×

గ్రంథ ప్రజలలోని సత్యతిరస్కారులను మొదట సమీకరించిన (బనూ నదీర్ తెగ) వారిని, వారి గృహాల నుండి 59:2 Telugu translation

Quran infoTeluguSurah Al-hashr ⮕ (59:2) ayat 2 in Telugu

59:2 Surah Al-hashr ayat 2 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hashr ayat 2 - الحَشر - Page - Juz 28

﴿هُوَ ٱلَّذِيٓ أَخۡرَجَ ٱلَّذِينَ كَفَرُواْ مِنۡ أَهۡلِ ٱلۡكِتَٰبِ مِن دِيَٰرِهِمۡ لِأَوَّلِ ٱلۡحَشۡرِۚ مَا ظَنَنتُمۡ أَن يَخۡرُجُواْۖ وَظَنُّوٓاْ أَنَّهُم مَّانِعَتُهُمۡ حُصُونُهُم مِّنَ ٱللَّهِ فَأَتَىٰهُمُ ٱللَّهُ مِنۡ حَيۡثُ لَمۡ يَحۡتَسِبُواْۖ وَقَذَفَ فِي قُلُوبِهِمُ ٱلرُّعۡبَۚ يُخۡرِبُونَ بُيُوتَهُم بِأَيۡدِيهِمۡ وَأَيۡدِي ٱلۡمُؤۡمِنِينَ فَٱعۡتَبِرُواْ يَٰٓأُوْلِي ٱلۡأَبۡصَٰرِ ﴾
[الحَشر: 2]

గ్రంథ ప్రజలలోని సత్యతిరస్కారులను మొదట సమీకరించిన (బనూ నదీర్ తెగ) వారిని, వారి గృహాల నుండి వెళ్లగొట్టినవాడు ఆయనే. వారు వెళ్ళిపోతారని మీరు ఏ మాత్రం భావించలేదు. మరియు అల్లాహ్ నుండి తమను తమ కోటలు తప్పక రక్షిస్తాయని వారు భావించారు! కాని అల్లాహ్ (శిక్ష) వారు ఊహించని వైపు నుండి, వారిపై వచ్చి పడింది. మరియు ఆయన వారి హృదయాలలో భయం కలుగజేశాడు, కావున వారు తమ ఇండ్లను తమ చేతులారా మరియు విశ్వాసుల చేతులతో కూడా, నాశనం చేయించుకున్నారు. కావున ఓ పరిజ్ఞానం (కళ్ళు) గల వారలారా! గుణపాఠం నేర్చుకోండి

❮ Previous Next ❯

ترجمة: هو الذي أخرج الذين كفروا من أهل الكتاب من ديارهم لأول الحشر, باللغة التيلجو

﴿هو الذي أخرج الذين كفروا من أهل الكتاب من ديارهم لأول الحشر﴾ [الحَشر: 2]

Abdul Raheem Mohammad Moulana
Grantha prajalaloni satyatiraskarulanu modata samikarincina (banu nadir tega) varini, vari grhala nundi vellagottinavadu ayane. Varu vellipotarani miru e matram bhavincaledu. Mariyu allah nundi tamanu tama kotalu tappaka raksistayani varu bhavincaru! Kani allah (siksa) varu uhincani vaipu nundi, varipai vacci padindi. Mariyu ayana vari hrdayalalo bhayam kalugajesadu, kavuna varu tama indlanu tama cetulara mariyu visvasula cetulato kuda, nasanam ceyincukunnaru. Kavuna o parijnanam (kallu) gala varalara! Gunapatham nercukondi
Abdul Raheem Mohammad Moulana
Grantha prajalalōni satyatiraskārulanu modaṭa samīkarin̄cina (banū nadīr tega) vārini, vāri gr̥hāla nuṇḍi veḷlagoṭṭinavāḍu āyanē. Vāru veḷḷipōtārani mīru ē mātraṁ bhāvin̄calēdu. Mariyu allāh nuṇḍi tamanu tama kōṭalu tappaka rakṣistāyani vāru bhāvin̄cāru! Kāni allāh (śikṣa) vāru ūhin̄cani vaipu nuṇḍi, vāripai vacci paḍindi. Mariyu āyana vāri hr̥dayālalō bhayaṁ kalugajēśāḍu, kāvuna vāru tama iṇḍlanu tama cētulārā mariyu viśvāsula cētulatō kūḍā, nāśanaṁ cēyin̄cukunnāru. Kāvuna ō parijñānaṁ (kaḷḷu) gala vāralārā! Guṇapāṭhaṁ nērcukōṇḍi
Muhammad Aziz Ur Rehman
ఆయనే గ్రంథవహులలోని అవిశ్వాసులను వారి ఇండ్ల నుండి తొలి (సారి) సమీకరణలోనే తీసివేశాడు. వారు వెళ్లి పోతారని మీరు (సయితం) ఊహించలేదు. (పటిష్టమైన) తమ కోటలు తమను అల్లాహ్ (దెబ్బ) నుండి రక్షిస్తాయని వారు అనుకున్నారు. అయితే వారు ఊహించని చోటు నుంచి అల్లాహ్ దెబ్బ వారిపై విరుచుకుపడింది. ఇంకా అల్లాహ్ వారి గుండెల్లో దడ పుట్టించాడు. వారు తమ ఇండ్లను చేజేతులా కొల్లగొట్టసాగారు. ముస్లింల చేతుల మీదుగా కూడా (ధ్వంసం చేయించుకున్నారు). కాబట్టి ఓ కళ్ళున్నవారలారా! దీని ద్వారా గుణపాఠం నేర్చుకోండి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek