×

ఇక అల్లాహ్ పై అసత్యాలు కల్పించే వాని కంటే; లేదా ఆయన సూచనలను అసత్యాలని తిరస్కరించే 7:37 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:37) ayat 37 in Telugu

7:37 Surah Al-A‘raf ayat 37 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 37 - الأعرَاف - Page - Juz 8

﴿فَمَنۡ أَظۡلَمُ مِمَّنِ ٱفۡتَرَىٰ عَلَى ٱللَّهِ كَذِبًا أَوۡ كَذَّبَ بِـَٔايَٰتِهِۦٓۚ أُوْلَٰٓئِكَ يَنَالُهُمۡ نَصِيبُهُم مِّنَ ٱلۡكِتَٰبِۖ حَتَّىٰٓ إِذَا جَآءَتۡهُمۡ رُسُلُنَا يَتَوَفَّوۡنَهُمۡ قَالُوٓاْ أَيۡنَ مَا كُنتُمۡ تَدۡعُونَ مِن دُونِ ٱللَّهِۖ قَالُواْ ضَلُّواْ عَنَّا وَشَهِدُواْ عَلَىٰٓ أَنفُسِهِمۡ أَنَّهُمۡ كَانُواْ كَٰفِرِينَ ﴾
[الأعرَاف: 37]

ఇక అల్లాహ్ పై అసత్యాలు కల్పించే వాని కంటే; లేదా ఆయన సూచనలను అసత్యాలని తిరస్కరించే వాని కంటే మించిన దుర్మార్గుడెవడు? అలాంటి వారు తమ విధివ్రాత ప్రకారం తమ భాగ్యాన్ని పొందుతారు. తుదకు మేము పంపే దైవదూతలు వారి ప్రాణాలు తీయటానికి వారి వద్దకు వచ్చి: "మీరు అల్లాహ్ ను వదలి ప్రార్థించేవారు (ఆ దైవాలు) ఇపుడు ఎక్కడున్నారు?" అని అడుగుతారు. వారిలా జవాబిస్తారు: "వారు మమ్మల్ని వదిలి పోయారు." మరియు ఈ విధంగా వారు: "మేము నిజంగానే సత్యతిరస్కారులమై ఉండేవారము." అని తమకు వ్యతిరేకంగా తామే సాక్ష్యమిచ్చుకుంటారు

❮ Previous Next ❯

ترجمة: فمن أظلم ممن افترى على الله كذبا أو كذب بآياته أولئك ينالهم, باللغة التيلجو

﴿فمن أظلم ممن افترى على الله كذبا أو كذب بآياته أولئك ينالهم﴾ [الأعرَاف: 37]

Abdul Raheem Mohammad Moulana
Ika allah pai asatyalu kalpince vani kante; leda ayana sucanalanu asatyalani tiraskarince vani kante mincina durmargudevadu? Alanti varu tama vidhivrata prakaram tama bhagyanni pondutaru. Tudaku memu pampe daivadutalu vari pranalu tiyataniki vari vaddaku vacci: "Miru allah nu vadali prarthincevaru (a daivalu) ipudu ekkadunnaru?" Ani adugutaru. Varila javabistaru: "Varu mam'malni vadili poyaru." Mariyu i vidhanga varu: "Memu nijangane satyatiraskarulamai undevaramu." Ani tamaku vyatirekanga tame saksyamiccukuntaru
Abdul Raheem Mohammad Moulana
Ika allāh pai asatyālu kalpin̄cē vāni kaṇṭē; lēdā āyana sūcanalanu asatyālani tiraskarin̄cē vāni kaṇṭē min̄cina durmārguḍevaḍu? Alāṇṭi vāru tama vidhivrāta prakāraṁ tama bhāgyānni pondutāru. Tudaku mēmu pampē daivadūtalu vāri prāṇālu tīyaṭāniki vāri vaddaku vacci: "Mīru allāh nu vadali prārthin̄cēvāru (ā daivālu) ipuḍu ekkaḍunnāru?" Ani aḍugutāru. Vārilā javābistāru: "Vāru mam'malni vadili pōyāru." Mariyu ī vidhaṅgā vāru: "Mēmu nijaṅgānē satyatiraskārulamai uṇḍēvāramu." Ani tamaku vyatirēkaṅgā tāmē sākṣyamiccukuṇṭāru
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌కు అబద్ధాలను అంటగట్టేవాని కంటే లేదా ఆయన ఆయతులను అసత్యాలని కొట్టిపారేసేవాని కంటే పరమ దుర్మార్గుడెవడుంటాడు? అటువంటి వారికోసం రాసిపెట్టి ఉన్న భాగం వారికి లభించి తీరుతుంది. ఆఖరికి మా దూతలు వారి ప్రాణాలు స్వాధీనం చేసుకోవటానికి వారివద్దకు వచ్చినప్పుడు “అల్లాహ్‌ను వదలి మీరు ఆరాధిస్తూ ఉన్నవారు ఇప్పుడెక్కడున్నారు?” అని అడుగుతారు. “వారంతా మా వద్ద నుంచి మటుమాయమై పోయారు” అని వాళ్ళు చెబుతారు. తాము అవిశ్వాసులుగా ఉండేవారన్న విషయాన్ని గురించి వారు స్వయంగా సాక్ష్యమిస్తారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek