×

ఇలా అడుగు: "భూమ్యాకాశాలకు ప్రభువు ఎవరు?" నీవే ఇలా జవాబివ్వు: "అల్లాహ్!" తరువాత ఇలా అను: 13:16 Telugu translation

Quran infoTeluguSurah Ar-Ra‘d ⮕ (13:16) ayat 16 in Telugu

13:16 Surah Ar-Ra‘d ayat 16 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Ar-Ra‘d ayat 16 - الرَّعد - Page - Juz 13

﴿قُلۡ مَن رَّبُّ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ قُلِ ٱللَّهُۚ قُلۡ أَفَٱتَّخَذۡتُم مِّن دُونِهِۦٓ أَوۡلِيَآءَ لَا يَمۡلِكُونَ لِأَنفُسِهِمۡ نَفۡعٗا وَلَا ضَرّٗاۚ قُلۡ هَلۡ يَسۡتَوِي ٱلۡأَعۡمَىٰ وَٱلۡبَصِيرُ أَمۡ هَلۡ تَسۡتَوِي ٱلظُّلُمَٰتُ وَٱلنُّورُۗ أَمۡ جَعَلُواْ لِلَّهِ شُرَكَآءَ خَلَقُواْ كَخَلۡقِهِۦ فَتَشَٰبَهَ ٱلۡخَلۡقُ عَلَيۡهِمۡۚ قُلِ ٱللَّهُ خَٰلِقُ كُلِّ شَيۡءٖ وَهُوَ ٱلۡوَٰحِدُ ٱلۡقَهَّٰرُ ﴾
[الرَّعد: 16]

ఇలా అడుగు: "భూమ్యాకాశాలకు ప్రభువు ఎవరు?" నీవే ఇలా జవాబివ్వు: "అల్లాహ్!" తరువాత ఇలా అను: "అయితే మీరు ఆయనను వదలి తమకు తాము మేలు గానీ, కీడు గానీ చేసుకోలేని వారిని, మీకు సహాయకులుగా (సంరక్షకులుగా) ఎన్నుకుంటారా?" ఇంకా ఇలా అడుగు: "ఏమీ? గ్రుడ్డివాడు మరియు చూడగలిగే వాడూ సమానులు కాగలరా? లేక అంధకారాలు మరియు వెలుగు సమానమేనా? లేక వారు (అల్లాహ్ కు) సాటి కల్పించిన వారు కూడా అల్లాహ్ సృష్టించినట్లు ఏమైనా సృష్టించారా, అందువలన సృష్టి విషయంలో వారికి సందేహం కలిగిందా?" వారితో అను: "అల్లాహ్ యే ప్రతిదానికి సృష్టికర్త. మరియు ఆయన అద్వితీయుడు, ప్రబలుడు (తన సృష్టిపై సంపూర్ణ అధికారం గలవాడు)

❮ Previous Next ❯

ترجمة: قل من رب السموات والأرض قل الله قل أفاتخذتم من دونه أولياء, باللغة التيلجو

﴿قل من رب السموات والأرض قل الله قل أفاتخذتم من دونه أولياء﴾ [الرَّعد: 16]

Abdul Raheem Mohammad Moulana
Ila adugu: "Bhumyakasalaku prabhuvu evaru?" Nive ila javabivvu: "Allah!" Taruvata ila anu: "Ayite miru ayananu vadali tamaku tamu melu gani, kidu gani cesukoleni varini, miku sahayakuluga (sanraksakuluga) ennukuntara?" Inka ila adugu: "Emi? Gruddivadu mariyu cudagalige vadu samanulu kagalara? Leka andhakaralu mariyu velugu samanamena? Leka varu (allah ku) sati kalpincina varu kuda allah srstincinatlu emaina srstincara, anduvalana srsti visayanlo variki sandeham kaliginda?" Varito anu: "Allah ye pratidaniki srstikarta. Mariyu ayana advitiyudu, prabaludu (tana srstipai sampurna adhikaram galavadu)
Abdul Raheem Mohammad Moulana
Ilā aḍugu: "Bhūmyākāśālaku prabhuvu evaru?" Nīvē ilā javābivvu: "Allāh!" Taruvāta ilā anu: "Ayitē mīru āyananu vadali tamaku tāmu mēlu gānī, kīḍu gānī cēsukōlēni vārini, mīku sahāyakulugā (sanrakṣakulugā) ennukuṇṭārā?" Iṅkā ilā aḍugu: "Ēmī? Gruḍḍivāḍu mariyu cūḍagaligē vāḍū samānulu kāgalarā? Lēka andhakārālu mariyu velugu samānamēnā? Lēka vāru (allāh ku) sāṭi kalpin̄cina vāru kūḍā allāh sr̥ṣṭin̄cinaṭlu ēmainā sr̥ṣṭin̄cārā, anduvalana sr̥ṣṭi viṣayanlō vāriki sandēhaṁ kaligindā?" Vāritō anu: "Allāh yē pratidāniki sr̥ṣṭikarta. Mariyu āyana advitīyuḍu, prabaluḍu (tana sr̥ṣṭipai sampūrṇa adhikāraṁ galavāḍu)
Muhammad Aziz Ur Rehman
“భూమ్యాకాశాలకు ప్రభువు ఎవరు?” అని వారిని అడుగు. “అల్లాహ్‌యే” అని వారికి చెప్పు. “అయినప్పటికీ మీరు ఆయన్ని కాదని, తమ స్వయానికి సయితం లాభంగానీ, నష్టంగానీ చేకూర్చలేని వారిని మీ రక్షకులుగా చేసుకుంటున్నారా?” అని వారిని అడుగు. “గుడ్డివాడూ – చూడగలిగేవాడు సమానులు కాగలరా? అంధకారాలూ – వెలుగూ ఒకటి కాగలవా? పోనీ, వారి దృష్టిలో ‘సృష్టి’ అనేది సందేహాస్పదం కావటానికి, వారు అల్లాహ్‌కు భాగస్వాములుగా చేర్చినవారుగాని అల్లాహ్‌ మాదిరిగా దేన్నయినా సృష్టించారా?” అని కూడా వారిని అడుగు. “అల్లాహ్‌యే అన్నింటినీ సృష్టించినవాడు. ఆయన ఒక్కడే. ఆయన సర్వాధిక్యుడు” అని వారికి స్పష్టంగా చెప్పు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek