×

ఓ విశ్వాసులారా! మీరు నమాజ్ కు లేచి నపుడు, మీ ముఖాలను, మరియు మీ చేతులను 5:6 Telugu translation

Quran infoTeluguSurah Al-Ma’idah ⮕ (5:6) ayat 6 in Telugu

5:6 Surah Al-Ma’idah ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Ma’idah ayat 6 - المَائدة - Page - Juz 6

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِذَا قُمۡتُمۡ إِلَى ٱلصَّلَوٰةِ فَٱغۡسِلُواْ وُجُوهَكُمۡ وَأَيۡدِيَكُمۡ إِلَى ٱلۡمَرَافِقِ وَٱمۡسَحُواْ بِرُءُوسِكُمۡ وَأَرۡجُلَكُمۡ إِلَى ٱلۡكَعۡبَيۡنِۚ وَإِن كُنتُمۡ جُنُبٗا فَٱطَّهَّرُواْۚ وَإِن كُنتُم مَّرۡضَىٰٓ أَوۡ عَلَىٰ سَفَرٍ أَوۡ جَآءَ أَحَدٞ مِّنكُم مِّنَ ٱلۡغَآئِطِ أَوۡ لَٰمَسۡتُمُ ٱلنِّسَآءَ فَلَمۡ تَجِدُواْ مَآءٗ فَتَيَمَّمُواْ صَعِيدٗا طَيِّبٗا فَٱمۡسَحُواْ بِوُجُوهِكُمۡ وَأَيۡدِيكُم مِّنۡهُۚ مَا يُرِيدُ ٱللَّهُ لِيَجۡعَلَ عَلَيۡكُم مِّنۡ حَرَجٖ وَلَٰكِن يُرِيدُ لِيُطَهِّرَكُمۡ وَلِيُتِمَّ نِعۡمَتَهُۥ عَلَيۡكُمۡ لَعَلَّكُمۡ تَشۡكُرُونَ ﴾
[المَائدة: 6]

ఓ విశ్వాసులారా! మీరు నమాజ్ కు లేచి నపుడు, మీ ముఖాలను, మరియు మీ చేతులను మోచేతుల వరకు కడుక్కోండి. మరియు మీ తలలను (తడి చేతులతో) తుడుచుకోండి. మరియు మీ కాళ్ళను చీలమండల వరకు కడుక్కోండి. మరియు మీకు ఇంద్రియ స్ఖలనం (జునుబ్) అయి ఉంటే, స్నానం (గుస్ల్) చేయండి. మరియు మీరు అస్వస్థులై ఉన్నా, లేక ప్రయాణంలో ఉన్నా, లేక మీలో ఎవరైనా కాలకృత్యాలు తీర్చుకొని ఉన్నా, లేక మీరు స్త్రీలతో కలిసి (సంభోగం చేసి) ఉన్నా, అప్పుడు మీకు నీరు లభించని పక్షంలో పరిశుభ్రమైన మట్టితో తయమ్మమ్ చేయండి. అంటే మీ ముఖాలను మరియు మీ చేతులను, దానితో (పరిశుద్ధమైన మట్టిపై స్పర్శించిన చేతులతో) రుద్దుకోండి. మిమ్మల్ని కష్టపెట్టాలనేది అల్లాహ్ అభిమతం కాదు. మీరు కృతజ్ఞులు కావాలని ఆయన, మిమ్మల్ని శుద్ధపరచి మీపై తన అనుగ్రహాన్ని పూర్తి చేయగోరుతున్నాడు

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا إذا قمتم إلى الصلاة فاغسلوا وجوهكم وأيديكم إلى المرافق, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا إذا قمتم إلى الصلاة فاغسلوا وجوهكم وأيديكم إلى المرافق﴾ [المَائدة: 6]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Miru namaj ku leci napudu, mi mukhalanu, mariyu mi cetulanu mocetula varaku kadukkondi. Mariyu mi talalanu (tadi cetulato) tuducukondi. Mariyu mi kallanu cilamandala varaku kadukkondi. Mariyu miku indriya skhalanam (junub) ayi unte, snanam (gusl) ceyandi. Mariyu miru asvasthulai unna, leka prayananlo unna, leka milo evaraina kalakrtyalu tircukoni unna, leka miru strilato kalisi (sambhogam cesi) unna, appudu miku niru labhincani paksanlo parisubhramaina mattito tayam'mam ceyandi. Ante mi mukhalanu mariyu mi cetulanu, danito (parisud'dhamaina mattipai sparsincina cetulato) ruddukondi. Mim'malni kastapettalanedi allah abhimatam kadu. Miru krtajnulu kavalani ayana, mim'malni sud'dhaparaci mipai tana anugrahanni purti ceyagorutunnadu
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Mīru namāj ku lēci napuḍu, mī mukhālanu, mariyu mī cētulanu mōcētula varaku kaḍukkōṇḍi. Mariyu mī talalanu (taḍi cētulatō) tuḍucukōṇḍi. Mariyu mī kāḷḷanu cīlamaṇḍala varaku kaḍukkōṇḍi. Mariyu mīku indriya skhalanaṁ (junub) ayi uṇṭē, snānaṁ (gusl) cēyaṇḍi. Mariyu mīru asvasthulai unnā, lēka prayāṇanlō unnā, lēka mīlō evarainā kālakr̥tyālu tīrcukoni unnā, lēka mīru strīlatō kalisi (sambhōgaṁ cēsi) unnā, appuḍu mīku nīru labhin̄cani pakṣanlō pariśubhramaina maṭṭitō tayam'mam cēyaṇḍi. Aṇṭē mī mukhālanu mariyu mī cētulanu, dānitō (pariśud'dhamaina maṭṭipai sparśin̄cina cētulatō) ruddukōṇḍi. Mim'malni kaṣṭapeṭṭālanēdi allāh abhimataṁ kādu. Mīru kr̥tajñulu kāvālani āyana, mim'malni śud'dhaparaci mīpai tana anugrahānni pūrti cēyagōrutunnāḍu
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వసించినవారలారా! మీరు నమాజు కొరకు లేచినప్పుడు మీ మొహాలను, మోచేతుల సమేతంగా మీ చేతులను కడుక్కోండి. మీ తలలను మసహ్‌ చేయండి, చీలమండల వరకు మీ కాళ్ళను కడుక్కోండి. ఒకవేళ మీరు లైంగిక అశుద్ధావస్థకు లోనవుతే స్నానం చేసి పరిశుద్ధులు అవ్వండి. ఒకవేళ మీరు వ్యాధిగ్రస్తులైతే లేక ప్రయాణావస్థలో ఉంటే లేక మీలో ఎవరయినా కాలకృత్యాలు తీర్చుకుని వస్తే లేక మీరు స్త్రీలతో సమాగమం జరిపి ఉంటే – అట్టి పరిస్థితిలో – నీరు లభ్యం కాకపోతే పరిశుభ్రమైన మట్టితో ‘తయమ్ముమ్‌’ చేసుకోండి. దాన్ని మీ మొహాలపై, చేతులపై తుడుచుకోండి. అల్లాహ్‌ మిమ్మల్ని ఎలాంటి ఇబ్బందికీ గురి చేయదలచుకోడు. మీరు కృతజ్ఞులయ్యేందుకు మిమ్మల్ని పరిశుద్ధులుగా చేసి, మీపై తన అనుగ్రహాన్ని సంపూర్ణం గావించాలన్నదే ఆయన అభిలాష
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek