×

ఏ వ్యక్తి అయితే తన ప్రభువు తరఫు నుండి వచ్చిన స్పష్టమైన నిదర్శనం పై ఉన్నాడో! 11:17 Telugu translation

Quran infoTeluguSurah Hud ⮕ (11:17) ayat 17 in Telugu

11:17 Surah Hud ayat 17 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Hud ayat 17 - هُود - Page - Juz 12

﴿أَفَمَن كَانَ عَلَىٰ بَيِّنَةٖ مِّن رَّبِّهِۦ وَيَتۡلُوهُ شَاهِدٞ مِّنۡهُ وَمِن قَبۡلِهِۦ كِتَٰبُ مُوسَىٰٓ إِمَامٗا وَرَحۡمَةًۚ أُوْلَٰٓئِكَ يُؤۡمِنُونَ بِهِۦۚ وَمَن يَكۡفُرۡ بِهِۦ مِنَ ٱلۡأَحۡزَابِ فَٱلنَّارُ مَوۡعِدُهُۥۚ فَلَا تَكُ فِي مِرۡيَةٖ مِّنۡهُۚ إِنَّهُ ٱلۡحَقُّ مِن رَّبِّكَ وَلَٰكِنَّ أَكۡثَرَ ٱلنَّاسِ لَا يُؤۡمِنُونَ ﴾
[هُود: 17]

ఏ వ్యక్తి అయితే తన ప్రభువు తరఫు నుండి వచ్చిన స్పష్టమైన నిదర్శనం పై ఉన్నాడో! మరియు దానికి తోడుగా ఆయన (అల్లాహ్) సాక్ష్యం ఉందో! మరియు దీనికి ముందు మార్గదర్శిని మరియు కారుణ్యంగా వచ్చిన, మూసా గ్రంథం కూడా సాక్షిగా ఉందో! (అలాంటి వాడు సత్యతిరస్కారులతో సమానుడా?) అలాంటి వారు దీనిని (ఖుర్ఆన్ ను) విశ్వసిస్తారు. మరియు దీనిని (ఖుర్ఆన్ ను) తిరస్కరించే తెగల వారి వాగ్దాన స్థలం నరకాగ్నియే! కావున దీనిని గురించి నీవు ఎలాంటి సందేహంలో పడకు. నిశ్చయంగా, ఇది నీ ప్రభువు తరఫు నుండి వచ్చిన సత్యం. కాని చాలా మంది ప్రజలు విశ్వసించరు

❮ Previous Next ❯

ترجمة: أفمن كان على بينة من ربه ويتلوه شاهد منه ومن قبله كتاب, باللغة التيلجو

﴿أفمن كان على بينة من ربه ويتلوه شاهد منه ومن قبله كتاب﴾ [هُود: 17]

Abdul Raheem Mohammad Moulana
E vyakti ayite tana prabhuvu taraphu nundi vaccina spastamaina nidarsanam pai unnado! Mariyu daniki toduga ayana (allah) saksyam undo! Mariyu diniki mundu margadarsini mariyu karunyanga vaccina, musa grantham kuda saksiga undo! (Alanti vadu satyatiraskarulato samanuda?) Alanti varu dinini (khur'an nu) visvasistaru. Mariyu dinini (khur'an nu) tiraskarince tegala vari vagdana sthalam narakagniye! Kavuna dinini gurinci nivu elanti sandehanlo padaku. Niscayanga, idi ni prabhuvu taraphu nundi vaccina satyam. Kani cala mandi prajalu visvasincaru
Abdul Raheem Mohammad Moulana
Ē vyakti ayitē tana prabhuvu taraphu nuṇḍi vaccina spaṣṭamaina nidarśanaṁ pai unnāḍō! Mariyu dāniki tōḍugā āyana (allāh) sākṣyaṁ undō! Mariyu dīniki mundu mārgadarśini mariyu kāruṇyaṅgā vaccina, mūsā granthaṁ kūḍā sākṣigā undō! (Alāṇṭi vāḍu satyatiraskārulatō samānuḍā?) Alāṇṭi vāru dīnini (khur'ān nu) viśvasistāru. Mariyu dīnini (khur'ān nu) tiraskarin̄cē tegala vāri vāgdāna sthalaṁ narakāgniyē! Kāvuna dīnini gurin̄ci nīvu elāṇṭi sandēhanlō paḍaku. Niścayaṅgā, idi nī prabhuvu taraphu nuṇḍi vaccina satyaṁ. Kāni cālā mandi prajalu viśvasin̄caru
Muhammad Aziz Ur Rehman
ఒక వ్యక్తి తన ప్రభువు తరఫు నుండి వచ్చిన నిదర్శనాన్ని కలిగివున్నాడు, దాంతో పాటు అల్లాహ్‌ వద్ద నుంచి వచ్చిన దానిని సాక్షిగా కలిగి ఉన్నాడు,అంతకుమునుపు మార్గదర్శకంగా, కారుణ్యంగా ఉన్న మూసా గ్రంథాన్ని (కూడా సాక్షిగా) కలిగి ఉన్నాడు. అటువంటి వ్యక్తి (ఇతరులతో ఎలాసమానుడవుతాడు?) ఇలాంటి వారే దానిని (ఖుర్‌ఆన్‌ను) విశ్వసిస్తారు. అన్ని వర్గాలలోనూ ఎవరెవరు దానిని త్రోసిపుచ్చుతారో – వారికి వాగ్దానం చెయ్యబడిన – గమ్యస్థానం నరకం. కనుక (ఓప్రవక్తా!) దీని విషయంలో నువ్వు ఎలాంటి సందేహానికి లోను కారాదు. నిస్సందేహంగా ఇది నీప్రభువు తరఫు నుంచి వచ్చిన సత్యం. కాని చాలా మంది (ఈ సత్యాన్ని) విశ్వసించరు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek