×

మరియు (ఓ ప్రవక్తా!) మేము ఈ గ్రంథాన్ని నీపై సత్యంతో అవతరింపజేశాము. ఇది పూర్వ గ్రంథాలలో 5:48 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:48) ayat 48 in Telugu

5:48 Surah Al-Ma’idah ayat 48 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 48 - المَائدة - Page - Juz 6

﴿وَأَنزَلۡنَآ إِلَيۡكَ ٱلۡكِتَٰبَ بِٱلۡحَقِّ مُصَدِّقٗا لِّمَا بَيۡنَ يَدَيۡهِ مِنَ ٱلۡكِتَٰبِ وَمُهَيۡمِنًا عَلَيۡهِۖ فَٱحۡكُم بَيۡنَهُم بِمَآ أَنزَلَ ٱللَّهُۖ وَلَا تَتَّبِعۡ أَهۡوَآءَهُمۡ عَمَّا جَآءَكَ مِنَ ٱلۡحَقِّۚ لِكُلّٖ جَعَلۡنَا مِنكُمۡ شِرۡعَةٗ وَمِنۡهَاجٗاۚ وَلَوۡ شَآءَ ٱللَّهُ لَجَعَلَكُمۡ أُمَّةٗ وَٰحِدَةٗ وَلَٰكِن لِّيَبۡلُوَكُمۡ فِي مَآ ءَاتَىٰكُمۡۖ فَٱسۡتَبِقُواْ ٱلۡخَيۡرَٰتِۚ إِلَى ٱللَّهِ مَرۡجِعُكُمۡ جَمِيعٗا فَيُنَبِّئُكُم بِمَا كُنتُمۡ فِيهِ تَخۡتَلِفُونَ ﴾
[المَائدة: 48]

మరియు (ఓ ప్రవక్తా!) మేము ఈ గ్రంథాన్ని నీపై సత్యంతో అవతరింపజేశాము. ఇది పూర్వ గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాన్ని ధృవపరుస్తుంది. మరియు వాటిలో ఉన్న సత్యాసత్యాలను పరిష్కరిస్తుంది. కావున నీవు, అల్లాహ్ అవతరింపజేసిన ఈ శాసనం ప్రకారం వారి మధ్య తీర్పు చెయ్యి. మరియు నీ వద్దకు వచ్చిన సత్యాన్ని విడిచి వారి కోరికలను అనుసరించకు. మీలో ప్రతి ఒక్క సంఘానికి ఒక ధర్మశాసనాన్ని మరియు ఒక జీవన మార్గాన్ని నియమించి ఉన్నాము. ఒకవేళ అల్లాహ్ తలుచుకుంటే, మిమ్మల్ని అంతా ఒకే ఒక సంఘంగా రూపొందించి ఉండేవాడు. కాని మీకు ఇచ్చిన దానితో (ధర్మంతో) మిమ్మల్ని పరీక్షించటానికి (ఇలా చేశాడు). కావున మీరు మంచి పనులు చేయటంలో ఒకరితో నొకరు పోటీ పడండి. అల్లాహ్ వద్దకే మీరందరూ మరలిపోవలసి వుంది. అప్పుడు ఆయన మీకున్న భేదాభిప్రాయాలను గురించి మీకు తెలియజేస్తాడు

❮ Previous Next ❯

ترجمة: وأنـزلنا إليك الكتاب بالحق مصدقا لما بين يديه من الكتاب ومهيمنا عليه, باللغة التيلجو

﴿وأنـزلنا إليك الكتاب بالحق مصدقا لما بين يديه من الكتاب ومهيمنا عليه﴾ [المَائدة: 48]

Abdul Raheem Mohammad Moulana
mariyu (o pravakta!) Memu i granthanni nipai satyanto avatarimpajesamu. Idi purva granthalalo migili unna satyanni dhrvaparustundi. Mariyu vatilo unna satyasatyalanu pariskaristundi. Kavuna nivu, allah avatarimpajesina i sasanam prakaram vari madhya tirpu ceyyi. Mariyu ni vaddaku vaccina satyanni vidici vari korikalanu anusarincaku. Milo prati okka sanghaniki oka dharmasasananni mariyu oka jivana marganni niyaminci unnamu. Okavela allah talucukunte, mim'malni anta oke oka sanghanga rupondinci undevadu. Kani miku iccina danito (dharmanto) mim'malni pariksincataniki (ila cesadu). Kavuna miru manci panulu ceyatanlo okarito nokaru poti padandi. Allah vaddake mirandaru maralipovalasi vundi. Appudu ayana mikunna bhedabhiprayalanu gurinci miku teliyajestadu
Abdul Raheem Mohammad Moulana
mariyu (ō pravaktā!) Mēmu ī granthānni nīpai satyantō avatarimpajēśāmu. Idi pūrva granthālalō migili unna satyānni dhr̥vaparustundi. Mariyu vāṭilō unna satyāsatyālanu pariṣkaristundi. Kāvuna nīvu, allāh avatarimpajēsina ī śāsanaṁ prakāraṁ vāri madhya tīrpu ceyyi. Mariyu nī vaddaku vaccina satyānni viḍici vāri kōrikalanu anusarin̄caku. Mīlō prati okka saṅghāniki oka dharmaśāsanānni mariyu oka jīvana mārgānni niyamin̄ci unnāmu. Okavēḷa allāh talucukuṇṭē, mim'malni antā okē oka saṅghaṅgā rūpondin̄ci uṇḍēvāḍu. Kāni mīku iccina dānitō (dharmantō) mim'malni parīkṣin̄caṭāniki (ilā cēśāḍu). Kāvuna mīru man̄ci panulu cēyaṭanlō okaritō nokaru pōṭī paḍaṇḍi. Allāh vaddakē mīrandarū maralipōvalasi vundi. Appuḍu āyana mīkunna bhēdābhiprāyālanu gurin̄ci mīku teliyajēstāḍu
Muhammad Aziz Ur Rehman
ఇంకా (ఓ ప్రవక్తా!) మేము నీ వైపుకు ఈ గ్రంథాన్ని సత్య సమేతంగా అవతరింపజేశాము. అది తనకన్నా ముందు వచ్చిన గ్రంథాలను సత్యమని ధృవీకరిస్తుంది, వాటిని పరిరక్షిస్తుంది. కాబట్టి నువ్వు వారి పరస్పర వ్యవహారాలపై అల్లాహ్‌ అవతరింపజేసిన ఈ గ్రంథానికనుగుణంగానే తీర్పు చెయ్యి. నీ వద్దకు వచ్చిన ఈ సత్యాన్ని వీడి, వారి మనోవాంఛలను అనుసరించకు. మీలో ప్రతి ఒక్కరి కోసం మేము ఒక విధానాన్ని, మార్గాన్నీ నిర్ధారించాము. అల్లాహ్‌యే గనక తలిస్తే మీ అందరినీ ఒకే సమాజంగా చేసి ఉండేవాడు. అయితే మీకు వొసగబడిన దానిలో మిమ్మల్ని పరీక్షించాలన్నది ఆయన అభిలాష. కాబట్టి మీరు సత్కార్యాలు చేయటంలో త్వరపడండి. మీరంతా మరలిపోవలసింది అల్లాహ్‌ వైపుకే. ఆ తరువాత ఆయన, మీరు పరస్పరం విభేదించుకునే విషయాల గురించి మీకు (తన తీర్పు) తెలియజేస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek