×

మరియు వాస్తవానికి అల్లాహ్ ఇస్రాయీలు సంతతి వారి నుండి దృఢమైన ప్రమాణాన్ని తీసుకున్నాడు. మరియు మేము 5:12 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:12) ayat 12 in Telugu

5:12 Surah Al-Ma’idah ayat 12 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 12 - المَائدة - Page - Juz 6

﴿۞ وَلَقَدۡ أَخَذَ ٱللَّهُ مِيثَٰقَ بَنِيٓ إِسۡرَٰٓءِيلَ وَبَعَثۡنَا مِنۡهُمُ ٱثۡنَيۡ عَشَرَ نَقِيبٗاۖ وَقَالَ ٱللَّهُ إِنِّي مَعَكُمۡۖ لَئِنۡ أَقَمۡتُمُ ٱلصَّلَوٰةَ وَءَاتَيۡتُمُ ٱلزَّكَوٰةَ وَءَامَنتُم بِرُسُلِي وَعَزَّرۡتُمُوهُمۡ وَأَقۡرَضۡتُمُ ٱللَّهَ قَرۡضًا حَسَنٗا لَّأُكَفِّرَنَّ عَنكُمۡ سَيِّـَٔاتِكُمۡ وَلَأُدۡخِلَنَّكُمۡ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُۚ فَمَن كَفَرَ بَعۡدَ ذَٰلِكَ مِنكُمۡ فَقَدۡ ضَلَّ سَوَآءَ ٱلسَّبِيلِ ﴾
[المَائدة: 12]

మరియు వాస్తవానికి అల్లాహ్ ఇస్రాయీలు సంతతి వారి నుండి దృఢమైన ప్రమాణాన్ని తీసుకున్నాడు. మరియు మేము వారిలో నుండి పన్నెండు మందిని (కనాన్ కు) పోవటానికి నాయకులుగా నియమించాము. మరియు అల్లాహ్ వారితో ఇలా అన్నాడు: "ఒకవేళ మీరు నమాజ్ స్థిరంగా సలుపుతూ, విధి దానం (జకాత్) చెల్లిస్తూ మరియు నా ప్రవక్తలను విశ్వసించి వారికి తోడ్పడుతూ, అల్లాహ్ కు మంచి రుణాన్ని ఇస్తూ వుంటే! నిశ్చయంగా, నేను మీకు తోడుగా ఉంటాను. మరియు నిశ్చయంగా, నేను మీ నుండి మీ పాపాలను తొలగిస్తాను మరియు నిశ్చయంగా మిమ్మల్ని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాను. కానీ, దీని తరువాత మీలో ఎవడు సత్యతిరస్కార వైఖరిని అవలంబిస్తాడో! అతడు వాస్తవంగా, సరైన మార్గం నుండి తప్పి పోయిన వాడే

❮ Previous Next ❯

ترجمة: ولقد أخذ الله ميثاق بني إسرائيل وبعثنا منهم اثني عشر نقيبا وقال, باللغة التيلجو

﴿ولقد أخذ الله ميثاق بني إسرائيل وبعثنا منهم اثني عشر نقيبا وقال﴾ [المَائدة: 12]

Abdul Raheem Mohammad Moulana
mariyu vastavaniki allah israyilu santati vari nundi drdhamaina pramananni tisukunnadu. Mariyu memu varilo nundi pannendu mandini (kanan ku) povataniki nayakuluga niyamincamu. Mariyu allah varito ila annadu: "Okavela miru namaj sthiranga saluputu, vidhi danam (jakat) cellistu mariyu na pravaktalanu visvasinci variki todpadutu, allah ku manci runanni istu vunte! Niscayanga, nenu miku toduga untanu. Mariyu niscayanga, nenu mi nundi mi papalanu tolagistanu mariyu niscayanga mim'malni krinda kaluvalu pravahince svargavanalalo pravesimpajestanu. Kani, dini taruvata milo evadu satyatiraskara vaikharini avalambistado! Atadu vastavanga, saraina margam nundi tappi poyina vade
Abdul Raheem Mohammad Moulana
mariyu vāstavāniki allāh isrāyīlu santati vāri nuṇḍi dr̥ḍhamaina pramāṇānni tīsukunnāḍu. Mariyu mēmu vārilō nuṇḍi panneṇḍu mandini (kanān ku) pōvaṭāniki nāyakulugā niyamin̄cāmu. Mariyu allāh vāritō ilā annāḍu: "Okavēḷa mīru namāj sthiraṅgā saluputū, vidhi dānaṁ (jakāt) cellistū mariyu nā pravaktalanu viśvasin̄ci vāriki tōḍpaḍutū, allāh ku man̄ci ruṇānni istū vuṇṭē! Niścayaṅgā, nēnu mīku tōḍugā uṇṭānu. Mariyu niścayaṅgā, nēnu mī nuṇḍi mī pāpālanu tolagistānu mariyu niścayaṅgā mim'malni krinda kāluvalu pravahin̄cē svargavanālalō pravēśimpajēstānu. Kānī, dīni taruvāta mīlō evaḍu satyatiraskāra vaikharini avalambistāḍō! Ataḍu vāstavaṅgā, saraina mārgaṁ nuṇḍi tappi pōyina vāḍē
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ ఇస్రాయీల్‌ సంతతి నుండి గట్టి వాగ్దానాన్ని తీసుకున్నాడు. వారిలో నుంచే పన్నెండు మంది నాయకులను మేము నియమించాము. ఇంకా అల్లాహ్‌ వారితో ఇలా అన్నాడు: “నిశ్చయంగా నేను మీకు తోడుగా ఉన్నాను. మీరు గనక నమాజును నెలకొల్పుతూ ఉంటే, జకాత్‌ ఇస్తూ ఉంటే, నా ప్రవక్తలను విశ్వసిస్తూ, వారిని గౌరవించి వారికి సహాయ పడితే, అల్లాహ్‌కు ఉత్తమ రుణాన్ని ఇస్తూ ఉంటే నేను మీ చెడుగులను మీ నుంచి దూరం చేస్తాను. క్రింద సెలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలలోకి మిమ్మల్ని తీసుకుపోతాను. ఈ ప్రమాణం తరువాత కూడా మీలో ఎవడైనా తిరస్కార వైఖరికి పాల్పడితే అతడు రుజుమార్గం (సవావుస్సబీల్‌) నుంచి తప్పిపోయాడు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek