×

ఓ విశ్వాసులారా! విశ్వసించిన స్త్రీలు, మీ వద్దకు వలస వచ్చినపుడు, వారిని పరీక్షించండి. అల్లాహ్ కు 60:10 Telugu translation

Quran infoTeluguSurah Al-Mumtahanah ⮕ (60:10) ayat 10 in Telugu

60:10 Surah Al-Mumtahanah ayat 10 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mumtahanah ayat 10 - المُمتَحنَة - Page - Juz 28

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِذَا جَآءَكُمُ ٱلۡمُؤۡمِنَٰتُ مُهَٰجِرَٰتٖ فَٱمۡتَحِنُوهُنَّۖ ٱللَّهُ أَعۡلَمُ بِإِيمَٰنِهِنَّۖ فَإِنۡ عَلِمۡتُمُوهُنَّ مُؤۡمِنَٰتٖ فَلَا تَرۡجِعُوهُنَّ إِلَى ٱلۡكُفَّارِۖ لَا هُنَّ حِلّٞ لَّهُمۡ وَلَا هُمۡ يَحِلُّونَ لَهُنَّۖ وَءَاتُوهُم مَّآ أَنفَقُواْۚ وَلَا جُنَاحَ عَلَيۡكُمۡ أَن تَنكِحُوهُنَّ إِذَآ ءَاتَيۡتُمُوهُنَّ أُجُورَهُنَّۚ وَلَا تُمۡسِكُواْ بِعِصَمِ ٱلۡكَوَافِرِ وَسۡـَٔلُواْ مَآ أَنفَقۡتُمۡ وَلۡيَسۡـَٔلُواْ مَآ أَنفَقُواْۚ ذَٰلِكُمۡ حُكۡمُ ٱللَّهِ يَحۡكُمُ بَيۡنَكُمۡۖ وَٱللَّهُ عَلِيمٌ حَكِيمٞ ﴾
[المُمتَحنَة: 10]

ఓ విశ్వాసులారా! విశ్వసించిన స్త్రీలు, మీ వద్దకు వలస వచ్చినపుడు, వారిని పరీక్షించండి. అల్లాహ్ కు వారి విశ్వాసం గురించి బాగా తెలుసు. వారు వాస్తవంగా విశ్వసించిన వారని మీకు తెలిసినప్పుడు, వారిని సత్యతిరస్కారుల వద్దకు తిరిగి పంపకండి. (ఎందుకంటే) ఆ స్త్రీలు వారికి (సత్యతిరస్కారులకు) ధర్మసమ్మతమైన (భార్యలు) కారు మరియు వారు కూడా ఆ స్త్రీలకు ధర్మసమ్మతమైన (భర్తలు) కారు. కాని, వారు (సత్యతిరస్కారులు), వారికిచ్చిన (మహ్ర్) మీరు వారికి చెల్లించండి మరియు వారికి వారి మహ్ర్ ఇచ్చిన తరువాత, ఆ స్త్రీలను వివాహమాడితే మీకు ఎలాంటి దోషం లేదు. మరియు మీరు కూడా సత్యతిరస్కారులైన స్త్రీలను మీ వివాహబంధంలో ఉంచుకోకండి. (అవిశ్వాసులుగా ఉండి పోదలచిన) మీ భార్యల నుండి మీరు ఇచ్చిన మహర్ అడిగి తీసుకోండి. (అలాగే అవిశ్వాసులను, విశ్వాసులైన తమ) భార్యల నుండి మహ్ర్ అడిగి తీసుకోనివ్వండి. ఇది అల్లాహ్ తీర్మానం. ఆయన ఈ విధంగా మీ మధ్య తీర్పు చేస్తున్నాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا إذا جاءكم المؤمنات مهاجرات فامتحنوهن الله أعلم بإيمانهن فإن, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا إذا جاءكم المؤمنات مهاجرات فامتحنوهن الله أعلم بإيمانهن فإن﴾ [المُمتَحنَة: 10]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Visvasincina strilu, mi vaddaku valasa vaccinapudu, varini pariksincandi. Allah ku vari visvasam gurinci baga telusu. Varu vastavanga visvasincina varani miku telisinappudu, varini satyatiraskarula vaddaku tirigi pampakandi. (Endukante) a strilu variki (satyatiraskarulaku) dharmasam'matamaina (bharyalu) karu mariyu varu kuda a strilaku dharmasam'matamaina (bhartalu) karu. Kani, varu (satyatiraskarulu), varikiccina (mahr) miru variki cellincandi mariyu variki vari mahr iccina taruvata, a strilanu vivahamadite miku elanti dosam ledu. Mariyu miru kuda satyatiraskarulaina strilanu mi vivahabandhanlo uncukokandi. (Avisvasuluga undi podalacina) mi bharyala nundi miru iccina mahar adigi tisukondi. (Alage avisvasulanu, visvasulaina tama) bharyala nundi mahr adigi tisukonivvandi. Idi allah tirmanam. Ayana i vidhanga mi madhya tirpu cestunnadu. Mariyu allah sarvajnudu, maha vivecanaparudu
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Viśvasin̄cina strīlu, mī vaddaku valasa vaccinapuḍu, vārini parīkṣin̄caṇḍi. Allāh ku vāri viśvāsaṁ gurin̄ci bāgā telusu. Vāru vāstavaṅgā viśvasin̄cina vārani mīku telisinappuḍu, vārini satyatiraskārula vaddaku tirigi pampakaṇḍi. (Endukaṇṭē) ā strīlu vāriki (satyatiraskārulaku) dharmasam'matamaina (bhāryalu) kāru mariyu vāru kūḍā ā strīlaku dharmasam'matamaina (bhartalu) kāru. Kāni, vāru (satyatiraskārulu), vārikiccina (mahr) mīru vāriki cellin̄caṇḍi mariyu vāriki vāri mahr iccina taruvāta, ā strīlanu vivāhamāḍitē mīku elāṇṭi dōṣaṁ lēdu. Mariyu mīru kūḍā satyatiraskārulaina strīlanu mī vivāhabandhanlō un̄cukōkaṇḍi. (Aviśvāsulugā uṇḍi pōdalacina) mī bhāryala nuṇḍi mīru iccina mahar aḍigi tīsukōṇḍi. (Alāgē aviśvāsulanu, viśvāsulaina tama) bhāryala nuṇḍi mahr aḍigi tīsukōnivvaṇḍi. Idi allāh tīrmānaṁ. Āyana ī vidhaṅgā mī madhya tīrpu cēstunnāḍu. Mariyu allāh sarvajñuḍu, mahā vivēcanāparuḍu
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వాసులారా! విశ్వసించిన స్త్రీలు మీ వద్దకు వలస వచ్చినప్పుడు మీరు వారిని పరీక్షించండి. (ఆ విషయానికి వస్తే) వారి విశ్వాసం గురించి అల్లాహ్ కు బాగా తెలుసు. వారు గనక విశ్వాసపాత్రులని మీకు అనిపిస్తే వారిని అవిశ్వాసుల వద్దకు తిప్పి పంపకండి. ఈ స్త్రీలు వారికి ధర్మ సమ్మతం కారు. వారు ఈ స్త్రీలకు కూడా ధర్మ సమ్మతం కాజాలరు. అవిశ్వాసులు ఖర్చు చేసినది వారికి చెల్లించండి. తద్వారా మీరు ఈ స్త్రీలకు మహార్ సొమ్మును చెల్లించి వారిని వివాహమాడటం ఏమాత్రం దోషం కాదు. విశ్వసించని స్త్రీల మానాన్ని మీ వివాహ బంధంలో ఉంచకండి. మీరు ఖర్చుపెట్టినది అడిగి తీసేసుకోండి. అటు అవిశ్వాసులు కూడా వారు ఖర్చు చేసినది అడిగి తీసేసుకోవాలి. ఇది అల్లాహ్ ఆజ్ఞ (తీర్పు). దీన్ని ఆయన మీ మధ్య విధించాడు. అల్లాహ్ మహా జ్ఞాని, మహావివేకి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek