×

(జ్ఞాపకముంచుకోండి!) అప్పుడు (పునరుత్థాన దినమున), అల్లాహ్: "ఓ మర్యమ్ కుమారుడా! ఈసా (ఏసు) నేను నీకు 5:110 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:110) ayat 110 in Telugu

5:110 Surah Al-Ma’idah ayat 110 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 110 - المَائدة - Page - Juz 7

﴿إِذۡ قَالَ ٱللَّهُ يَٰعِيسَى ٱبۡنَ مَرۡيَمَ ٱذۡكُرۡ نِعۡمَتِي عَلَيۡكَ وَعَلَىٰ وَٰلِدَتِكَ إِذۡ أَيَّدتُّكَ بِرُوحِ ٱلۡقُدُسِ تُكَلِّمُ ٱلنَّاسَ فِي ٱلۡمَهۡدِ وَكَهۡلٗاۖ وَإِذۡ عَلَّمۡتُكَ ٱلۡكِتَٰبَ وَٱلۡحِكۡمَةَ وَٱلتَّوۡرَىٰةَ وَٱلۡإِنجِيلَۖ وَإِذۡ تَخۡلُقُ مِنَ ٱلطِّينِ كَهَيۡـَٔةِ ٱلطَّيۡرِ بِإِذۡنِي فَتَنفُخُ فِيهَا فَتَكُونُ طَيۡرَۢا بِإِذۡنِيۖ وَتُبۡرِئُ ٱلۡأَكۡمَهَ وَٱلۡأَبۡرَصَ بِإِذۡنِيۖ وَإِذۡ تُخۡرِجُ ٱلۡمَوۡتَىٰ بِإِذۡنِيۖ وَإِذۡ كَفَفۡتُ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ عَنكَ إِذۡ جِئۡتَهُم بِٱلۡبَيِّنَٰتِ فَقَالَ ٱلَّذِينَ كَفَرُواْ مِنۡهُمۡ إِنۡ هَٰذَآ إِلَّا سِحۡرٞ مُّبِينٞ ﴾
[المَائدة: 110]

(జ్ఞాపకముంచుకోండి!) అప్పుడు (పునరుత్థాన దినమున), అల్లాహ్: "ఓ మర్యమ్ కుమారుడా! ఈసా (ఏసు) నేను నీకు మరియు నీ తల్లికి ప్రసాదించిన అనుగ్రహాన్ని జ్ఞాపకం చేసుకో! నేను పరిశుద్ధాత్మ (రూహుల్ ఖుదుస్) ద్వారా నిన్ను బలపరిచాను, నీవు ఉయ్యాలలోనూ మరియు యుక్తవయస్సులోనూ ప్రజలతో మాట్లాడేవాడివి. మరియు నేను గ్రంథాన్ని మరియు వివేకాన్ని, తౌరాతును మరియు ఇంజీలును నీకు నేర్పాను. మరియు నీవు నా ఆజ్ఞతో పక్షి ఆకారం గల మట్టి బొమ్మను తయారు చేసి, దానిలో ఊదినపుడు, నా ఆజ్ఞతో అది పక్షిగా మారి పోయేది. మరియు నీవు పుట్టుగ్రుడ్డిని మరియు కుష్ఠురోగిని నా ఆజ్ఞతో బాగు చేసేవాడివి. మరియు నీవు నా ఆజ్ఞతో మృతులను లేపేవాడివి. మరియు నీవు స్పష్టమైన సూచనలతో ఇస్రాయీలు సంతతి వారి వద్దకు వచ్చినపుడు, వారిలోని సత్యతిరస్కారులు: "ఇది స్పష్టమైన మాయాజాలం తప్ప మరేమీ కాదు!" అని అన్నారు. అప్పుడు నేను వారి కుట్ర నుండి నిన్ను కాపాడాను

❮ Previous Next ❯

ترجمة: إذ قال الله ياعيسى ابن مريم اذكر نعمتي عليك وعلى والدتك إذ, باللغة التيلجو

﴿إذ قال الله ياعيسى ابن مريم اذكر نعمتي عليك وعلى والدتك إذ﴾ [المَائدة: 110]

Abdul Raheem Mohammad Moulana
(Jnapakamuncukondi!) Appudu (punarut'thana dinamuna), allah: "O maryam kumaruda! Isa (esu) nenu niku mariyu ni talliki prasadincina anugrahanni jnapakam cesuko! Nenu parisud'dhatma (ruhul khudus) dvara ninnu balaparicanu, nivu uyyalalonu mariyu yuktavayas'sulonu prajalato matladevadivi. Mariyu nenu granthanni mariyu vivekanni, tauratunu mariyu injilunu niku nerpanu. Mariyu nivu na ajnato paksi akaram gala matti bom'manu tayaru cesi, danilo udinapudu, na ajnato adi paksiga mari poyedi. Mariyu nivu puttugruddini mariyu kusthurogini na ajnato bagu cesevadivi. Mariyu nivu na ajnato mrtulanu lepevadivi. Mariyu nivu spastamaina sucanalato israyilu santati vari vaddaku vaccinapudu, variloni satyatiraskarulu: "Idi spastamaina mayajalam tappa maremi kadu!" Ani annaru. Appudu nenu vari kutra nundi ninnu kapadanu
Abdul Raheem Mohammad Moulana
(Jñāpakamun̄cukōṇḍi!) Appuḍu (punarut'thāna dinamuna), allāh: "Ō maryam kumāruḍā! Īsā (ēsu) nēnu nīku mariyu nī talliki prasādin̄cina anugrahānni jñāpakaṁ cēsukō! Nēnu pariśud'dhātma (rūhul khudus) dvārā ninnu balaparicānu, nīvu uyyālalōnū mariyu yuktavayas'sulōnū prajalatō māṭlāḍēvāḍivi. Mariyu nēnu granthānni mariyu vivēkānni, taurātunu mariyu in̄jīlunu nīku nērpānu. Mariyu nīvu nā ājñatō pakṣi ākāraṁ gala maṭṭi bom'manu tayāru cēsi, dānilō ūdinapuḍu, nā ājñatō adi pakṣigā māri pōyēdi. Mariyu nīvu puṭṭugruḍḍini mariyu kuṣṭhurōgini nā ājñatō bāgu cēsēvāḍivi. Mariyu nīvu nā ājñatō mr̥tulanu lēpēvāḍivi. Mariyu nīvu spaṣṭamaina sūcanalatō isrāyīlu santati vāri vaddaku vaccinapuḍu, vārilōni satyatiraskārulu: "Idi spaṣṭamaina māyājālaṁ tappa marēmī kādu!" Ani annāru. Appuḍu nēnu vāri kuṭra nuṇḍi ninnu kāpāḍānu
Muhammad Aziz Ur Rehman
అప్పుడు అల్లాహ్‌ ఈ విధంగా అడుగుతాడు : “మర్యమ్‌ కుమారుడవైన ఓ ఈసా! నేను నీకూ, నీ తల్లికి ప్రసాదించిన అనుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకో. అప్పుడు రూహుల్‌ ఖుదుస్‌ ద్వారా నేను నీకు సహాయం చేశాను. నీవు ఊయలలో ఉన్నప్పుడు, పెద్దవాడైన తరువాత కూడా ప్రజలతో మాట్లాడేవాడివి. అప్పుడు నేను నీకు గ్రంథాన్నీ, వివేకాన్నీ తౌరాతునూ, ఇంజీలునూ నేర్పాను. అప్పుడు నీవు నా అనుమతితో, మట్టితో పక్షి ఆకారం లాంటి దాన్ని తయారుచేసి, అందులోకి ఊదగానే నా అనుమతితో అది (నిజంగానే) పక్షి అయిపోయేది. అలాగే నీవు నా అనుమతితో పుట్టుగుడ్డినీ, కుష్టు రోగినీ బాగుచేసేవాడివి. నా అనుమతితో మృతులను లేపి నిలబెట్టే వాడివి. నీవు స్పష్టమైన నిదర్శనాలతో ఇస్రాయీలు వంశీయుల వద్దకు వచ్చినపుడు, ‘ఇది స్పష్టమైన మాయాజాలం తప్ప మరేమీ కాదు’ అని వారిలోని సత్య తిరస్కారులు చెప్పారు. ఆ సమయంలో మేము వారిని నీ నుంచి ఆపాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek