Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 143 - الأعرَاف - Page - Juz 9
﴿وَلَمَّا جَآءَ مُوسَىٰ لِمِيقَٰتِنَا وَكَلَّمَهُۥ رَبُّهُۥ قَالَ رَبِّ أَرِنِيٓ أَنظُرۡ إِلَيۡكَۚ قَالَ لَن تَرَىٰنِي وَلَٰكِنِ ٱنظُرۡ إِلَى ٱلۡجَبَلِ فَإِنِ ٱسۡتَقَرَّ مَكَانَهُۥ فَسَوۡفَ تَرَىٰنِيۚ فَلَمَّا تَجَلَّىٰ رَبُّهُۥ لِلۡجَبَلِ جَعَلَهُۥ دَكّٗا وَخَرَّ مُوسَىٰ صَعِقٗاۚ فَلَمَّآ أَفَاقَ قَالَ سُبۡحَٰنَكَ تُبۡتُ إِلَيۡكَ وَأَنَا۠ أَوَّلُ ٱلۡمُؤۡمِنِينَ ﴾
[الأعرَاف: 143]
﴿ولما جاء موسى لميقاتنا وكلمه ربه قال رب أرني أنظر إليك قال﴾ [الأعرَاف: 143]
Abdul Raheem Mohammad Moulana mariyu musa memu nirnayincina samayaniki (ma nirnita cotuku) vaccinapudu, atani prabhuvu atanito matladadu. (Musa) annadu: "O na prabhu! Naku ni darsana bhagyamivvu (kanipincu). Nenu ninnu cudadalacanu!" (Allah) annadu: "Nivu nannu (e matram) cudalevu! Kani i parvatam vaipuku cudu! Okavela adi tana sthananlo sthiranga undagaligite, appudu nivu nannu cudagalavanuko!" Atani prabhuvu a kondapai tana tejas'sunu prasarimpajeyaga adi bhasmamai poyindi mariyu musa sprha tappi padipoyadu. Telivi vaccina taruvata (musa) annadu: "Nivu sarvalopalaku atitudavu, nenu pascattapanto ni vaipuku maralu tunnanu mariyu nenu visvasincevarilo mottamodati vadanu |
Abdul Raheem Mohammad Moulana mariyu mūsā mēmu nirṇayin̄cina samayāniki (mā nirṇīta cōṭuku) vaccinapuḍu, atani prabhuvu atanitō māṭlāḍāḍu. (Mūsā) annāḍu: "Ō nā prabhū! Nāku nī darśana bhāgyamivvu (kanipin̄cu). Nēnu ninnu cūḍadalacānu!" (Allāh) annāḍu: "Nīvu nannu (ē mātraṁ) cūḍalēvu! Kāni ī parvataṁ vaipuku cūḍu! Okavēḷa adi tana sthānanlō sthiraṅgā uṇḍagaligitē, appuḍu nīvu nannu cūḍagalavanukō!" Atani prabhuvu ā koṇḍapai tana tējas'sunu prasarimpajēyagā adi bhasmamai pōyindi mariyu mūsā spr̥ha tappi paḍipōyāḍu. Telivi vaccina taruvāta (mūsā) annāḍu: "Nīvu sarvalōpālaku atītuḍavu, nēnu paścāttāpantō nī vaipuku maralu tunnānu mariyu nēnu viśvasin̄cēvārilō moṭṭamodaṭi vāḍanu |
Muhammad Aziz Ur Rehman మేము నిర్థారించిన సమయానికి మూసా (అలైహిస్సలాం) వచ్చి, అతని ప్రభువు అతనితో సంభాషించిన తర్వాత అతను, “నా ప్రభూ! నాకు నీ దర్శనం కలిగించు. నేను ఓసారి నిన్ను చూస్తాను” అని విన్నవించుకోగా, “ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు నన్ను చూడలేవు. అయితే అదిగో! ఆ కొండ వైపు దృష్టిని సారించు. అది గనక యధాస్థితిలో ఉండగలిగితే నువ్వు కూడా నన్ను చూడగలుగుతావు” అని ఆయన సెలవిచ్చాడు. ఆ తరువాత అతని ప్రభువు తేజస్సు ఆ కొండపై ప్రసరించగానే ఆ తేజస్సు దాన్ని తుత్తునియలు చేసేసింది. మూసా స్పృహతప్పి పడిపోయాడు. స్పృహలోకి రాగానే, “(ప్రభూ!) నీవు పరమ పవిత్రుడవు. నేను నీ సన్నిధిలో పశ్చాత్తాపపడుతున్నాను. అందరి కన్నా ముందు నేనే నిన్ను విశ్వసిస్తున్నాను” అని మనవి చేసుకున్నాడు |