu. Mariyu atani venta unnavaru, satyatiraskarula patla kathinulu mariyu parasparam karunamayulu. Nivu varini (allah mundu) vangutu (ruku'u cestu), sastangalu (sajdalu) cestu undatam custunnavu. Varu allah anugrahanni mariyu prasannatanu arthistu untaru. Vari mukhala mida sastangam (sajda) ceyatam valla vaccina gurtuluntayi. Vari i upamanam taurat lo kuda ivvabadutundi. Mariyu injil lo varu oka pairuto polcabaddaru: Modata (bijam nundi) oka molaka ankuristundi, taruvata danini lavuga cestadu. A taruvata adi tana kandam mida nitaruga nilabadi raitulanu ananda parici satyatiraskarulaku krodhavesalu kaligistundi. Visvasinci, satkaryalu cese variki ksamapana mariyu goppa pratiphalanni prasadistanani allah vagdanam cesadu |
Abdul Raheem Mohammad Moulana muham'mad allāh yokka sandēśaharuḍu. Mariyu atani veṇṭa unnavāru, satyatiraskārula paṭla kaṭhinulu mariyu parasparaṁ karuṇāmayulu. Nīvu vārini (allāh mundu) vaṅgutū (rukū'u cēstū), sāṣṭāṅgālu (sajdālu) cēstū uṇḍaṭaṁ cūstunnāvu. Vāru allāh anugrahānni mariyu prasannatanu arthistū uṇṭāru. Vāri mukhāla mīda sāṣṭāṅgaṁ (sajdā) cēyaṭaṁ valla vaccina gurtuluṇṭāyi. Vāri ī upamānaṁ taurāt lō kūḍā ivvabaḍutundi. Mariyu in̄jīl lō vāru oka pairutō pōlcabaḍḍāru: Modaṭa (bījaṁ nuṇḍi) oka molaka aṅkuristundi, taruvāta dānini lāvugā cēstāḍu. Ā taruvāta adi tana kāṇḍaṁ mīda niṭārugā nilabaḍi raitulanu ānanda parici satyatiraskārulaku krōdhāvēśālu kaligistundi. Viśvasin̄ci, satkāryālu cēsē vāriki kṣamāpaṇa mariyu goppa pratiphalānni prasādistānani allāh vāgdānaṁ cēśāḍu |
Muhammad Aziz Ur Rehman ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం అల్లాహ్ ప్రవక్త. ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వెంట ఉన్నవారు అవిశ్వాసులకు కొరుకుడు పడనివారు. ఒండొకరి పట్ల మాత్రం దయార్ద్ర హృదయులు. దైవకృపను, దైవప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో వారు (దైవ సన్నిధిలో) వినమ్రులై వంగటాన్ని, సాష్టాంగపడటాన్ని నీవు చూస్తావు. వారి సాష్టాంగ ప్రణామాల ప్రత్యేక ప్రభావం వారి ముఖారవిందాలపై తొణకిస లాడుతూ ఉంటుంది. వీరికి సంబంధించిన ఈ ఉపమానమే తౌరాతులో ఉంది. ఇంజీలులో (కూడా) వారి ఉపమానం ఉంది. అది ఒక పంటపొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తరువాత అది లావు అయింది. ఆ పైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది, రైతులను అలరించసాగింది – వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని! వారిలో విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసి ఉన్నాడు |